ట్రంప్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఇ‍ప్పట్లో పెట్టరంట! | Donald Trump postpones news conference until January | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఇ‍ప్పట్లో పెట్టరంట!

Published Tue, Dec 13 2016 6:05 PM | Last Updated on Wed, Oct 17 2018 4:53 PM

ట్రంప్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఇ‍ప్పట్లో పెట్టరంట! - Sakshi

ట్రంప్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఇ‍ప్పట్లో పెట్టరంట!

న్యూయార్క్‌: అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ తన తొలి పత్రికా సమావేశాన్ని అనూహ్యంగా వాయిదా వేశారు. ఇప్పట్లో ప్రెస్‌ మీట్‌ నిర్వహించకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. జనవరి వరకు మీడియా ముందుకు రాకూడదని ట్రంప్‌ అనుకున్నారని ప్రస్తుతం శ్వేత సౌదం నుంచి అధికార బదిలీ వ్యవహారాలు చూస్తున్న ట్రంప్‌ అధికార ప్రతినిధి హోప్‌ హిక్స్‌ తెలిపారు.

వాస్తవానికి అధికార బదిలీ నేపథ్యంలో ట్రంప్‌ ఈ గురువారం తొలి పత్రికా సమావేశం నిర్వహిస్తారని, అందులో ఆయన వ్యూహాలు, దేశాన్ని ముందుకు నడిపించేందుకు కొత్తగా సిద్ధం చేసిన విధానాలు, వివాదాల విషయంలో తీసుకోబోయే పరిష్కార మార్గాలు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ ప్రకటనతో ఇప్పటివరకు తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా ఈ ఒక్క ప్రకటనతో తనవైపునకు తిప్పుకునేలా పత్రికా సమావేశానికి కావాల్సిన సమాచారం సిద్ధం చేసినట్లు తెలిపారు. అయితే, జనవరి వరకు అలాంటి కార్యక్రమం పెట్టుకోవద్దని ట్రంప్ మనసు మార్చుకున్నట్లు తెలిసింది. ట్రంప్‌ అధ్యక్షుడిగా జనవరిలోనే ప్రమాణం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement