Kabaddi World Cup
-
భారత్‌పై పాక్ విజయం.. మేము ఏ జట్టునీ పంపలేదు!
లాహోర్: ‘కబడ్డి ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి, కప్పు గెలిచిన పాకిస్తాన్ జట్టుకు శుభాకాంక్షలు’.. ఈ మాటలు అన్నది పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అయితే సర్కిల్ కబడ్డి ప్రపంచకప్ ఆడటానికి భారత్ నుంచి అధికారికంగా ఏ జట్టూ వెళ్లలేదట. కానీ ఆదివారం రాత్రి ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై 43-41 తేడాతో పాక్ గెలిచిందట. ఈ విషయం తెలిసిన పాక్ ప్రధాని తమ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ వేదికగా తొలిసారి సర్కిల్ కబడ్డి వరల్డ్‌కప్ నిర్వహించారు. అయితే పాక్‌లో నిర్వహిస్తున్న సర్కిల్ కబడ్డి వరల్డ్‌కప్‌లో పాల్గొనడానికి తాము ఎటువంటి జట్టును పంపలేదని, ఎవరైనా వచ్చినా వారు భారత్ పేరు వాడటానికి అనుమతి లేదని పేర్కొంటూ అమెచ్యూర్ కబడ్డి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఎఫ్ఐ).. పాక్ కబడ్డీ బోర్డుకు అంతకుముందే లేఖ రాసిందట. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) కూడా పాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీకి ఎటువంటి జట్టునూ పంపడంలేదని గత సోమవారమే స్పష్టంచేసింది. కొందరు భారతీయ కబడ్డీ క్రీడాకారులు అనుమతి లేకుండా పాకిస్తాన్ వెళ్లారని, వారే ఈ టోర్నీలో పాల్గొన్నారని కొందరు వాదిస్తున్నారు. మనదేశంలోని పంజాబ్‌లో ఈ సర్కిల్ కబడ్డి ఎక్కువగా ఆడతారు. ఆ జట్టే భారత ప్రభుత్వం అనుమతి లేకుండా పాకిస్తాన్‌కు వెళ్లి టోర్నీలో భాగస్వామ్యమైనట్లు తెలుస్తోంది. Congratulations to the Pakistan Kabbadi team for winning the Kabbadi World Cup after defeating India. — Imran Khan (@ImranKhanPTI) February 17, 2020 -
కబడ్డీ ఆటగాళ్లకు నజరానా
న్యూఢిల్లీ: ప్రపంచకప్ కబడ్డీ టైటిల్‌ను నెగ్గిన భారత జట్టుకు కేంద్రం నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్టు క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. గురువారం ఆయన నివాసంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ‘ఆటగాళ్లతో పాటు కోచ్‌కు కూడా రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నాం. ఈ గేమ్ ఒలింపిక్స్‌లో కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే క్రికెట్ మాత్రమే కాకుండా దేశంలో ఫుట్‌బాల్, హాకీ, ఇతర ఆటలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’ అని గోయల్ అన్నారు. -
అందరికీ కలిపి 10 లక్షలా..!
ప్రభుత్వ ప్రోత్సాహకంపై భారత కబడ్డీ ఆటగాడు అజయ్ నిరాశ న్యూఢిల్లీ: కబడ్డీ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకం పట్ల జట్టు సభ్యుడు అజయ్ ఠాకూర్ నిరాశ వ్యక్తం చేశాడు. ఈ విజయానంతరం క్రీడా శాఖ మన జట్టుకు రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ఇది చాలా చిన్న మొత్తం కాగా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఆటగాళ్ల కోసం ఏమీ ప్రకటించకపోవడం తనను ఆశ్చర్యపరచిందని అతను అన్నాడు. ‘కబడ్డీ మన దేశంలో ఇంతగా పాపులర్ అవుతుందని, నేను వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిని అవుతానని అసలు ఏనాడూ ఊహించలేదు కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం. అరుుతే మేము కోట్ల రూపాయలు కనకవర్షం కురిపించమని అడగడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మొత్తాన్ని అందరం పంచుకుంటే ఎంత వస్తుందో మీరే ఊహించుకోండి. ఆట ఏదైనా అందరికీ ఒకే తరహాలో ప్రోత్సాహం అందాలి కదా’ అని అజయ్ వ్యాఖ్యానించాడు. కబడ్డీ ప్రపంచకప్‌లో అజయ్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
సెహ్వాగ్.. మళ్లీ ఇరగదీశాడు!
ఢిల్లీ: మనోళ్లు కబడ్డీ గెలిచిన సందర్బాన్ని పురస్కరించుకుని భారత మాజీ డాషింగ్ ఆటగాడు, ట్విట్టర్ కింగ్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ దూకుడును ప్రదర్శించాడు. రియో ఒలింపిక్స్ అనంతరం భారత్‌ను కించపరిచిన బ్రిటీష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ టార్గెట్ చేస్తూ సెహ్వాగ్ మరోసారి తన మాటల యుద్ధానికి తెరలేపాడు. తమ దేశంలో పుట్టిన కబడ్డీలో అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తూ మేము ఎనిమిది సార్లు వరల్డ్ చాంపియన్స్‌గా (పురుషులు, మహిళల జట్లు) నిలవగా.. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ మాత్రం ఇంకా వన్డే వరల్డ్ కప్ సాధించడానికి మరమ్మత్తులు చేసుకుంటూనే ఉందని ట్వీట్ చేశాడు. గతంలో 125 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ రియో ఒలింపిక్స్ లో కేవలం రెండు పతకాలు సాధించినదానికే సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారంటూ పియర్స్ మోర్గాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దానికి అప్పుడే దీటుగా సమాధానిమిచ్చిన సెహ్వాగ్.. మళ్లీ మోర్గాన్ ను ఉద్దేశిస్తూ చురకలంటించాడు. India invented Kabaddi & r World Champs for 8th time.Elsewhere some country invented Cricket & r yet only good in correcting typos.#INDvIRN pic.twitter.com/IG9fucAMMo — Virender Sehwag (@virendersehwag) 22 October 2016 -
కబడ్డీ విశ్వవిజేత భారత్
-
కబడ్డీ విశ్వవిజేత భారత్
అహ్మదాబాద్: కబడ్డీ ప్రపంచకప్-2016ను భారత్ కైవసం చేసుకుంది. మొదటి అర్ధభాగం నుంచి దూకుడైన ఆటతీరుతో ఇరుజట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి అర్ధభాగంలో ఆచితూచి ఆడిన ఇరు జట్లు అనవసర తప్పిదాలకు పోకుండా నువ్వానేనా అన్నరీతిలో పోరాడాయి. ఒక దశలో ఇరాన్ 10-07పాయింట్లతో లీడ్ లోకి వెళ్లగా ఓ సూపర్ టాకిల్ తో భారత్ తిరిగి ఫాం అందుకుంది. అయితే, తొలి అర్ధం భాగం చివరకు ఇరాన్ జట్టు వరుస రైడ్లలో భారత ఆటగాళ్లను అలౌట్ చేసి 18-13 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఫస్ట్ హాఫ్ లో ఇరాన్ జట్టు ఎక్కువ రైడింగ్ పాయింట్లను సాధించింది. భారత్ పైచేయి రెండో అర్ధభాగం ప్రారంభం నుంచి భారత ఆటగాళ్లకు బోనస్ పాయింట్లను సాధ్యమైనంత వరకూ ఇవ్వకుండా ఉండటానికి ఇరాన్ ప్రయత్నించింది. అయితే ఇరాన్ పై ఎదురుదాడికి దిగిన భారత ఆటగాళ్లు 21-20తో ఆధిక్యం సంపాదించారు. భారత ఆటగాళ్లలో అజయ్ ఠాకూర్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించాడమే కాక ఇరాన్ ను అలౌట్ చేసి భారత ఆధిక్యాన్ని 24-21కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కూడా విజృంభించిన అజయ్ మ్యాచ్ మొత్తం మీద 10కి పైగా రైడ్ పాయింట్లు సాధించి ఇరాన్ నడ్డివిరిచాడు. రైడింగ్ కు వచ్చిన ఇరాన్ రైడర్లకు అవకాశమివ్వని భారత ఆటగాళ్లు ఆధిక్యాన్ని 27-21కి పెంచి మ్యాచ్ పై పట్టు సంపాదించింది. దీంతో ఇరాన్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. పాయింట్లను తెచ్చేందుకు ఇరాన్ ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలు విఫలం చెందడటంతో పాటు మరో మారు అలౌట్ అయ్యారు. దీంతో భారత ఆధిక్యం 34-24కు పెరిగింది. భారత ఆటగాళ్లలో తోమర్ కూడా ఐదు రైడ్ పాయింట్లతో అదరగొట్టాడు. ఆఖరి రెండు నిమిషాల్లో రైడింగ్ వెళ్లిన ఇరాన్ ఆటగాడు మీరాజ్ మెరుపు విన్యాసంతో రెండు పాయింట్లు సాధించి ఇరాన్ శిబిరంలో ఆశలు నింపాడు. చివరి నిమిషంలో చాన్స్ కోసం యత్నించిన ఇరాన్ ఆశలను ఆడియాసలు చేసి 38-29 తేడాతో భారత్ వరుసగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. టోర్నీలో అత్యధిక రైడింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా అజయ్ ఠాకూర్ నిలిచాడు. -
సెమీఫైనల్లో భారత కబడ్డీ జట్టు జయభేరి
అహ్మదాబాద్: కబడ్డీ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో థాయ్ లాండ్ తో తలపడిన భారత్ విజయ దుందుభి మోగించింది. మొదటి నుంచి ఆదిపత్యం ప్రదర్శించిన భారత జట్టు పత్యర్ధి జట్టుకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. తొలి అర్ధభాగంలో 36-08తో భారత్ జట్టు థాయ్ లాండ్ ను తన దరిదాపుల్లోకి కూడా చేరుకుండా చేసింది. కాగా, భారత్ తరఫున సందీప్ నర్వాల్ తొలి అర్ధభాగంలో వరుసగా ఏడు రైడ్లలో పాయింట్లు సాధించాడు. ఇందులో ఓ సూపర్ రైడ్ కూడా ఉంది. మ్యాచ్ మొత్తం మీద థాయ్ లాండ్ ను భారత్ నాలుగు సార్లు ఆలౌట్ చేసింది. థాయ్ లాండ్ పేలవ ప్రదర్శన మ్యాచ్ ఆసాంతం థాయ్ లాండ్ ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. భారత ఆటగాళ్ల ప్రదర్శన ముందు వారు చిన్నబోయారు. రైడ్ కు వెళ్లిన వారు వెళ్లినట్లే ఔటయ్యారు. పాయింట్లు తెచ్చేందుకు తంటాలు పడ్డారు. తొలి సెట్లో భారత్ రెండంకెల పాయింట్లు సాధించే వరకూ థాయ్ లాండ్ ఖాతాలో ఒక్క పాయింట్ కూడా చేరలేదంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. చుట్టేశారు మొదటి అర్ధభాగంలోనే భారీ లీడ్ లోకి తీసుకెళ్లిన భారత ఆటగాళ్లు చివరి అర్ధభాగంలో చెలరేగి పోయారు. ఎనిమిది పాయింట్ల నుంచి థాయ్ లాండ్ ను ముందుకు పోనివ్వకుండా 51-08కు చేరుకున్నారు. మ్యాచ్ మొత్తం మీద సందీప్ నర్వాల్ ఒక్కడే 10 పాయింట్లు సాధించాడు. నర్వాల్ రైడింగ్ వెళ్లిన సమయంలో అతన్ని పట్టుకోబోయిన ఓ థాయ్ లాండ్ ఆటగాడి తలకు గాయమైంది. రెండు టీమ్ ల మధ్య పాయింట్లలో బాగా వ్యత్యాసం పెరిగిపోవడంతో భారత్ తన రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను రంగంలోకి దించి పరీక్షించుకుంది. దీంతో కొంచెం పుంజుకున్నట్లు కనిపించిన థాయ్ లాండ్ 73-20తో మ్యాచ్ ను కోల్పోయింది. కాగా ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఇరాన్ తో తలపడనుంది. -
నాకౌట్ ‘కూత’
కబడ్డీ ప్రపంచకప్ సెమీస్ నేడు కొరియా(vs)ఇరాన్ రాత్రి 8 గంటల నుంచి భారత్(vs) థాయ్‌లాండ్ రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం అహ్మదాబాద్: కబడ్డీ ప్రపంచకప్ సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు థాయ్‌లాండ్‌తో, ఇరాన్ జట్టు కొరియాతో తలపడనున్నారుు. ప్రపంచకప్ ఎక్కడ, ఎప్పుడు జరిగినా విజేతగా నిలిచే భారత్‌కు ఈసారి తొలి లీగ్ మ్యాచ్‌లోనే కొరియా రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అరుుతే ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి భారత్ సత్తా చాటింది. మంచి అనుభవం కలిగిన రైడ్ విభాగంతో పాటు పటిష్ట డిఫెన్‌సతో నేటి సెమీస్‌లో థాయ్‌లాండ్‌ను చిత్తు చేయాలని భావిస్తోంది. పూర్తిగా స్టార్ ఆటగాళ్లతో నిండిన భారత్‌కు అనూప్ కుమార్, రాహుల్ చౌదరి, పర్దీప్ నర్వాల్, మంజీత్ ఛిల్లర్, దీపక్ హూడా కీలకం కానున్నారు. ఇక తన ప్రత్యర్థి థాయ్‌లాండ్ ఈసారి టోర్నీకి పూర్తిగా యువ ఆటగాళ్లను బరిలోకి దించింది. ఈ జట్టు కూడా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో గ్రూప్ బి టాపర్‌గా నిలిచింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌పై చివర్లో 8 పారుుంట్లు సాధించి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. అందుకే ఎలాంటి నిర్లక్ష్యానికి తావీయకుండా భారత్ ఆడాల్సి ఉంది. ఇక లీగ్‌ల్లో ఓటమనేదే లేకుండా దూసుకెళ్లిన కొరియా జట్టు... ఎక్కువగా తమ స్టార్ రైడర్ జన్ కున్ లీపై ఆధారపడింది. భారత్, బంగ్లాదేశ్‌లతో జరిగిన కీలక మ్యాచ్‌ల్లోనూ తనే చివర్లో చెలరేగి జట్టును గట్టెక్కించాడు. అరుుతే పటిష్ట డిఫెన్స ఉన్న ఇరాన్‌ను ఓడించాలంటే శక్తికి మించి ఆడాల్సిందే.. -
భారత్ సెమీస్ ప్రత్యర్థి థాయ్‌లాండ్
అహ్మదాబాద్: ప్రపంచకప్ కబడ్డీ టోర్నమెంట్ నాకౌట్ దశకు చేరుకుంది. బుధవారంతో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశారుు. గ్రూప్ ‘ఎ’ నుంచి దక్షిణ కొరియా, భారత్... గ్రూప్ ‘బి’ నుంచి థాయ్‌లాండ్, ఇరాన్ సెమీఫైనల్‌కు చేరుకున్నారుు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో కొరియాతో ఇరాన్; థాయ్‌లాండ్‌తో భారత్ తలపడతారుు. బుధవారం జరిగిన చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ 67-26తో అర్జెంటీనాపై విజయం సాధించి 16 పారుుంట్లతో గ్రూప్ ‘ఎ’లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక గ్రూప్ ‘బి’ కీలక మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 37-33తో జపాన్ను ఓడించింది. ఈ విజయంతో గ్రూప్ ‘బి’లో థాయ్‌లాండ్, ఇరాన్ 20 పారుుంట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారుు. అరుుతే మెరుగైన పారుుంట్ల సగటు (సాధించిన పారుుంట్లు, కోల్పోరుున పారుుంట్ల మధ్య తేడా) ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... థాయ్‌లాండ్ (+82)కు టాప్ ర్యాంక్ దక్కింది. ఇరాన్ (+71) రెండో స్థానంలో నిలిచింది. జపాన్ చేతిలో కనీసం ఏడు పారుుంట్ల తేడాతో ఓడిపోకుంటే సెమీస్‌కు చేరుకునే పరిస్థితిలో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ ఈ సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడింది. రెండో అర్ధభాగంలో ఒకదశలో థాయ్‌లాండ్ 26-31తో వెనుకబడింది. అరుుతే చివరి ఐదు నిమిషాల్లో థాయ్‌లాండ్ అద్భుతంగా ఆడి... విజయం సాధించి అగ్రస్థానం దక్కించుకుంది. -
సెమీస్‌లో భారత్
-
సెమీస్‌లో భారత్
అహ్మదాబాద్: కీలకమైన మ్యాచ్‌లో హడలెత్తించిన భారత జట్టు ప్రపంచకప్ కబడ్డీ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 69-18తో ఘనవిజయం సాధించింది. ఈ విజ యంతో భారత్ గ్రూప్ ‘ఎ’లో 21 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. 25 పాయింట్లతో దక్షిణ కొరియా గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఆద్యంతం టీమిండియా ఆధిపత్యం కనిపించింది. ఆరంభంలోనే 12-3తో ముందంజ వేసిన భారత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ప్రదీప్ నర్వాల్ 13 పాయింట్లు, అజయ్ ఠాకూర్ 11 పాయింట్లు... నితిన్ తోమర్, సందీప్ నర్వాల్ 7 చొప్పున పాయింట్లు సాధించి భారత్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. గ్రూప్ ‘బి’ నుంచి ఇప్పటికే ఇరాన్ సెమీస్‌కు చేరగా... రెండో బెర్త్ కోసం థాయ్‌లాండ్, కెన్యా, జపాన్ జట్లు రేసులో ఉన్నాయి. బుధవారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌తో అర్జెంటీనా.... థాయ్‌లాండ్‌తో జపాన్ తలపడతాయి. భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరో బుధవా రం లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఖరారవుతుంది. -
ఎదురులేని కొరియా
అహ్మదాబాద్: కబడ్డీ ప్రపంచకప్‌లో లీగ్ దశలో దక్షిణ కొరియా అజేయంగా నిలిచింది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో కొరియా 56-17తో గెలిచి వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. చియోల్ గ్యు షిన్ 11, డాంగ్ గ్యు కిమ్ 8, యంగ్ జు ఓక్ 6 పారుుంట్లు సాధించారు. ఇంగ్లండ్ జట్టు తరఫున తేజశ్ దిపలా (10) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్ 69-22తో అమెరికాపై గెలుపొందగా, కెన్యా 26-17తో జపాన్‌పై విజయం సాధించింది. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో పోలాండ్‌తో ఇరాన్; ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ ఆడతారుు. కోల్‌కతాను నిలువరించిన గోవా కోల్‌కతా: వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొన్న గోవా ఎఫ్‌సీ జట్టు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో పారుుంట్ల ఖాతా తెరిచింది. అట్లెటికో డి కోల్‌కతా జట్టుతో జరిగిన మ్యాచ్‌ను గోవా 1-1తో ‘డ్రా’గా ముగించింది. ఆరో నిమిషంలో డుటీ గోల్‌తో కోల్‌కతా ఖాతా తెరిచింది. 77వ నిమిషంలో గోవా తరఫున గొంజాలెజ్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు. -
భారత్‌ను తక్కువ చేసి చూడవద్దు: అమితాబ్
ముంబై: కబడ్డీ ప్రపంచ కప్ లో భాగంగా శనివారం అర్జెంటీనాపై ఘనవిజయం సాధించిన భారత జట్టును బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ ద్వారా అభినందించారు. అర్జెంటీనాపై భారత్ 74-20 పాయింట్ల తేడాతో నెగ్గింది. అలాగే వరుసగా మూడో విజయాన్ని అందుకున్న భారత్ దాదాపుగా సెమీఫైనల్స్‌లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. మన ఆటగాళ్లు సాధించిన విజయాన్ని దేశమంతా గర్వకారణంగా భావించాలని తన పోస్ట్ లో కొనియాడారు. ఆటలపై నెగటివ్ ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని, అదే విధంగా భిన్న రకాల ఆటల మధ్య పోలిక పెట్టడం సరికాదని సూచించారు. భారతీయులం అయినందుకు ఇలాంటి విజయాలపై మనం ఎంతో గర్వంగా ఫీలవ్వాలి కానీ ఇతర గేమ్స్ తో పోలిక పెట్టడం మానుకోవాలన్నారు. ఇదే ఆటతీరును ఫుట్ బాల్ ఆటలో చూపించి, భారత్ ఆ తరహాలో గోల్స్ నమోదు చేసి చూపించాలని వస్తున్న కామెంట్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. భారత్ సాధించిన విజయాలను గుర్తించాలి తప్ప, దేశాన్ని తక్కువ అంచనా వేయకూడదని.. ఆ తరహా వ్యాఖ్యలు ఆటకు మంచిదికాదన్నారు. కబడ్డీలో చేసే స్కోరు క్రికెట్ లో ఓ జట్టు చేసే స్కోరులో మూడో వంతు ఉంటుందని బిగ్ బి ట్వీట్ చేశారు. అమితాబ్ తనయుడు హీరో అభిషేక్ బచ్చన్ ప్రో కబడ్డీ లీగ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. T 2412 - India beat Argentina 74-20 in Kabaddi World Cup. HUGE CONGRATULATIONS INDIA ! Some comments saying (cont) https://t.co/1l87uHDHSb — Amitabh Bachchan (@SrBachchan) 16 October 2016 -
భారత్ ‘రికార్డు’ విజయం
సెమీఫైనల్లో కొరియా, ఇరాన్ ప్రపంచకప్ కబడ్డీ అహ్మదాబాద్: ప్రపంచకప్ కబడ్డీ చరిత్రలో భారత్ భారీ ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 74-20 తేడాతో అర్జెంటీనాను చిత్తుచిత్తుగా ఓడించింది. 54 పారుుంట్ల తేడాతో ఓ జట్టు నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. అలాగే వరుసగా మూడో విజయాన్ని అందుకున్న భారత్ దాదాపుగా సెమీఫైనల్స్‌లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. అజయ్ ఠాకూర్, రాహుల్ చౌధరి అత్యధికంగా 11 రైడింగ్ పారుుంట్లు సాధించగా ప్రదీప్ నర్వాల్ 5 పారుుంట్లు చేశాడు. ఇక ఆట ఆరంభం నుంచే భారత్ దూకుడు ముందు అర్జెంటీనా ఏమాత్రం నిలవలేకపోరుుంది. తమ కెరీర్లో తొలిసారిగా ప్రపంచకప్ ఆడుతున్న అర్జెంటీనాను ప్రారంభ ఐదు నిమిషాల్లోనే భారత్ ఆలౌట్ చేసింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి మరో రెండుసార్లు ఆలౌట్ చేయడంతో పాటు 36-13తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత కూడా ప్రత్యర్థి నుంచి కనీస పోటీ కూడా ఎదురుకాకపోవడంతో భారత ఆటగాళ్లు వరుస పారుుంట్లతో బెంబేలెత్తించారు. చివరి నిమిషంలో అర్జెంటీనా 20వ పారుుంట్ సాధించగలిగింది. అరుుతే అప్పటికే ఆతిథ్య జట్టు అందనంత దూరంలో నిలిచి భారీ విజయాన్ని దక్కించుకుంది. 18న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. సెమీస్‌లో కొరియా, ఇరాన్ పరాజయమన్నదే లేకుండా దూసుకెళుతున్న దక్షిణ కొరియా ప్రపంచకప్ కబడ్డీలో సెమీ ఫైనల్స్‌కు చేరింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 63-25 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. తమ స్టార్ ఆటగాడు జంగ్ కున్ లీ అందుబాటులో లేకపోరుునా కొరియా చెలరేగింది. ప్రస్తుతం నాలుగు విజయాలతో 20 పారుుంట్లు సాధించి గ్రూప్ ‘ఎ’లో టాప్‌లో కొనసాగుతోంది. మరో గ్రూప్ ‘బి’లో ఇరాన్ జట్టు కూడా వరుసగా నాలుగో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. జపాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 38-34 తేడాతో నెగ్గింది. -
ఇంగ్లండ్ ఘనవిజయం
అహ్మదాబాద్: ప్రపంచకప్ కబడ్డీలో ఇంగ్లండ్ రెండో విజయం సాధించింది. శుక్రవారం గ్రూప్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు ఆస్ట్రేలియాను 68-28 తేడాతో చిత్తుగా ఓడించింది. టోప్ అడెవాలూర్ అత్యధికంగా 19 రైడింగ్ పారుుంట్లు సాధించగా కేశవ్ గుప్తా 10 పారుుంట్లు చేశాడు. గ్రూప్ ‘బి’లో జరిగిన మరో మ్యాచ్‌లో పోలండ్ 75-29 తేడాతో అమెరికాను ఓడించింది. నేడు (శనివారం) డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు అర్జెంటీనాతో తలపడనుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌లాడిన భారత్ పారుుంట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. -
కొరియాకు రెండో విజయం
అహ్మదాబాద్: ప్రపంచకప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో దక్షిణ కొరియా జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ భారత్‌ను బోల్తా కొట్టించిన కొరియా... రెండో మ్యాచ్‌లో 68-42తో అర్జెంటీనాను ఓడించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కొరియా జట్టు విరామ సమయానికి 43-11తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. కొరియా జట్టులో చెల్ గ్యు చిన్ అత్యధికంగా తొమ్మిది పాయింట్లు స్కోరు చేయగా... తే బోమ్ కిమ్ ఏడు, గ్యుంగ్ తే కిమ్, చాక్ సిక్ పార్క్ ఆరేసి పాయింట్లు సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో జపాన్ 45-19తో అమెరికాపై, ఇరాన్ 64-23తో థాయ్‌లాండ్‌పై నెగ్గాయి. సోమవారం ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌తో పోలాండ్ తలపడతాయి. -
ప్రపంచకప్ కబడ్డీ: భారత్ బోణీ
అహ్మదాబాద్: ప్రపంచకప్ కబడ్డీ ప్రారంభ మ్యాచ్‌లోనే పసికూన కొరియా చేతిలో కంగుతిన్న భారత కబడ్డీ జట్టు రెండో మ్యాచ్‌లో సత్తా చాటింది. తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అనూప్ కుమార్ సేన 54-20 తేడాతో దుమ్ము రేపింది. దీపక్ నివాస్ హూడా, మంజిత్ ఛిల్లార్, పర్దీప్ నర్వాల్ విశేషంగా రాణిం చారు. ఇక ఈ మ్యాచ్‌లో ఏమాత్రం పోటీనివ్వలేకపోయిన ఆసీస్ తొలి 11 నిమిషాల్లోనే రెండు సార్లు ఆలౌట్ అయింది. ఇదే ఊపులో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 32-7 తేడాతో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా ఆసీస్ ఆటతీరులో ఏమాత్రం మార్పు లేకపోవడంతో భారత్ అలవోకగా విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 52-18తో ఇంగ్లండ్‌పై విజయం సాధిం చింది. ఈనెల 11న జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ ఆడుతుంది. -
భారత్‌కు కొరియా షాక్
• కబడ్డీ ప్రపంచకప్‌లో పెను సంచలనం • ఆఖరి క్షణాల్లో ఓడిన ఆతిథ్య జట్టు అహ్మదాబాద్: తొమ్మిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న కబడ్డీ ప్రపంచకప్ పెను సంచలనంతో ప్రారంభమైంది. ప్రొ కబడ్డీ లీగ్ ద్వారా స్టార్స్‌గా మారిన భారత ఆటగాళ్లు ప్రపంచ వేదికపై మాత్రం షాక్ తిన్నారు. ప్రొ కబడ్డీలో కోల్‌కతా తరఫున ఆడి భారత్‌కు చిరపరిచితుడైన కొరియా ఆటగాడు జాంగ్ కున్ లీ సంచలన ఆటతీరుతో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. శనివారం జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో కొరియా 34-32తో భారత్‌ను ఓడించింది. తొలి ఐదు నిమిషాల్లో కొరియా 4-2 ఆధిక్యంతో ఉన్నా... భారత జట్టు పుంజుకుని వరుస పాయి0ట్లతో స్టేడియంను హోరెత్తించింది. దీంతో ప్రథమార్ధంలో భారత్ 18-13తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ద్వితీయార్ధంలోనూ భారత్ ఓ దశలో 27-21తో ఆధిక్యంలో ఉంది. అయి0తే చివరి ఐదు నిమిషాల్లో కొరియా ఆటగాళ్లు చెలరేగిపోయారు. పటిష్టమైన డిఫెన్‌సతో టాకిల్ పాయి0ట్లు సాధించారు. మరోవైపు కున్ లీ చివరి మూడు నిమిషాల్లో ఏకంగా ఎనిమిది పాయి0ట్లు తెచ్చాడు. 39వ నిమిషం వరకు 29-27తో ఆధిక్యంలో ఉన్న భారత్... చివరి నిమిషంలో మ్యాచ్‌ను కోల్పోయి0ది. కొరియా తరఫున కున్ లీ మొత్తం పది పాయి0ట్లు సాధించడంతో పాటు మరో ఐదు బోనస్ పాయి0ట్లు కూడా తెచ్చాడు. డాంగ్ జియోన్ లీ ఆరు పాయి0ట్లు సాధించాడు. భారత్ తరఫున కెప్టెన్ అనూప్ కుమార్ 9 పాయి0ట్లు సాధించడంతో పాటు మూడు బోనస్ పాయి0ట్లు తెచ్చాడు. మంజీత్ చిల్లర్ ఐదు పాయి0ట్లు తెచ్చాడు. స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి 9 సార్లు రైడింగ్‌కు వెళ్లి 3 పాయి0ట్లు తెచ్చాడు. కబడ్డీ చరిత్రలో భారత్‌పై కొరియా గెలవడం ఇదే తొలిసారి. మరో మ్యాచ్‌లో ఇరాన్ 52-15 స్కోరుతో అమెరికాపై గెలిచింది. మేరాజ్, ఫాజల్ ఐదేసి పాయింట్లు సాధించారు. వైభవంగా ఆరంభం కబడ్డీ ప్రపంచకప్ కలర్ఫుల్గా ప్రారంభమైంది. తొలుత కళాకారుల విన్యాసాలు, లేజర్ మెరుపులతో కార్యక్రమం సాగింది. ఆ తర్వాత భారత సంప్రదాయ పద్దతిలో ఒక్కో జట్టు కెప్టెన్‌ను కోర్టులోకి తీసుకొచ్చారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ముఖ్య అతిధిగా ప్రసంగించారు. -
‘ప్రపంచం’ కూత పెడుతోంది..!
రేపటినుంచి కబడ్డీ వరల్డ్ కప్ బరిలో 12 దేశాలు హ్యాట్రిక్‌పై భారత్ గురి అహ్మదాబాద్: కబడ్డీ ప్రపంచ కప్ పోటీలకు రంగం సిద్ధమైంది. రేపటినుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగే ఈ విశ్వ పోరులో మొత్తం 12 దేశాలు పాల్గొంటున్నారుు. నగరంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో కొత్తగా నిర్మించిన ‘ది ఎరీనా’ క్రీడా ప్రాంగణం ఈ పోటీలకు వేదిక కానుంది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో కొరియాతో ఆతిథ్య భారత్ తలపడుతుంది. ఈ నెల 22న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. పారుుంట్ల పట్టికలో టాప్-2 జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తారుు. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య నిర్వహిస్తున్న మూడో ప్రపంచకప్ ఇది. గతంలో రెండు సార్లు (2004, 2007)లో భారత్ విజేతగా నిలిచింది. ఇటీవల కబడ్డీకి ఆదరణ పెరగడంతో పాటు తమకు ఆదాయం కూడా పెరగడంతో భారత కబడ్డీ సమాఖ్య టోర్నీని భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. జట్ల వివరాలు: పూల్ ‘ఎ’: భారత్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, అర్జెంటీనా. పూల్ ‘బి’: ఇరాన్, అమెరికా, పోలాండ్, కెన్యా, థాయ్‌లాండ్, జపాన్. ఇదే అసలు ప్రపంచ కప్ గత కొన్నేళ్లలో చాలా సార్లు ప్రపంచకప్ కబడ్డీ వార్తలు వినిపించారుు. 2010నుంచి 2014 వరకు వరుసగా ఐదేళ్ల పాటు ప్రతీ ఏటా పంజాబ్‌లో ప్రపంచకప్ జరిగింది. అరుుతే వాటికి అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య గుర్తింపు లేదు. ఆ టోర్నీలు సర్కిల్ కబడ్డీ వరల్డ్ కప్‌లుగా ప్రాచుర్యంలో ఉన్నారుు. ఇప్పుడు అహ్మదాబాద్‌లో జరుగుతున్న టోర్నమెంట్‌కు అధికారిక గుర్తింపు ఉంది. దీనిని ఇంటర్నేషనల్ ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.