మైస్టాంప్స్‌లోనే గ్రీటింగ్‌కు అవకాశం | greetings with my stamp | Sakshi
Sakshi News home page

మైస్టాంప్స్‌లోనే గ్రీటింగ్‌కు అవకాశం

Published Fri, Dec 30 2016 10:01 PM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

మైస్టాంప్స్‌లోనే గ్రీటింగ్‌కు అవకాశం - Sakshi

మైస్టాంప్స్‌లోనే గ్రీటింగ్‌కు అవకాశం

- తపాలా వినియోగదారులకు నూతన సంవత్సర కానుక
- పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.వి.సుబ్బారావు వెల్లడి
 
కర్నూలు (ఓల్డ్‌సిటీ): తపాలా వినియోగదారులకు ఆ శాఖ అధికారులు నూతన సంవత్సర కానుకగా 'మైస్టాంప్‌'లో సొంత  ఫొటోతో పాటు గ్రీటింగ్స్‌ చెప్పుకునే సదుపాయం కూడా కల్పించారు. పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.వి.సుబ్బారావు శుక్రవారం తన ఛాంబరులో మొదటి ఇద్దరు వినియోగదారులకు వారి ఫొటోలతో ఉన్న గ్రీటింగ్‌ మైస్టాంప్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాలకే పరిమితమైన పోస్టల్‌ శాఖ  కాలానుగుణంగా నిత్యనూతన సేవలను అందిస్తోందన్నారు. కొత్త సంవత్సరంలో బంధు మిత్రులకు గ్రీటింగ్స్‌ పంపించుకుంటారని, అయితే ఆ గ్రీటింగ్‌ కవర్‌పై అతికించిన స్టాంపులు సైతం సొంత ఫొటోతో ఉండటం, ఆపై అందులో 'హ్యాపీ న్యూఇయర్‌' అంటూ గ్రీటింగ్స్‌ కూడా ముద్రించి ఉండటం వినియోగదారులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. వినియోగదారులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement