న్యూఢిల్లీ: ప్రపంచకప్ కబడ్డీ టైటిల్‌ను నెగ్గిన భారత జట్టుకు కేంద్రం నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్టు క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. గురువారం ఆయన నివాసంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ‘ఆటగాళ్లతో పాటు కోచ్‌కు కూడా రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నాం.
ఈ గేమ్ ఒలింపిక్స్‌లో కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే క్రికెట్ మాత్రమే కాకుండా దేశంలో ఫుట్‌బాల్, హాకీ, ఇతర ఆటలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’ అని గోయల్ అన్నారు.