- నూతన సంవత్సర వేడుకల్లో నాయకులు, అధికారులు
- కేకులు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్న వైనం
- కలెక్టర్‌కు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు
కర్నూలు అగ్రికల్చర్: నూతన సంవత్సరం సందర్భంగా నేతలు, ఉద్యోగులు ఆదివారం బిజీబిజీగా గడిపారు. ఓ వైపు తమ అభిమాన నేతలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు, మరో వైపు ఉన్నతాధికారులకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పేందుకు కర్నూలుకు తరలివచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, నేతల గృహాలు కిటకిటలాడాయి. జిల్లా యంత్రాంగం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు , వివిధ స్థాయి ఉద్యోగులు కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను కలిసి 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ఉద్యోగ సంఘాల నేతలు కలెక్టర్ చేత క్యాలెండర్లు ఆవిష్కరించారు. నూతన సంవత్సర కేకులను కలెక్టర్ చేత కట్ చేయించారు. అలాగే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి దంపతులు, డోన్‌లో పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అభిమానులు బొకేలు అందించి శుభకాంక్షలు తెలిపారు.
జిల్లాను ప్రగతిపథంలో నిలుపుదాం
కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పని చేసి జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జిల్లాను అభివృద్దిలో మొదటి స్థానానికి తీసుకెళ్దాన్నారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, జేసి–2 రామస్వామి, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, సీపీఓ ఆనంద్ నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, ట్రెజరీ డీడీ శివఅర్జన్‌కుమార్, జడ్పీ సీఈఓ ఈశ్వర్, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, విద్యుత్ ఎస్‌ఈ బార్గవరాముడు , శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, హౌసింగ్ పీడీ హుసేన్‌సాహెబ్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, గొర్రెల సంఘం అధ్యక్షడు నాగేశ్వరయాదవ్, ఆర్‌డీఓలు రఘుబాబు, సుధాకర్‌రెడ్డి, ఓబులేసు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, మిగిలిన శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ అధికారులు తదితరులు తరలివచ్చి కలెక్టర్‌కు బొకేలు సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టర్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు:
జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి, జవహార్‌లాల్, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌బాబు, గిరికుమార్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టిఎండీ హుస్సేన్, జిల్లా నేతలు రామన్న, వేణుగోపాల్, నాగమణి ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు సర్దార్ అబ్దుల్ హమీద్, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు తదితర ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు కూడా కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
- జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌ను వివిధ శాఖల అధికారులు, ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు క్యాంపు కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
- జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడుకు ఆర్డీఓలు, తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, వివిదశాఖల అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.