
అమెరికన్ పాప్ సింగర్ పింక్ (ఫైల్ ఫోటో)
న్యూయార్క్ : ఆమె పాడే పాటలకు వేలాది మంది అభిమానులు.. తను ఇచ్చే మ్యూజిక్ షోలతో అభిమానులకు, ఈవెంట్ ప్రొడ్యూసర్‌లకు పండగే. ఈ సింగర్ మైకు చేత పట్టి పాట పాడితే అవార్డులు సైతం దాసోహం అవుతాయి. ఆమె ఎవరో కాదు మూడు గ్రామీ పురస్కారాల గ్రహీత, అమెరికన్ పాప్ సింగర్, రచయిత అలిసియా బెత్ మూర్(పింక్).
ఓ ఈవెంట్ సంస్థ న్కూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో పింక్ బృందంతో మ్యూజికల్ షోను ఏర్పాటు చేసింది. ఈ షోలో సొంతంగా కంపోజ్ చేసి, ఇప్పటికే ఎన్నో స్టేజిల మీద పాడి విజయవంతమైన పాటను పాడటానికి పింక్ సిద్ధం అయ్యారు. తన టీంతో కలిసి పాట పాడటం ప్రారంభించిన పింక్ మధ్యలో తడబడ్డారు. పాట చరణాలు మరిచిపోయి కోరస్ బృందం సహాయంతో పాట పూర్తి చేశారు. ఆ విషయాన్ని గమనించిన ప్రేక్షకులు నవ్వుతూ ఉండటంతో పాట పాడటం అయిపోయాక క్షమించండి పాట మరిచిపోయాను అని పింక్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment