landed
-
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని చంద్రుని ఉపరితలం..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. రోవర్ ప్రగ్యాన్ ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉందని ఇస్రో తెలిపింది. అన్ని ప్రక్రియలు అనుకున్న ప్రకారమే షెడ్యూల్లో పూర్తి అయ్యాయని స్పష్టం చేసింది. రోవర్ కదలికలు ప్రారంభమయ్యాయని తెలిపింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగేప్పుడు చివరి క్షణంలో తీసిన జాబిల్లి వీడియోను షేర్ చేసింది. Chandrayaan-3 Mission: All activities are on schedule. All systems are normal. 🔸Lander Module payloads ILSA, RAMBHA and ChaSTE are turned ON today. 🔸Rover mobility operations have commenced. 🔸SHAPE payload on the Propulsion Module was turned ON on Sunday. — ISRO (@isro) August 24, 2023 దక్షిణ ధృవంపైనే ఎందుకు..? చంద్రయాన్ 3 దిగ్విజయంగా జాబిల్లిపై కాలు మోపింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అయితే.. దక్షిణ ధృవాన్ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నపై ఇస్రో చీఫ్ సోమనాథ్ సమాధానమిచ్చారు. 'చంద్రుని దక్షిణ ధృవంపై సూర్మరశ్మి పడే అవకాశాలు లేవు. నీరు, ఖనిజాలకు సంబంధించిన వివరాలు లభించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా చంద్రుని నివాసానికి సంబంధించిన వివరాలు కూడా దక్షిణ ధృవం వద్ద లభిస్తాయి. అందుకే ఈ ధృవం వైపే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడానికి పలు దేశాలు ప్రయత్నించాయి' అని తెలిపారు. 'చంద్రయాన్ 2 ప్రయత్నంలో విఫలమైన తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమయ్యాం. ఓ ఏడాది చంద్రయాన్ 2లో జరిగిన తప్పిదాలపైనే అధ్యయనం చేశాం. మరో ఏడాది ఆ తప్పులను సరిచేయడంపైనే పనిచేశాం. మరో ఏడాది వాటిని పరీక్షించి చూసుకున్నాం. చివరగా నాలుగేళ్లకు చంద్రయాన్ 3ని ప్రయోగించాం.' అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై ల్యాండ్ అయింది. ఇప్పటికే ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. మరో 14 రోజులపాటు చంద్రునిపై పనిచేయనుంది. ఇదీ చదవండి: జాబిల్లిపై మూడు సింహాల అడుగులు.. రోవర్‌కు సారనాథ్ అశోక చిహ్నం.. -
టైరు పేలి కారు బావిలోకి.. తల్లీతనయుడి సహా మరొకరి మృతి
దుబ్బాక టౌన్: కారులో ఊరికి బయలుదేరిన తల్లీతనయుడిని విధి వక్రించింది. టైరు పేలడంతో కారు వెళ్లి నిండుగా నీళ్లున్న బావిలో పడిపోయి మృతిచెందారు. వాళ్లను ప్రాణాలతో బయటకు తీయడానికి వెళ్లిన ఓ గజ ఈతగాడు కూడా ఆ కారులోనే నీళ్లలో ఇరుక్కుపోయాడు. విగతజీవిగా మిగిలాడు. ఒకే ప్రమాదం రెండు ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. కారు పల్టీలు కొడుతూ.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు ఆకుల లక్ష్మి (45), ప్రశాంత్ (26) బుధవారం కారులో హుస్నాబాద్ బయల్దేరారు. చిట్టాపూర్ శివారుకు రాగానే మధ్యాహ్నం 1.13కి కారు టైరు పేలి రోడ్డు పక్కన 20 మీటర్ల దూరంలో ఉన్న బావిలో పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో బైక్‌పై అటుగా వెళ్తున్న వాహనదారుడు వెనక్కి చూసేసరికి కారు పల్టీలు కొడుతూ బావిలో పడింది. అతనితో పాటు మరికొందరు వాహనదారులు వెంటనే భూంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం భూంపల్లి పోలీస్ స్టేషన్‌కు కిలోమీటరు దూరంలోని కూడవెల్లి పెద్ద వాగు దాటాక చిట్టాపూర్ శివారులో ఉంది. మధ్యాహ్నం 2 గంటల్లోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో..: పోలీసులు ఫైర్, రెవెన్యూ, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఏసీపీ చల్లా దేవారెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు. అధికారులు, చిట్టాపూర్ సర్పంచ్ పోతనక రాజయ్య, ఎంపీటీసీ సభ్యుడు కనకయ్య, సమీప రైతులతో బావి వివరాలు సేకరించారు. సుమారు 16 గజాల లోతు బావి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ముందు గజ ఈతగాళ్లతో కలిసి పాతాల గరిగెల (హ్యాంగర్స్)తో గాలింపు చేపట్టారు. కానీ ఫలితం లేదు. నీరు ఎక్కువగా ఉండటంతో రెండు పెద్ద జనరేటర్లు పెట్టి ఎత్తిపోయడం మొదలుపెట్టారు. సాయంత్రం 4 గంటల కల్లా 2 గజాల వరకు నీటినే తోడేయగలిగారు. దీంతో చేగుంట, సిద్దిపేటల నుంచి రెండు భారీ క్రేన్లు తెప్పించారు. వాటి సాయంతో గజ ఈతగాళ్లు మళ్లీ గాలింపు మొదలుపెట్టారు. క్రేన్ల కొండి బావి లోపల ఉన్న కారుకు చిక్కుకున్నా నీరు ఎక్కువగా ఉండటంతో పైకి లేస్తున్న క్రమంలో కొండ్లు జారుతూ ఇబ్బందిగా తయారైంది. నీటిని తోడుతూ.. గాలిస్తూ..: మరో 4 మోటార్లు పెట్టి బావిలోని నీటిని తొలగిస్తూ క్రేన్లతో కారు వెలికితీతను అధికారులు కొనసాగించారు. సుమారు 7 గంటలు శ్రమించి రాత్రి 8.20కి కారును పైకి తీశారు. కారు నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు ఆకుల లక్ష్మి, ప్రశాంత్‌గా గుర్తించారు. రాములు లారీ డ్రైవర్ కాగా భార్య లక్ష్మి రోజువారీ పనులకు వెళ్లేది. ప్రశాంత్ ఐటీఐ పూర్తి చేసి రామాయంపేట మండలంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కూతురు రేవతి డైట్ సెట్‌కు ప్రిపేర్ అవుతోంది. కారులో ఇరుక్కుపోయిన గజ ఈతగాడు బావిలోంచి కారు తీసే క్రమంలో దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన గజ ఈతగాడు బండకాడి నర్సింహులు (40) మృతి చెందాడు. బుధవారం సాయంత్రం 3 గంటలకు తోటి గజ ఈతగాళ్లతో కలిసి నర్సింహులు గాలింపు చర్యల్లో పాల్గొన్నాడు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో చాలాసార్లు క్రేన్ కొండిని తగిలించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మోటార్లతో రాత్రి 8 గంటల వరకు 5 గజాలకు పైగా నీటిని తోడారు. తర్వాత క్రేన్ కొండిని కారుకు తగిలించేందుకు బావి లోపలికి వెళ్లాడు. కారుకు కొండిని తగిలించి అందులోనే ఇరుక్కుపోయా డు. క్రేన్ సాయంతో కారును పైకి తీస్తుండగా కారుకు, తాళ్లకు మధ్య చిక్కుకొని అపస్మారక స్థితిలో కనిపించాడు. తాళ్లను కొంత పైకి లాగాక ఒక్కసారిగా నీటిలో పడిపోయాడు. అతడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పటివరకు సహాయక చర్యలో ఉన్న గజ ఈతగాళ్లు కూడా వెళ్లిపోయారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే: పోలీసులు, ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నర్సింహులు మృతి చెందాడంటూ అతని కుటుంబీకులు, బంధువులు రామాయంపేట–సిద్దిపేట రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు బావిలో దిగకుండా ప్రైవేట్ వ్యక్తులను బావిలోకి దింపి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఉగ్ర కలకలం.. విమానం అత్యవసర ల్యాండింగ్
డల్లాస్: విమానంలో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని అత్యవసరంగా టెక్సాస్‌లోని లబ్బక్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. కాలిఫోర్నియా నుంచి విమానం డల్లాస్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు. కాలిఫోర్నియాకు చెందిన జెర్రీ బా గుయెన్ (24) అనే యువకుడు తోటి ప్రయాణికులకు హానికలిగించే విధంగా ప్రవర్తించాడని తెలిపిన ఎయిర్‌లైన్స్ అధికారులు మిగతా వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలతో జెర్రీపై కేసు నమోదు చేశారు. స్థానిక అసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిందితుడిని లబ్బాక్ కౌంటీ జైలుకు తరలించారు. ఈ ఘటనతో 143 మంది ప్రయాణికులతో ఉన్న విమానం గంట ఆలస్యంగా డల్లాస్ ఫోర్ట్‌వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. -
చినుకు పడినా చింతే
పంటలను ఆదుకునే పరిస్థితి లేదు.. జల్లులతో పెరగని భూగర్భ జలాలు ఈ నెలలో బాగా తగ్గిన వర్షపాతం ఖమ్మం వ్యవసాయం : జిల్లాలో కురుస్తున్న వర్షాలు పంటలను ఆదుకునేలా లేవు. భూగర్భ జలాల పెంపునకు ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నాయి. జూన్‌లో వర్షాలు ఆశాజనకంగా ఉండగా.. ఆ తరువాత నెలల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి కొంత మేరకు ముందుగానే చేరి.. జూన్‌లో ఆశించిన మేరకు వర్షాలు కురిశాయి. జూన్‌లో జిల్లా సాధారణ వర్షపాతం 127 మి.మీలు కాగా.. 337.1 మి.మీ వర్షపాతం నమోదైంది అంటే 164.4 మి.మీ వర్షపాతం సాధారణం కన్నా అధికంగా నమోదైంది. జూలై నెల సాధారణ వర్షపాతం 309.0 మి.మీలు కాగా.. 185.8 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే –39.8 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెల కూడా అదే పరిస్థితి నెలకొంది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 276 మి.మీలు కాగా.. 29వ తేదీ నాటికి 117.4 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే –54 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ పంటల సాగుకు జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలు, వర్షపాతమే కీలకం. ఈ రెండు నెలల్లో అనుకూలంగా వర్షాలు కురిస్తే ప్రాజెక్టుల్లోకి నీరు చేరి.. సాగు విస్తీర్ణం పెరుగుతుంది. కానీ.. ఈ ఏడాది దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వరి సాగు ఈ రెండు నెలల్లో మాత్రమే బాగా ఉంటుంది. ప్రస్తుతం ఆశించిన మేర వర్షాలు లేకపోవటంతో వరి పంట బాగా వెనుకబడింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 1,25990 హెక్టార్లు కాగా.. ఆగస్టు చివరి నాటికి కేవలం 49,902 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో కొంత మేరకు ప్రాజెక్టుల్లోకి, పెద్ద చెరువుల్లోకి నీరు చేరటంతో వరి సాగు చేస్తున్నారు. ప్రధానంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరకపోవటంతో జిల్లాలో దాదాపు 1.05లక్షల హెక్టార్లలో వరి పంట దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఆగస్టు ఆరంభంలో 4వ తేదీ వరకు వర్షాలు అనుకూలంగా కురిశాయి. అప్పటి వరకు జిల్లా సాధారణ వర్షపాతం 35.6 మి.మీలు కాగా.. అంతకుమించి 53.9 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే అప్పటికి సాధారణాన్ని మించి 51.2 మి.మీ వర్షపాతం అధికంగా నమోదైంది. ఇక అప్పటి నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. వరుసగా 20 రోజులపాటు అంటే 24వ తేదీ వరకు వర్షాలు కురవలేదు. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా 24వ తేదీ నుంచి అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 5 రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశించిన మేరకు మాత్రం వర్షపాతం నమోదు కావటం లేదు. 29వ తేదీ నాటికి 258.4 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 117.4 మి.మీల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆగస్టు ఆరంభంలో మొదటి 4 రోజులు కురిసిన వర్షపాతం 50 మి.మీలకు పైగా ఉండగా.. ఇదే నెల చివరి వారంలో కేవలం మరో 50 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే 25 రోజుల కాలంలో 260 మి.మీల మేరకు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 67 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆగస్టు 29న 6.3 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. తిరుమలాయపాలెం మండలంలో అధికంగా 6.68 సెం.మీ వర్షపాతం నమోదుకాగా.. 3–6 సెం.మీ మధ్య ముదిగొండ, ఖమ్మం అర్బన్, బయ్యారం మండలాల్లో వర్షం కురిసింది. మరో 3 మండలాల్లో 1–3 సెం.మీ మధ్య వర్షపాతం నమోదైంది. రెండు మండలాల్లో 1 సెం.మీ లోపు వర్షపాతం నమోదైంది. పైర్లకు అంతంత మాత్రమే.. ఆగస్టులో వరుసగా వర్షాలు లేకపోవటంతో పెసర, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పెసర 2వేల హెక్టార్లకు పైగా ఎండిపోయింది. మొక్కజొన్న కూడా దాదాపు 4వేల హెక్టార్లలో ఎండిపోయింది. ఇక పత్తి ఎదుగుదల లోపించింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వడబడ్డ పత్తి కొంత మేరకు ప్రాణం పోసుకున్నా ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేదు. పూత, కాత కూడా కుచించుకుపోయింది. నల్లరేగడి నేలల్లో పత్తి ఆశాజనకంగా ఉన్నా.. ఎర్ర, దుబ్బ నేలల్లో మాత్రం బాగా దెబ్బతిన్నది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు పైరు ఎదుగుదలకు, పూత, కాత వచ్చేందుకు ఎరువులు వేస్తున్నారు. వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో పడటం లేదని, పాటు చేసే వర్షాలు కూడా పడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెసర కొంత మేరకు చేతికి అందగా, ఆలస్యంగా వేసిన పెసర మాత్రం ఎండిపోయిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కూడా పెసరకు ఉపయోగం లేదని అంటున్నారు. మొక్కజొన్న వర్షాధారంగా ప్రధానంగా వేసిన బయ్యారం, ఇల్లెందు, టేకులపల్లి, గుండాల వంటి ప్రాంతాల్లో అనుకూలమైన సమయాల్లో వర్షలు పడకపోవటంతో కంకి పాలుపోసుకునే దశలో ఎండిపోయిందని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఈ పైరుకు ఎంత మాత్రం ఉపయోగపడవని రైతులు వాపోతున్నారు. వరి పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల వరి ఆశించిన మేరకు ఎదుగుదల లేదని రైతులు చెబుతున్నారు. ఇక రైతులు మిర్చిపై మాత్రం ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే జిల్లాలో 16వేల హెక్టార్లలో మిర్చి పంటను రైతులు వేశారు. మరో 10వేల హెక్టార్లలో పంట సాగు చేసే అవకాశం ఉంది. అయితే రైతులు ఈ పంటకు కూడా వర్షాలు కురుస్తాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశలు పెట్టుకున్నారు.