శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన ప్లే న్యూస్ స్టాండ్ యాప్‌ను న్యూస్ యాప్‌గా మార్చింది. ఈ న్యూస్ యాప్‌లో కొత్త ఫీచర్లను జత చేసింది. డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఇటీవల చేసిన వాగ్దానం నేపథ్యంలో గూగుల్ అధికారికంగా ఐవోఎస్‌కోసం "గూగుల్ న్యూస్" యాప్ ను ప్రారంభించింది. న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత యాప్‌ను మెషిన్-లెర్నింగ్ టెక్నాలజీతో రూపొందించింది. ఈ కొత్త అప్‌డేట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ ప్లాట్‌ఫాంలపై వచ్చే వారం నుంచి లభ్యం కానుంది. ఫర్ యు, ఫుల్ కవరేజ్, న్యూస్ స్టాండ్ అనే మూడు ఎంపికలతో వస్తుంది, ఈ క్రమంలో, 2014 లో ప్రారంభించిన గూగుల్ ప్లే న్యూస్ స్టాండ్‌ను యూజర్లు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారంలో ఈ కొత్త యాప్ అప్‌డేట్ 127 దేశాల యూజర్లకు అందుబాటులోకి వస్తుందని గూగుల్ ప్రకటించింది.
గూగుల్ న్యూస్ యాప్ పూర్తిగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా పనిచేస్తుంది. యూజర్లకు చెందిన ప్రాంతం, భాష తదితర అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అందుకు తగిన విధంగా న్యూస్ అప్‌డేట్లను సదరు యాప్‌లో అందిస్తుంది. ఫర్ యూ అనే ఫీచర్ సహాయంతో యూజర్లు అత్యంత ముఖ్యమైన వార్తలు ఐదింటిని తెలుసుకోవచ్చు. యూజర్ అభిరుచులకు అనుగుణంగా ఇవి యాప్‌లో కనిపిస్తాయి. అలాగే ఫుల్ కవరేజ్ అనే మరో ఫీచర్ కూడా ఈ యాప్‌లో లభిస్తుంది. దీని వల్ల ఏదైనా అంశం గురించి లోతుగా పూర్తి సమాచారాన్ని రియల్ టైంలో యూజర్లు తెలుసుకోవచ్చు. ఎక్కువగా స్థానిక వార్తలు యూజర్లకు తెలిసేలా న్యూస్ యాప్‌లో సదుపాయం కల్పించారు. దీని వల్ల యూజర్లకు తమ చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో మరింత స్పష్టంగా తెలుసుకునే అవకాశం.
న్యూస్ స్టాండ్ ఆప్షన్‌లో , వెబ్ వార్త కోసం నెలవారీ సబ్స్క్రిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం స్పెషల్ స్ప్లాష్ పేజీని క్రియేట్ చేసింది. తద్వారా మొబైల్ బ్రౌజర్ ద్వారా బౌన్సింగ్ బెడద లేకుండా చాలా క్విక్ అండ్ క్లీన్‌గా వార్తలను లోడ్ చేస్తుంది. అంతేకాదు ఫేవరేట్ సెక్షన్ అనే మరో ఆప్షన్‌ను కూడా జోడించింది. దీని ద్వారా అభిమాన స్టార్ల వార్తలను తెలుసుకోవచ్చు. దీంతోపాటు కంటెంట్‌ను సేవ్ చేసుకుని తీరిక ఉన్నపుడు చదువుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment