
సాక్షి, హైదరాబాద్ : ప్రజాసంకల్పయాత్రలో నడిచేది తనే అయినా.. నడిపించేది మాత్రం ప్రజల అభిమానమేనని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. ఎక్కడ పులివెందుల.. ఎక్కడ కొత్తవలస అని, దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానంతోనే ప్రజాసంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు మైలురాయి దాటిందని స్పష్టం చేశారు. 269వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కొత్తవలస బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
నడిచేది నేను.. నడిపించేది ప్రజల అభిమానం: వైఎస్ జగన్
మెట్రో సేవలను వినియోగించుకోవాలి: గవర్నర్
అలుపెరుగని బాటసారి @ 3000 కి.మీ