టామీ షూ స్పేర్స్
న్యూయార్క్ : సరైన సౌకర్యాలు కల్పించలేదని, అవమానించటమే కాకుండా మానసిక ఒత్తిడికి గురిచేశారంటూ ఓ మహిళ అమెరికన్ ఏయిర్‌లైన్స్, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలపై న్యాయపోరాటానికి దిగింది. ఈ సంఘటన అమెరికాలోని ఉతాహ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. ఇడాహోకు చెందిన దివ్యాంగురాలైన టామీ షూ స్పేర్స్ ఆగస్టు 10న సాల్ట్ లేక సిటీనుంచి చార్‌లోటీకి వెళ్లటానికి చీప్ ఓ ఏయిర్ అనే ఆన్‌లైన్ సంస్థలో టిక్కెట్ బుక్ చేసుకుంది. దివ్యాంగురాలైన ఆమెకు అమెరికన్ ఏయిర్ లైన్స్ గానీ, చీప్ ఓ ఏయిర్ సంస్థగానీ విమానాన్ని ఎక్కటానికి వీల్ చైర్ కేటాయించలేదు. ప్రయాణ సమయంలో విమానంలోని వాష్‌రూమ్‌ను వాడుకోవాలని అడిగితే. వీల్‌చైర్ లేదని, వాష్‌రూమ్ వరకు ఒంటికాలుతో గెంతుకుంటూ వెళ్లమని సలహా ఇచ్చారు సిబ్బంది. చివరకు దోక్కుంటూ వెలుతుండగా ఓ నర్సు ఆమెపై జాలిచూసింది. వాష్‌రూం వరకు తీసుకెళ్లింది. వాష్ రూం ఉపయోగించుకోవటానికి కూడా దారుణమైన ఆంక్షలు పెట్టారు. తలుపు తెరిచే వాడుకోమన్నారు.( కరోనా: వారు మరణించే అవకాశం ఎక్కువ!)
అంతేకాకుండా ఏయిర్ లైన్స్ సిబ్బంది తనో దివ్యాంగురాలనే కనీస జాలి లేకుండా ప్రవర్తించారు. దీంతో కలత చెందిన ఆమె అమెరికన్ ఏయిర్ లైన్స్, చీప్ ఓ ఏయిర్‌లపై డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ నార్తెన్ డిస్ట్రిక్ట్ ఆప్ ఉతాహ్‌ను ఆశ్రయించింది. మంగళవారం రెండు సంస్థలపై దావా వేసింది. దీనిపై స్పందించిన అమెరికన్ ఏయిర్‌లైన్స్‘‘ మేము మా ప్రయాణికుల బాగోగుల విషయంలో జాగ్రత్తగా ఉంటాము. ఆమె ఎందుకిలా మాపై ఫిర్యాదు చేసిందో తెలియటం లేదు. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నామ’’ ని తెలిపారు. చీప్ ఓ ఏయిర్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ మా కస్టమర్లకు ఎవరికైనా ప్రత్యేక సౌకర్యాలు కావాల్సి వస్తే అందుకోసం మా సైట్‌లో ఏర్పాట్లు ఉన్నాయి. మా రికార్డు ప్రకారం ఆమె ప్రత్యేక సౌకర్యాల కోసం వినతి చేసుకోలేదు. ఆమె చాలా ఇబ్బంది పడ్డందుకు మాకు బాధగా ఉంది. ఈ సమస్య ఏయిర్‌లైన్స్, ఆమెకు మధ్యది. మాకు దానితో సంబంధం లేదు’’ అన్నారు. ( కరోనా భయం: మాస్క్ మాటున కన్నీళ్లు!)
Comments
Please login to add a commentAdd a comment