ఆర్నబ్ ఏం అడిగాడు.. సెహ్వాగ్ ఏం చెప్పాడు!
రియో ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శనపై చెత్త వ్యాఖ్యలు చేసి బ్రిటిష్ జర్నలిస్టు పీర్స్ మోర్గాన్ వార్తలో నిలిచిన సంగతి తెలిసిందే. ’120 కోట్లమంది జనాభా కలిగిన దేశం కేవలం రెండంటే రెండు పతకాలు సాధించినందుకు సంబరాలు చేసుకుంటోంది. ఎంత చిరాకు కలిగించే విషయమిది’ అని మోర్గాన్ నోరు పారేసుకున్నాడు.
నోటి దురుసుతనం బాగా ఎక్కువైన ఈ సీఎన్‌ఎన్ మాజీ ప్రజెంటర్‌కు ట్విట్టర్‌లో భారతీయులు ఓ రేంజ్‌లో కౌంటరిచ్చారు. మాజీ డ్యాషింగ్ క్రికెటర్ సెహ్వాగ్ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఇప్పటివరకు క్రికెట్‌లో వరల్డ్ కప్ గెలువని మీరా (ఇంగ్లండ్) మాగురించి మాట్లాడేదని దెప్పిపొడిచాడు. దీంతో రోషం పొడుచుకొచ్చిన మోర్గాన్ ఏకంగా సెహ్వాగ్‌కే సవాల్ విసిరాడు. ’హాయ్ వీరేంద్ర సెహ్వాగ్.. ఇండియా మరో ఒలింపిక్స్ మెడల్ గెలిచేలోపే ఇంగ్లండ్ వన్డే వరల్డ్ కప్ కొడుతోంది. నాతో రూ. 10 లక్షల బెట్టు కాస్తావా’ అని సవాల్ చేశాడు. ఈ సవాల్‌ను లైట్ తీసుకున్న సెహ్వాగ్.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి తన షో 'న్యూస్ అవర్'లో మోర్గాన్‌పై మాట్లాడమని అడిగారని, కానీ, టీవీలో ప్రసారమయ్యేంత సీన్ ఆయనకు లేదని తాను తోసిపుచ్చానని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. సున్నితమైన హాస్యంతో కూడిన ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Arnab Goswami wants me to speak on that British guys views on India on NewsHour,but that man doesnt deserve any airtime,hence I have denied
— Virender Sehwag (@virendersehwag) 2 September 2016