సెహ్వాగ్.. మళ్లీ ఇరగదీశాడు!
ఢిల్లీ: మనోళ్లు కబడ్డీ గెలిచిన సందర్బాన్ని పురస్కరించుకుని భారత మాజీ డాషింగ్ ఆటగాడు, ట్విట్టర్ కింగ్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ దూకుడును ప్రదర్శించాడు. రియో ఒలింపిక్స్ అనంతరం భారత్ను కించపరిచిన బ్రిటీష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ టార్గెట్ చేస్తూ సెహ్వాగ్ మరోసారి తన మాటల యుద్ధానికి తెరలేపాడు. తమ దేశంలో పుట్టిన కబడ్డీలో అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తూ మేము ఎనిమిది సార్లు వరల్డ్ చాంపియన్స్గా (పురుషులు, మహిళల జట్లు) నిలవగా.. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ మాత్రం ఇంకా వన్డే వరల్డ్ కప్ సాధించడానికి మరమ్మత్తులు చేసుకుంటూనే ఉందని ట్వీట్ చేశాడు.
గతంలో 125 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ రియో ఒలింపిక్స్ లో కేవలం రెండు పతకాలు సాధించినదానికే సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారంటూ పియర్స్ మోర్గాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దానికి అప్పుడే దీటుగా సమాధానిమిచ్చిన సెహ్వాగ్.. మళ్లీ మోర్గాన్ ను ఉద్దేశిస్తూ చురకలంటించాడు.
India invented Kabaddi & r World Champs for 8th time.Elsewhere some country invented Cricket & r yet only good in correcting typos.#INDvIRN pic.twitter.com/IG9fucAMMo
— Virender Sehwag (@virendersehwag) 22 October 2016