Piers Morgan
-
మళ్లీ సెహ్వాగ్ ట్వీటర్ వార్..
న్యూఢిల్లీ: రియో ఒలంపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించిన పీవీ సింధూని ప్రశంసలతో ఆకాశన్నెత్తుకున్న భారత అభిమానులను తప్పుబడుతూ ట్వీట్ చేసి బ్రిటీష్ జర్నలిస్టు మోర్గాన్ గుర్తుకున్నాడా..? ఆ సదరు జర్నలిస్టు మళ్లీ తన నోటికి పని చెప్పాడు. అయితే క్రికెట్ కనిపెట్టిన మీరు( ఇంగ్లండ్ మెన్స్ జట్టు) ఇంత వరకు ఒక వరల్డ్‌కప్ సాధించకపోవడం సిగ్గు చేటు అని అప్పట్లో మన మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ స్ట్రాంగ్ సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. అయితే మహిళ ప్రంపంచకప్లో ఇంగ్లండ్‌తో భారత్ మహిళల ఓటమిని ఉద్దేశిస్తూ.. సెహ్వాగ్‌ను ఈ విజయం సరిపోతుందా మిత్రమా.. అని పుండు మీద కారం చల్లినట్లు ట్వీట్ చేశాడు. దీనికి సెహ్వాగ్ స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాడు.. ఈ ఓటమిని కూడ మేం గర్విస్తున్నాము.. దీంతో మా జట్టు మరింత ధృడంగా తయారైందని.. సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. అయితే మోర్గాన్ పాత విషయాలను గుర్తు చేస్తూ మన ఛాలెంజ్ గుర్తుందా అని మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీటర్ వార్‌కు భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. Super proud of the girls. Tough luck today but womens cricket in India has truly arrived. Thank you girls .Salute your spirit.#WWC17Final — Virender Sehwag (@virendersehwag) 23 July 2017 You OK, buddy @virendersehwag? #WWC2017final 😂😂😂 — Piers Morgan (@piersmorgan) 23 July 2017 Me and all of India prouder even in this loss than you can ever be mate.We fought well &will only get better & stronger. Enjoy for a change! https://t.co/Dv1gn2jpWn — Virender Sehwag (@virendersehwag) 23 July 2017 -
సెహ్వాగ్.. మళ్లీ ఇరగదీశాడు!
ఢిల్లీ: మనోళ్లు కబడ్డీ గెలిచిన సందర్బాన్ని పురస్కరించుకుని భారత మాజీ డాషింగ్ ఆటగాడు, ట్విట్టర్ కింగ్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ దూకుడును ప్రదర్శించాడు. రియో ఒలింపిక్స్ అనంతరం భారత్‌ను కించపరిచిన బ్రిటీష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ టార్గెట్ చేస్తూ సెహ్వాగ్ మరోసారి తన మాటల యుద్ధానికి తెరలేపాడు. తమ దేశంలో పుట్టిన కబడ్డీలో అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తూ మేము ఎనిమిది సార్లు వరల్డ్ చాంపియన్స్‌గా (పురుషులు, మహిళల జట్లు) నిలవగా.. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ మాత్రం ఇంకా వన్డే వరల్డ్ కప్ సాధించడానికి మరమ్మత్తులు చేసుకుంటూనే ఉందని ట్వీట్ చేశాడు. గతంలో 125 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ రియో ఒలింపిక్స్ లో కేవలం రెండు పతకాలు సాధించినదానికే సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారంటూ పియర్స్ మోర్గాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దానికి అప్పుడే దీటుగా సమాధానిమిచ్చిన సెహ్వాగ్.. మళ్లీ మోర్గాన్ ను ఉద్దేశిస్తూ చురకలంటించాడు. India invented Kabaddi & r World Champs for 8th time.Elsewhere some country invented Cricket & r yet only good in correcting typos.#INDvIRN pic.twitter.com/IG9fucAMMo — Virender Sehwag (@virendersehwag) 22 October 2016 -
సెహ్వాగ్ వీరాభిమాని ఇలా చేశాడేంటి..?
రియో ఒలింపిక్స్ లో భారత్ సాధించిన పతకాల అంశంపై ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్టు పీయర్స్ మోర్గాన్, టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. '120 కోట్ల జనాభా కలిగిన దేశం కేవలం రెండు పతకాలు మాత్రమే సాధించినా సంబరాలు చేసుకుంటుంది. ఈ విషయం తనకు ఎంతో చికాకు కలిగించింది' అంటూ మోర్గాన్ చేసిన ట్వీట్‌పై భారత నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా సెహ్వాగ్ ఈ విషయంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. క్రికెట్ గేమ్‌ను రూపొందించారే తప్ప ఒక్కసారైనా వన్డే క్రికెట్ ప్రపంచకప్పును ఇంగ్లండ్ ఎప్పుడైనా గెలిచిందా అంటూ ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ⇒ ఈ ట్వీట్ల యుద్ధానికి ముందు వరకూ సెహ్వాగ్ ఆటకు పీయర్స్ మోర్గాన్ వీరాభిమాని. అందుకు గతంలో అతడు చేసిన ట్వీట్లు చూస్తే అర్థమవుతోంది. ⇒ సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత.. విధ్వంసక ఆటగాడికి వీడ్కోలు. క్రికెట్‌ను తనదైనశైలిలో ఆడిన ఆటగాడు, థ్రిల్లింగ్ బ్యాట్స్ మన్ అని చివరగా థ్యాంక్యూ సెహ్వాగ్ అని ట్వీట్ చేశాడు. 2012లో మరికొన్ని ట్వీట్లు.. ⇒ భారత్ నుంచి క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ ఎలెవన్ జట్టులో సెహ్వాగ్ కు స్థానం కల్పిస్తూ ట్వీట్ చేశాడు. ⇒ అది మాత్రమే కాదు ఆల్ టైమ్ వన్డే వరల్డ్ గ్రేట్ ఎలెవన్ జట్టులో సెహ్వాగ్, క్రిస్ గేల్ ఓపెనర్లుగా పేర్కొన్నాడు. ⇒ మై ఆల్ టైమ్ టెస్ట్ క్రికెట్ వరల్డ్ ఎలెవన్ లో సచిన్, బ్రాడ్ మన్, వివియన్ రిచర్డ్స్ తో పాటు సెహ్వాగ్ పేరును సూచిస్తూ ట్వీట్ చేశాడు. ⇒ భారత క్రికెటర్లలో మీ ఫెవరెట్ ప్లేయర్ అని ఓ వ్యక్తి ప్రశ్నించగా.. సెహ్వాగ్, సచిన్ తనకు ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాళ్లు అని చెప్పడం చూస్తూ అతడు సెహ్వాగ్ కు ఎంత వీరాభిమానో చెప్పవచ్చు. -
ఆర్నబ్ ఏం అడిగాడు.. సెహ్వాగ్ ఏం చెప్పాడు!
రియో ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శనపై చెత్త వ్యాఖ్యలు చేసి బ్రిటిష్ జర్నలిస్టు పీర్స్ మోర్గాన్ వార్తలో నిలిచిన సంగతి తెలిసిందే. ’120 కోట్లమంది జనాభా కలిగిన దేశం కేవలం రెండంటే రెండు పతకాలు సాధించినందుకు సంబరాలు చేసుకుంటోంది. ఎంత చిరాకు కలిగించే విషయమిది’ అని మోర్గాన్ నోరు పారేసుకున్నాడు. నోటి దురుసుతనం బాగా ఎక్కువైన ఈ సీఎన్ఎన్ మాజీ ప్రజెంటర్కు ట్విట్టర్లో భారతీయులు ఓ రేంజ్లో కౌంటరిచ్చారు. మాజీ డ్యాషింగ్ క్రికెటర్ సెహ్వాగ్ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఇప్పటివరకు క్రికెట్లో వరల్డ్ కప్ గెలువని మీరా (ఇంగ్లండ్) మాగురించి మాట్లాడేదని దెప్పిపొడిచాడు. దీంతో రోషం పొడుచుకొచ్చిన మోర్గాన్ ఏకంగా సెహ్వాగ్‌కే సవాల్ విసిరాడు. ’హాయ్ వీరేంద్ర సెహ్వాగ్.. ఇండియా మరో ఒలింపిక్స్ మెడల్ గెలిచేలోపే ఇంగ్లండ్ వన్డే వరల్డ్ కప్ కొడుతోంది. నాతో రూ. 10 లక్షల బెట్టు కాస్తావా’ అని సవాల్ చేశాడు. ఈ సవాల్‌ను లైట్ తీసుకున్న సెహ్వాగ్.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి తన షో 'న్యూస్ అవర్'లో మోర్గాన్‌పై మాట్లాడమని అడిగారని, కానీ, టీవీలో ప్రసారమయ్యేంత సీన్ ఆయనకు లేదని తాను తోసిపుచ్చానని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. సున్నితమైన హాస్యంతో కూడిన ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. Arnab Goswami wants me to speak on that British guys views on India on NewsHour,but that man doesnt deserve any airtime,hence I have denied — Virender Sehwag (@virendersehwag) 2 September 2016 -
భారతీయులను రెచ్చగొడుతూ.. మోర్గాన్ మరో ట్వీట్
భారతీయ ఫ్యాన్లను రెచ్చగొట్టే అలవాటును బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ ఇంకా వదులుకోలేదు. రియో ఒలింపిక్స్‌లో భారతదేశానికి రెండే పతకాలు వచ్చినా సంబరాలు ఎందుకు చేస్తున్నారంటూ ట్వీట్ చేసినప్పటి నుంచి ఆయన ట్రెండ్ అవుతున్నారు. ఆయన ఆ ట్వీట్ చేసిన వెంటనే వేలాది మంది భారతీయులు మోర్గాన్ మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. చివరకు భారత డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా మోర్గాన్‌ను తీవ్రంగా ఖండించాడు. తనదైన శైలిలో ప్రతివిమర్శలు చేశాడు. ఇక వివాదం అంతా సర్దుమణిగిందని అనుకుంటున్న తరుణంలో మోర్గాన్ మరోసారి మొదలుపెట్టాడు. ''ఇండియన్ ట్విట్టర్, ఎందుకు సైలెంటుగా ఉన్నారు.. మీ గాయాలకు మందులు పూసుకుంటున్నారా'' అంటూ రెచ్చగొట్టేలా మరో ట్వీట్ పెట్టాడు. దాంతోపాటు ఒక్కరోజులో తన ఫాలోవర్ల సంఖ్య 12వేలు పెరిగిందని, దీనంతటికీ కారణం భారతీయ అభిమానులేనంటూ వారికి థాంక్స్ చెప్పాడు. మోర్గాన్ ఇలా రెచ్చగొట్టాక భారతీయులు ఏమంటారో ఇక చూడాల్సి ఉంది. You're a bit quiet today, #IndianTwitter.... nursing your bruises? -
సెహ్వాగ్.. ఇరగదీశాడు!
విమర్శకులకు ఎప్పుడూ తన బ్యాట్‌తో సమాధానమిచ్చే డాషింగ్ హీరో వీరేంద్ర సెహ్వాగ్.. ఈసారి మాటలతో కూడా గట్టిగా సమాధానం చెప్పాడు. 125 కోట్ల మంది జనాభా ఉన్నా కేవలం రెండు పతకాలు సాధించి దానికే సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారంటూ బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ ద్వారానే సెహ్వాగ్ ఘాటుగా జవాబు చెప్పాడు. ఇది వాళ్లిద్దరి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ముందుగా మోర్గాన్ చేసిన ట్వీట్‌కు సమాధానంగా, భారతీయులు ప్రతి చిన్న విషయానికీ ఆనందిస్తూనే ఉంటారని సెహ్వాగ్ చెప్పాడు. అది సరేగానీ, క్రికెట్‌ను కనుగొన్నది తామేనంటూ జబ్బలు చరుచుకునే ఇంగ్లండ్ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేదని, అయినా ఇప్పటికీ ప్రపంచకప్‌లో ఆడుతూనే ఉండటం ఇబ్బందికరంగా ఏమీ లేదా అని ప్రశ్నించాడు. ఒక్కసారిగా సెహ్వాగ్ సమాధానానికి ట్విట్టర్ జనాలు అభిమానులు అయిపోయారు. కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో రీట్వీట్లు, దానికి మించి లైకుల వర్షం కురిసింది. అయితే అది అక్కడితో ఆగలేదు. సెహ్వాగ్ ట్వీట్‌కు మోర్గాన్ మరోసారి స్పందించాడు. కెవిన్ పీటర్సన్ ఆడి ఉంటే, ఇంగ్లండ్ తప్పనిసరిగా ప్రపంచకప్ గెలిచేదని చెప్పాడు. కానీ హనుమంతుడి ముందు కుప్పగంతులా అన్నట్లు క్రికెట్ గురించి సెహ్వాగ్‌కు చెబితే ఎలా? అందుకే వీరూ దానికి కూడా గట్టిగానే చెప్పాడు. అసలు పీటర్సన్ ఇంగ్లండ్ వ్యక్తి కాదని, దక్షిణాఫ్రికాలో పుట్టాడని, అందులోనూ ఆయన 2007 ప్రపంచకప్‌లో ఆడాడని.. అయినా ఇంగ్లండ్ ఓడిపోయిందని చకచకా చెప్పేశాడు. దాంతో ఇక మోర్గాన్ మాట్లాడేందుకు ఏమీ లేక నోరు మూసేశాడు. We cherish every small happiness', But Eng who invented Cricket,&yet2win a WC,still continue to playWC.Embarrassing? https://t.co/0mzP4Ro8H9 — Virender Sehwag (@virendersehwag) 24 August 2016 Very embarrassing, Legend. If @KP24 was playing, we'd win the WC. Just as we won T20 WC & he was Man of Series. https://t.co/50X5YMQSQU — Piers Morgan (@piersmorgan) 24 August 2016 KP is a legend no doubt,bt wasnt he born in SA,&by ur logic Eng shd hv won 2007WC. Why hv prblm wid our ppl,celbrtng https://t.co/ZigCrzVG05 — Virender Sehwag (@virendersehwag) 24 August 2016 -
వరల్డ్ కప్ ఇంగ్లండ్ గెలిచిందా!
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ‘ట్విట్టర్’ ద్వారా మాటల్లో కూడా తన దూకుడును ప్రదర్శిస్తున్నాడు. భారత్‌లో ఒలింపిక్స్ అనంతరం జరుగుతున్న సంబరాల గురించి ఇంగ్లండ్ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యకు అతను ఇచ్చిన జవాబు సోషల్ నెట్‌వర్క్‌లో సూపర్ హిట్ అయింది. ‘120 కోట్ల జనాభా ఉన్న దేశంలో 2 పతకాలు సాధిస్తేనే పిచ్చిగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది చాలా చిరాగ్గా అనిపిస్తోంది’ అని పియర్స్ మోర్గాన్ అనే సీనియర్ పాత్రికేయుడు ట్వీట్ చేశాడు. దీనికి వీరూ తనదైన శైలిలో జవాబిచ్చాడు. ‘మేం చిన్నచిన్న ఆనందాలను కూడా వేడుకగా జరుపుకుంటాం. కానీ క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లండ్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. అయినా వరల్డ్ కప్ ఆడుతుండటం మాకూ చిరాగ్గానే అనిపిస్తోంది’ అని చెలరేగాడు. దాంతో సెహ్వాగ్‌పై అభినందనల వర్షం కురిసింది. ‘మైదానంలో, మైదానం బయట వీరూ భాయ్‌ను ఎవరూ ఓడించలేరు. దీన్నే కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటారు’ అని కోహ్లి స్పందించాడు. -
ఒలింపిక్స్‌లో భారతే చెత్త దేశం!
120 కోట్ల జనాభా. ప్రపంచ అగ్రదేశాలకు దీటుగా జీడీపీ. అయినా విశ్వక్రీడల వేదిక ఒలింపిక్స్‌లో భారత్‌కు దక్కిన పతకాలు రెండే. ఈ రెండు పతకాలైనా దక్కినందుకు దేశంలో సంబురాలు. మరీ ఒలింపిక్స్‌లో మన ప్రదర్శన గురించి బయటి ప్రపంచం ఏమనుకుంటోందంటే.. చాలానే నోరు పారేసుకుంటోంది. 'రియో ఒలింపిక్స్‌లో భారత్‌దే అత్యంత చెత్త ప్రదర్శన' అని ఓ న్యూజిల్యాండ్ దినపత్రిక నోరు పారేసుకుంటే.. ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్టు పీయర్స్ మోర్గాన్ మరింత చెత్త వ్యాఖ్యలు చేసి.. ట్విట్టర్లో దుమారం రేపాడు. '120 కోట్ల జనాభా కలిగిన దేశం కేవలం రెండంటే రెండు పతకాలు తెచ్చుకున్నందుకు సంబురాలు జరుపుకొంటోంది. ఎంత చికాకు కలిగించే విషయమిది' అంటూ మోర్గాన్ చేసిన ట్వీట్‌పై భారతీయ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇతర దేశాలపై నోరు పారేసుకునేముందు నీ సొంత పనేంటో చూసుకోమని ఘాటుగా బదులిచ్చారు. ఎవరైనా, ఏదైనా గెలిచినప్పుడు సంబురాలు చేసుకోవడం మీ సంస్కృతిలో చికాకు కలిగించే విషయం కావొచ్చుకానీ, మా దేశ సంస్కృతిలో కాదంటూ గట్టిగా మందలించారు. మరోవైపు 'ఒలింపిక్స్ ఇండియా వరెస్ట్ కంట్రీ' అనే శీర్షికతో న్యూజిలాండ్ హెరాల్డ్ పత్రిక ఓ కథనాన్ని వండివార్చింది. భారత్ రెండు మెడల్స్ సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిందని, జనాభా, జీడీపీ ప్రకారం చూసుకుంటే.. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇదే చెత్త ప్రదర్శన అని పేర్కొంది. ఇక ఒక్క పతకం కూడా గెలువకుండా ఇంటిముఖం పట్టిన మన దాయాది పాకిస్థాన్‌ను అసలు లెక్కలోకే రాదంటూ ఈ పత్రిక ఏకిపారేసింది. -
బాయ్‌ఫ్రెండ్ పిచ్చిలో పడి..
లండన్: ఆమె చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. కాసేపు అలాగే ఉండిపోతే తన ప్రేయసిగా వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే మాటలు అంత తీయగా ఉంటాయి. ముఖ కవలికలు అలా కవ్విస్తాయి. కానీ, ఆమె మనసు నిండా మాత్రం రాక్షసత్వం. ఎంతగా అంటే పట్టుమని పదహారేళ్లు కూడా నిండకముందే మొత్తం కుటుంబాన్నే హత్య చేసేంతటి రాక్షస మనస్తత్వం. ప్రస్తుతం 24 ఏళ్లు ఉన్న ఎరిన్ కాఫీ అనే ఆ యువతి గత ఎనిమిదేళ్లుగా తన సొంత కుటుంబాన్ని హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను ఎరిన్ కాఫే అనే బ్రిటన్ కు చెందిన మాజీ జడ్జి పీర్స్ మోర్గాన్ ఆమెను జైలులో కలిశాడు. ఆ క్షణంలో ఆమెతో మాట్లాడేముందు ఏ మాత్రం జంకుబొంకు లేకుండా ప్రశ్నించాడు. ఈయన సాధరణంగా టీవీ కార్యక్రమాలకోసం ఇలా క్రూరమైన నేరాలను చేసేవారిని ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఆయనలా ఇంటర్వ్యూ చేసిన వారిలో ఇలాంటి దుష్టమహిళను తాను ఇంతవరకు చూడలేదని చెప్పారు. ఆమె తన కుటుంబాన్ని ఎందుకు హత్య చేసిందో సావధానంగా, తాఫీగా సమాధానం చెప్పిందని తెలిపారు. ఆమె చెప్పిన ప్రకారం 2008నాటికి ఎరిన్ వయసు పదహారేళ్లు. అప్పటికే ఆమెకు అన్ని రకాల దురలవాట్లు చుట్టుకున్నాయి. ముఖ్యంగా ఓ బాయ్ ఫ్రెండ్‌తో తిరగడమే కాకుండా హద్దు మీరింది. తల్లిదండ్రులతో కూడా అసభ్యకరంగా మాట్లాడటం, రాత్రి వేళ బాయ్ ఫ్రెండ్ పిచ్చిలో పడి అతడి వద్దే ఉండటం లాంటిది చేసింది. ఈ విషయం స్పష్టంగా గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను హెచ్చరించారు. అయితే, వారి మాటను విన్నట్లుగానే నటించిన ఎరిన్.. ఎలాగైనా తన తల్లిదండ్రులను భూమిపై ఉంచకూడదని నిర్ణయించుకుంది. వారిని చంపేందుకు బాయ్ ఫ్రెండ్ చార్లీ, మరో స్నేహితుడు చార్లెస్ వెయిడ్.. చార్లెస్ గర్ల్ ఫ్రెండ్ బాబీ జాన్సన్ తో కుట్ర చేసింది. తొలుత ఆమె తల్లి పెన్నీపై కాల్పులు జరిపించి కత్తులతో పొడిపించింది. తమ్ముడు మాధ్యూ(13)పై కాల్పులు చేయించింది. మరో ఎనిమిదేళ్ల టేలర్ ను కత్తితో హత్య చేయించింది. ఇక తండ్రి టెర్రీపై దారుణంగా ఐదుసార్లు కాల్పులు జరిపించింది. ఈ విషయాలన్ని విన్న పీర్స్ మోర్గాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తన జీవితంలోనే ఇలాంటి దుష్టమహిళను కలుసుకోలేదని వ్యాఖ్యానించాడు.