సెహ్వాగ్ వీరాభిమాని ఇలా చేశాడేంటి..?
రియో ఒలింపిక్స్ లో భారత్ సాధించిన పతకాల అంశంపై ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్టు పీయర్స్ మోర్గాన్, టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. '120 కోట్ల జనాభా కలిగిన దేశం కేవలం రెండు పతకాలు మాత్రమే సాధించినా సంబరాలు చేసుకుంటుంది. ఈ విషయం తనకు ఎంతో చికాకు కలిగించింది' అంటూ మోర్గాన్ చేసిన ట్వీట్‌పై భారత నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా సెహ్వాగ్ ఈ విషయంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. క్రికెట్ గేమ్ను రూపొందించారే తప్ప ఒక్కసారైనా వన్డే క్రికెట్ ప్రపంచకప్పును ఇంగ్లండ్ ఎప్పుడైనా గెలిచిందా అంటూ ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.
⇒ ఈ ట్వీట్ల యుద్ధానికి ముందు వరకూ సెహ్వాగ్ ఆటకు పీయర్స్ మోర్గాన్ వీరాభిమాని. అందుకు గతంలో అతడు చేసిన ట్వీట్లు చూస్తే అర్థమవుతోంది.
⇒ సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత.. విధ్వంసక ఆటగాడికి వీడ్కోలు. క్రికెట్ను తనదైనశైలిలో ఆడిన ఆటగాడు, థ్రిల్లింగ్ బ్యాట్స్ మన్ అని చివరగా థ్యాంక్యూ సెహ్వాగ్ అని ట్వీట్ చేశాడు.
2012లో మరికొన్ని ట్వీట్లు..
⇒ భారత్ నుంచి క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ ఎలెవన్ జట్టులో సెహ్వాగ్ కు స్థానం కల్పిస్తూ ట్వీట్ చేశాడు.
⇒ అది మాత్రమే కాదు ఆల్ టైమ్ వన్డే వరల్డ్ గ్రేట్ ఎలెవన్ జట్టులో సెహ్వాగ్, క్రిస్ గేల్ ఓపెనర్లుగా పేర్కొన్నాడు.
⇒ మై ఆల్ టైమ్ టెస్ట్ క్రికెట్ వరల్డ్ ఎలెవన్ లో సచిన్, బ్రాడ్ మన్, వివియన్ రిచర్డ్స్ తో పాటు సెహ్వాగ్ పేరును సూచిస్తూ ట్వీట్ చేశాడు.
⇒ భారత క్రికెటర్లలో మీ ఫెవరెట్ ప్లేయర్ అని ఓ వ్యక్తి ప్రశ్నించగా.. సెహ్వాగ్, సచిన్ తనకు ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాళ్లు అని చెప్పడం చూస్తూ అతడు సెహ్వాగ్ కు ఎంత వీరాభిమానో చెప్పవచ్చు.