
ఎప్పటికీ అమరుడే
- ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన జర్నలిస్ట్
- అవయవదానంతో పలువురికి ప్రాణంపోసిన కుటుంబ సభ్యులు
కొరుక్కుపేట(తమిళనాడు)
చనిపోతూకూడా మరొకరి జీవితాల్లో వెలుగులు నింపాడు 35 ఏళ్ల యువకుడు సుదర్శన్. తమిళ టీవీ చానల్ పుదియ తలైమురై టీవీలో సీనియర్ న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్న సుదర్శన్(35) ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. ఈ కారణంగా బ్రెయిన్‌డెడ్‌కావడంతో అతని కుటుంబసభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చి, సుదర్శన్ అవయవాలను దానం చేశారు.
వివరాలు.. సీనియర్ న్యూస్ ఎడిటర్ సుదర్శన్ ఈనెల 16 వతేది పుదుచ్చేరి నుంచి చెన్నైకు టెంపోట్రావెల్‌లో వస్తుండగా ఆ రోజు సరిగ్గా 3:30 గంటల సమయంలో టెంపోట్రావెల్‌ను బస్సు ఢీ కొట్టింది. దీంతో సుదర్శన్‌తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు పుదుచ్చేరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆ రోజు రాత్రి 9:30 గంటల సమయంలో చెన్నై వడలపనిలోని సిమ్స్ ఆసుపత్రిలో న్యూరో ఐసీయూలో ఉంచి చికిత్స చేపట్టారు. సుదర్శన్‌కు మెరుగైన వైద్యం అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని దీంతో ఈనెల 23వ తేదీ సాయంత్రం 4:54 గంటలకు బ్రెయిన్‌డెడ్ అయినట్లు న్యూరాలజిస్టులు నిర్ధారించారని సిమ్స్ ఆసుపత్రి మెడికల్ సర్వీస్ డెరైక్టర్ డాక్టర్ విజయకుమార్ చోక్కాన్ తెలిపారు.
దీంతో సుదర్శన్ కుటుంబసభ్యులతో అవయువదానంపై చర్చించగా వారు సుదర్శన్ అవ యవాలను దానం చేసేందుకు ముందుకు వాచ్చారు. తమిళనాడు కేడవెర్ ట్రాన్స్‌ప్లాంట్ పోగ్రామ్ అథారిటీస్ అనుమతితో సిమ్స్ వైద్యులు సుదర్శన్ అవయువాలు లివర్,కిడ్నీ, ,హర్ట్‌వాల్వలు, నేత్రాలు, స్కిన్‌ను తీసుకున్నారు. లివర్, ఒక కిడ్నీని ఈనెల 23వతేదీన సిమ్స్ ఆసుపత్రిలోని రోగులకు ట్రాన్స్‌ప్లాంట్ చేయగా, మిగిలిన కిడ్నీ,హర్ట్, పాంక్రియాస్‌లు చెన్నైలోని పలు అసుపత్రులకు అందించారు. బ్రెయిన్ డెడ్ కు గురైన సుదర్శన్ కు భార్య దీపాతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అవయువదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని, సుదర్శన్ కుటుంబ సభ్యులు అవ యవదానం చేసేందుకు ముందుకు రావడంపై సిమ్స్ వైద్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.