టాప్ టెక్నాలజీ సంపన్నులెవరో తెలుసా..
న్యూయార్క్: సాధారణంగా ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల వార్షిక నివేదికను ప్రతి ఏడాది విడుదల చేస్తుంది. 2016కు కూడా వందలమందితో ఆ జాబితాను ప్రకటించింది. అయితే, వీరిలో కేవలం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కుబేరులుగా ఎదిగినవారు చాలామంది ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విలువ ఈ రోజుల్లో అంతాఇంతా కాదు.
ఇది వ్యక్తుల అవసరాలు తీర్చడంలో ఎంత వేగంగా ఉపయోగపడుతుందో అంతేవేగంగా దీనిని అందించేవారికి సంపదను కూడా ఆర్జించి పెడుతుంది. ఇలా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ ప్రపంచంలోనే కుబేరులైనవారు ఎంతోమంది ఉన్నారు. వారిలో టాప్ టెన్ జాబితా ఒకసారి పరిశీలిస్తే అందులో తొమ్మిదిమంది అమెరికన్లు ఉండగా చైనా నుంచి ఒక్కరు మాత్రమే ఉన్నారు.
ఒకసారి వివరాలు పరిశీలిస్తే..
1. బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు (సంపద 75 బిలియన్ డాలర్లు, అమెరికా)
2. జెఫ్ బెజోస్, అమెజాన్ స్థాపకుడు, సీఈవో (సంపద 45.2బిలియన్ డాలర్లు, అమెరికా)
3. మార్క్ జూకర్ బర్గ్, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు (సంపద 45.6 బిలియన్ డాలర్లు, అమెరికా)
4. లారీ ఎల్లిసన్, ఒరాకిల్ సంస్థ వ్యవస్థాపకుడు (సంపద 43.6 బిలియన్ డాలర్లు, అమెరికా)
5. లారీ పేజ్, గూగుల్ వ్యవస్థాపకుడు, ఆల్పాబెట్ సీఈవో, (సంపద 35.2డాలర్లు, అమెరికా)
6. సెర్జీ బ్రిన్, అల్పాబెట్ అధ్యక్షుడు (సంపద 34.4 బిలియన్ డాలర్లు, అమెరికా)
7. స్టీవ్ బామర్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో (సంపద 23.5 బిలియన్ డాలర్లు, అమెరికా)
8. జాక్ మా, అలీబాబా వ్యవస్థాపకుడు (సంపద 20.5 బిలియన్ డాలర్లు, అమెరికా)
9. మైఖెల్ డెల్, డెల్ కంపెనీ బోర్డు చైర్మన్ (సంపద 19.8 బిలియన్ డాలర్లు, అమెరికా)
10. మా హువాతెంగ్, టెన్సెంట్ హోల్డింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు (సంపద 16.6 బిలియన్ డాలర్లు, చైనా