వరస్ట్ జాబ్ ఏదో తెలుసా?
వాషింగ్టన్: ఉద్యోగాల్లో బెస్ట్, వరస్ట్ జాబ్స్ ఏవో తెలుసా? న్యూస్ పేపర్ రిపోర్టర్ చెత్త ఉద్యోగమని సర్వేలో తేల్చారు. డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని బెస్ట్ జాబ్ గా గుర్తించారు. అమెరికాకు చెందిన జాబ్స్ వెబ్ సైట్ 'కెరీర్ కాస్ట్' 200 ఉద్యోగాలను సర్వే చేసి ఈ నిర్ధారణకు వచ్చింది. 28వ వార్షిక ఉద్యోగాల రేటింట్ రిపోర్ట్ ను 'కెరీర్ కాస్ట్' తాజాగా విడుదల చేసింది. పనివాతావరణం, ఆదాయం, దృష్టి కోణం, ఒత్తడి తదితర అంశాలను ఉద్యోగాలకు రేటింగ్ ఇచ్చింది.
ఇందులో న్యూస్ పేపర్ రిపోర్టర్ ఉద్యోగం వరుసగా మూడో ఏడాది చెత్త జాబ్ గా నిలిచింది. న్యూస్ పేపర్ రిపోర్టర్ వార్షిక వేతనం 37,200 డాలర్లుగా గుర్తించింది. దశాబ్ద కాలంగా ప్రింట్ మీడియా క్రేజ్ తగ్గుతూ వస్తోందని, ఈ ప్రభావం సిబ్బందిపై పడుతోందని సర్వే వెల్లడించింది. వాణిజ్య ప్రకటనల ఆదాయం బాగా తగ్గడం ప్రింట్ మీడియా కుంగుబాటు కారణమని తెలిపింది.
పెస్ట్ కంట్రోల్ వర్కర్, ఫైర్ ఫైటర్, మిలటరీ సర్వీస్ లు వరస్ట్ ఉద్యోగాల జాబితాలో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ సెక్యురిటీ ఎనలిస్ట్, ఆడియాలజిస్ట్, డయాగ్నస్టిక్ మెడికల్ సోనోగ్రాఫర్ బెస్ట్ జాబ్స్ లిస్టులో చోటు సంపాదించాయి.