వాష్టింగన్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. ఏడు రోజులుగా జరుగుతున్న హోరాహోరి పోరులో రెండు దేశాల సైన్యం శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి. చావును సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న ఉక్రెయిన్ సైన్యం తెగువ చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు రష్యా చర్చను వ్యతిరేకిస్తూ ఆర్ధికపరమైన కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ పుతిన్ మాత్రం వెనకంజ వేయకుండా తగ్గేదేలే అన్నట్టుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉండగా రష్యాకు అగ్ర రాజ్యం అమెరికా మరో వార్నింగ్ ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగవారం కాంగ్రెస్ సంయుక్త సమావేశం ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు ఉంటుందని పేర్కొన్న బైడెన్.. రష్యాతో జరిగే పోరాటంలో అమెరికా మాత్రం పాల్గొనబోదని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ గడ్డపై అమెరికా బలగాలు రష్యాతో పోరాడబోవని బైడన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సైన్యం రష్యా బలగాలను నిలువరిస్తూ వారి దాడులను తిప్పికొడుతోందని ప్రశంసించారు. ఉక్రెయిన్ దేశ పౌరులు సైతం తుపాకులు చేతపట్టుకొని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై సైనిక దాడులకు దిగిన రష్యా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. రష్యా, పుతిన్‌పై రానున్న కాలంలో యుద్ద ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో పుతిన్ గెలిచినా, ఓడినా.. ఆర్థిక పరంగా, ఇతర అంశాల విషయంలో రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఓ నియంత.. అతడి అంతు చూస్తామంటూ బెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రష్యాపై మరిన్ని ఆంక్షలు..
బైడెన్.. రష్యాపై మరిన్ని ఆంక్షలను విధించారు. రష్యా విమానాల రాకపోకలు అమెరికా మీదుగా వెళ్లకుండా గగనతలాన్ని మూసివేసింది. ఫలితంగా రష్యా విమానాలు ఇకపై అమెరికా మీదుగా రాకపోకలు సాగించలేవు. కాగా, ఇప్పటికే యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాలు రష్యా గగనతలాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెందిన విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు, ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్‌లను సీజ్ చేస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment