
అమెరికాలో భారత విద్యార్థి మృతదేహం లభ్యం
అమెరికాలో బుధవారం అదృశ్యమైన భారత సంతతి విద్యార్థి ఆలాప్ నరసిపురా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
న్యూయార్క్: అమెరికాలో బుధవారం అదృశ్యమైన భారత సంతతి విద్యార్థి ఆలాప్ నరసిపురా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఇట్హాచా జలపాతం సమీపంలోని ఫాల్ క్రీక్‌లో శనివారం నరసిపురా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నరసిపురా కార్నెల్ వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యనభ్యసిస్తున్నారు.
ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని..ఇంకా నిందితులెవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు. నరసిపురా మృతిపై వర్సిటీ క్యాంపస్ ఉపాధ్యక్షుడు రెయాన్ లంబార్డీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అతను కార్నెల్ వర్సిటీలోనే ఇంజినీరింగ్ మాస్టర్ డిగ్రీ పూర్తిచేయాలనుకున్నాడని తెలిపారు.