
‘ప్రపంచం’ కూత పెడుతోంది..!
రేపటినుంచి కబడ్డీ వరల్డ్ కప్
బరిలో 12 దేశాలు
హ్యాట్రిక్‌పై భారత్ గురి
అహ్మదాబాద్: కబడ్డీ ప్రపంచ కప్ పోటీలకు రంగం సిద్ధమైంది. రేపటినుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగే ఈ విశ్వ పోరులో మొత్తం 12 దేశాలు పాల్గొంటున్నారుు. నగరంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో కొత్తగా నిర్మించిన ‘ది ఎరీనా’ క్రీడా ప్రాంగణం ఈ పోటీలకు వేదిక కానుంది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో కొరియాతో ఆతిథ్య భారత్ తలపడుతుంది. ఈ నెల 22న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. పారుుంట్ల పట్టికలో టాప్-2 జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తారుు. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య నిర్వహిస్తున్న మూడో ప్రపంచకప్ ఇది. గతంలో రెండు సార్లు (2004, 2007)లో భారత్ విజేతగా నిలిచింది. ఇటీవల కబడ్డీకి ఆదరణ పెరగడంతో పాటు తమకు ఆదాయం కూడా పెరగడంతో భారత కబడ్డీ సమాఖ్య టోర్నీని భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది.
జట్ల వివరాలు: పూల్ ‘ఎ’: భారత్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, అర్జెంటీనా. పూల్ ‘బి’: ఇరాన్, అమెరికా, పోలాండ్, కెన్యా, థాయ్‌లాండ్, జపాన్. ఇదే అసలు ప్రపంచ కప్
గత కొన్నేళ్లలో చాలా సార్లు ప్రపంచకప్ కబడ్డీ వార్తలు వినిపించారుు. 2010నుంచి 2014 వరకు వరుసగా ఐదేళ్ల పాటు ప్రతీ ఏటా పంజాబ్‌లో ప్రపంచకప్ జరిగింది. అరుుతే వాటికి అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య గుర్తింపు లేదు. ఆ టోర్నీలు సర్కిల్ కబడ్డీ వరల్డ్ కప్‌లుగా ప్రాచుర్యంలో ఉన్నారుు. ఇప్పుడు అహ్మదాబాద్‌లో జరుగుతున్న టోర్నమెంట్‌కు అధికారిక గుర్తింపు ఉంది. దీనిని ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.