కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో న్యూ ఇయర్ వేడుకలు
కర్నూలు: జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పోలీసు అధికారులు ఆదివారం ఉదయం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలిరావడంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ కిటకిటలాడింది. జేసీ హరికిరణ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ ప్రాంతీయ అధికారి శివకోటిబాబురావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్‌డీ రవిప్రకాష్, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, ప్రతినిధి బృందం శేఖర్‌బాబు, రామకృష్ణ, నాగభూషణం, హోంగార్డు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు విజయరత్నం డీఎస్పీలు రమణమూర్తి, బాబా ఫకృద్దీన్, సుప్రజ, వీరరాఘవరెడ్డి, కొల్లి శ్రీనివాసరావు, బాబుప్రసాద్, హరినాథరెడ్డి ఎస్పీని కలిసి పూలబోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
సబ్‌డివిజన్ అధికారులతో పాటు సీఐలు కూడా ఎస్పీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీ.క్యాంపులో నివాసం ఉంటున్న డీఐజీ బంగ్లా, జిల్లా పోలీసు కార్యాలయంలోని ఏఆర్ అడిషనల్ ఎస్పీ కార్యాలయం కూడా పోలీసు అధికారులతో కిటకిటలాడాయి. ఏపీఎస్‌పీ రెండో పటాలంలో పనిచేస్తున్న పలువురు అధికారులు కమాండెంట్ విజయకుమార్‌ను కలిసి పూలబొకే ఇచ్చిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.