ఈ ఫొటోలో ఉన్నది ఓ విమానం. అంతరిక్షంలోకి వెళ్లే నౌకలా ఉందనుకుంటున్నారా.. అయితే సాధారణ మానవులు ప్రయాణించేందుకే దీన్ని రూపొందించారు. అసలు విశేషమేం టంటే ఇది మామూలు విమానాలు నడిచే ఇంధనంతో కాకుండా అణుశక్తితో నడుస్తుంది. అంటే విమానయాన రంగంలో ఇదొక సంచలనంగా చెప్పుకోవచ్చు. దీని వేగం ఎంతో తెలుసా? గంటకు 1,852 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందట.
దీని నుంచి కొంచెం కూడా కార్బన్ వెలువడదట. ఈ విమానాన్ని డిజైనర్ ఆస్కార్ వినల్స్ రూపొందించారు. దీనికి పెట్టిన పేరు ‘మాగ్నావమ్’ అంటే పెద్ద పక్షి అని అర్థం. ప్రస్తుతం సాధారణ విమానాల్లో లండన్ నుంచి న్యూయార్క్‌కు 3 గంటల్లోనే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం సాగించొచ్చట. రియాక్టర్ దీనికి కావాల్సిన ఇంధనాన్ని సమకూరుస్తుందట. ఇందులో దాదాపు 500 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చని చెబుతున్నారు. అయితే ఇది మన ముందుకు రావాలంటే ఇంకో పదేళ్లు పడుతుందట.
Comments
Please login to add a commentAdd a comment