The Indian team
-
ఆసీస్‌ను పడగొడతారా?
ప్రపంచకప్‌లో నేడు భారత మహిళల కీలక పోరు బ్రిస్టల్: మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్ అవకాశాలను పటిష్ట పరుచుకునేందుకు భారత జట్టు కీలక సమరానికి సిద్ధమవుతోంది. తమ అప్రతిహత విజయాలకు దక్షిణాఫ్రికా అడ్డుకట్ట వేసిన అనంతరం నేడు పటిష్టమైన ఆస్ట్రేలియాతో మిథాలీ సేన తలపడనుంది.వరుసగా నాలుగు విజయాల అనంతరం ఎదురైన ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోయి తిరిగి గెలుపుబాట పట్టాలని భారత్ భావిస్తోంది. మరోవైపు సరిగ్గా భారత్‌లాంటి పరిస్థితే ఆసీస్‌కు ఉంది. ఈ జట్టు కూడా వరుసగా నాలుగు విజయాలు సాధించినా తమ చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో భంగపడింది. దీంతో ఈ రెండు జట్లు వీలైనంత త్వరగా తమ ఓటములను వెనక్కినెట్టి సెమీస్ రేసులో ముందుండాలని చూస్తున్నాయి. దూకుడుగా ఆడాల్సిందే.. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. 17 ఓవర్లలో కేవలం 56 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే టాప్ ఆర్డర్ దూకుడును ప్రదర్శించి మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గించాల్సిన అవసరం ఉంది. మరోసారి భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే తడబాటుకు లోను కాకుండా ఆడితేనే ఫలితం ఉంటుంది. పటిష్టంగా ఆసీస్... ఈ ప్రపంచకప్‌లో ఆసీస్ జోరు బలంగా సాగుతోంది. వారికి ఎదురైన ఓటమి కూడా కేవలం మూడు పరుగుల తేడాతోనే ఉండడం గమనించాలి. కెప్టెన్ మెగ్ లానింగ్ జోరును అడ్డుకోవాలంటే భారత బౌలర్లు శ్రమించాల్సిందే. ఎలిస్ పెర్రీ ఆల్‌రౌండ్ ప్రతిభ జట్టుకు కీలకం కానుంది. పేసర్లు విల్లాని, షట్ స్పిన్నర్లు జొనాసెన్, బీమ్స్లను ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌గానే నిలవనుంది. ఆసీస్‌పై ఫలితం తేలిన 41 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది 8 మాత్రమే. ► మ. గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
భారత మహిళల జట్టుకు హ్యాట్రిక్ విజయం
రాణించిన మోనా, రాజేశ్వరి పోట్చెఫ్స్ట్రూమ్: నాలుగు దేశాల మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. జింబాబ్వే జట్టుతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 38.4 ఓవర్లలో కేవలం 93 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ (2/14), రాజేశ్వరి గైక్వాడ్ (3/25) రాణించగా... శిఖా పాండే, మాన్సి జోషి, పూనమ్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం భారత జట్టు కేవలం 18.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి 94 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వేద కృష్ణమూరి ఖాతా తెరవకుండానే అవుటవ్వగా... హర్మన్‌ప్రీత్ కౌర్ (55 బంతుల్లో 38 నాటౌట్; 5 ఫోర్లు), మోనా మేష్రమ్ (53 బంతుల్లో 46; 6 ఫోర్లు, ఒక సిక్స్) రెండో వికెట్‌కు అజేయంగా 93 పరుగులు జోడించి భారత విజయాన్ని ఖాయం చేశారు. నాలుగు జట్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ తన తదుపరి మ్యాచ్‌ను ఈనెల 15న ఐర్లాండ్‌తో ఆడుతుంది. -
ఎదురులేని భారత్
కొలంబో: ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జింబాబ్వేతో సోమవారం జరిగిన చివరిదైన నాలుగో మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బృందం తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ (5/19) ధాటికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 28.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత జట్టు 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 61 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. వేద కృష్ణమూర్తి (16 బంతుల్లో 29; 6 ఫోర్లు) అవుటవ్వగా... మోనా (21 నాటౌట్; 4 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (11 నాటౌట్) అజేయంగా నిలిచారు. ‘సూపర్ సిక్స్’ దశ మ్యాచ్‌ల్లో భారత జట్టు ఈనెల 15న దక్షిణాఫ్రికాతో; 17న బంగ్లాదేశ్‌తో; 19న పాకిస్తాన్‌తో తలపడుతుంది. -
భారత్ అ‘ద్వితీయం’
రెండోసారి అంధుల టి20 ప్రపంచకప్ టైటిల్ సొంతం ఫైనల్లో పాక్‌పై తొమ్మిది వికెట్లతో విజయం బెంగళూరు: లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా... అంతిమ సమరంలో అద్వితీయ ఆటతీరుతో భారత జట్టు అదరగొట్టింది. ఈ క్రమంలో టీమిండియా రెండోసారి అంధుల టి20 క్రికెట్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు చేరిన పాక్ తుది పోరులో మాత్రం ఓటమి చవిచూసింది. 2012లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్‌లోనూ ఫైనల్లో పాకిస్తాన్‌పైనే గెలిచి భారత్ టైటిల్ దక్కించుకుంది. ఐదేళ్ల విరామం తర్వాత జరిగిన రెండో టి20 ప్రపంచకప్‌లోనూ భారత్ ఆద్యంతం ఆకట్టుకునే ఆటతో విజేతగా నిలిచింది. ఫైనల్లో మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది. మునీర్ (37 బంతుల్లో 57; 8 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కేతన్ పటేల్, ఇక్బాల్ రెండేసి వికెట్లు తీయగా... అజయ్ కుమార్ రెడ్డి, సునీల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి 200 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. ఓపెనర్ ప్రకాశ్ జయరామయ్య (60 బంతుల్లో 99 నాటౌట్; 15 ఫోర్లు) సెంచరీకి ఒక పరుగు దూరంలో నిలిచాడు. అజయ్ కుమార్ రెడ్డి(31 బంతుల్లో 43; 4 ఫోర్లు) తో కలిసి ప్రకాశ్ తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించాడు. అజయ్ అవుటయ్యాక కేతన్ పటేల్ (13 బంతుల్లో 26 రిటైర్డ్ హర్ట్)తో కలిసి రెండో వికెట్‌కు ప్రకాశ్ 51 పరుగులు జతచేశాడు. కేతన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో అతని స్థానంలో వచ్చిన దున్నా వెంకటేశ్వర రావు (11 బంతుల్లో 11 నాటౌట్; ఒక ఫోర్)తో కలిసి ప్రకాశ్ భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. విజేతగా నిలిచిన భారత్‌కు రూ. 3 లక్షలు ప్రైజ్‌మనీగా లభించింది. ప్రకాశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’ పురస్కారం దక్కింది. అజయ్ అదుర్స్... భారత జట్టు రెండోసారి టి20 ప్రపంచకప్ సాధించడంలో ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి కీలకపాత్ర పోషించాడు. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన 26 ఏళ్ల అజయ్ కుమార్ రెడ్డి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన అజయ్ మొత్తం 296 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో అజయ్ 9 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన దున్నా వెంకటేశ్వర రావు, టి. దుర్గా రావు (శ్రీకాకుళం), జి. ప్రేమ్ కుమార్ (కర్నూలు) కూడా ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ►భారత జట్టు అంధుల టి20 ప్రపంచకప్ గెలిచినందుకు ఆనందంగా ఉంది. జట్టు సభ్యులందరికీ అభినందనలు. మీ విజయంపట్ల యావత్ దేశం గర్వపడుతోంది. – ప్రధాని నరేంద్ర మోది. ► గతేడాది రియో పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు మెరిశారు. ఈ ఏడాది అంధుల క్రికెట్ జట్టు రెండోసారి టి20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచి భారత క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. – కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ ► తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. అంధుల టి20 ప్రపంచకప్ టైటిల్ నెగ్గడం ద్వారా భారత జట్టు నిరూపించింది. మీ అందరి ప్రదర్శన అద్భుతం. – సచిన్ టెండూల్కర్ -
సునీల్ సెంచరీ
భారత్‌కు ఆరో విజయం అంధుల టి20 ప్రపంచకప్ కొచ్చి: సొంతగడ్డపై జరుగుతున్న అంధుల టి20 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 128 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కిది ఆరో విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 272 పరుగులు చేసింది. ఓపెనర్ సునీల్ (72 బంతుల్లో 163 నాటౌట్; 29 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. మొహమ్మద్ ఫర్హాన్ (35 బంతుల్లో 53 రిటైర్డ్ హర్ట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాక రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి సునీల్, ఫర్హాన్ 15 ఓవర్లలో 199 పరుగులు జోడించారు. ఆ తర్వాత క్రీజ్‌లో వచ్చిన ఇక్బాల్ జాఫర్ (13 బంతుల్లో 30 నాటౌట్)తో కలిసి సునీల్ చివరి ఐదు ఓవర్లలో 73 పరుగులు జతచేశారు. 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 18.3 ఓవర్లలో 144 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్ర క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు పడగొట్టగా... ఇక్బాల్, ప్రేమ్ ఒక్కో వికెట్ తీశారు. పది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్ ఆరు విజయాలు సాధించి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. -
జులన్, సుకన్య ఔట్
న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌కు ముందు భారత జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అగ్రశ్రేణి బ్యాట్స్‌విమన్ స్మృతి మందన దూరం కాగా, తాజాగా సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి గాయం కారణంగా జట్టునుంచి తప్పుకుంది. జులన్‌తో పాటు సుకన్య పరీదాలను కూడా టీమ్‌నుంచి తొలగించారు. 14 మంది సభ్యుల జట్టులోకి ఎంపికైన తర్వాత వీరిద్దరు పూర్తి ఫిట్‌గా లేరని డాక్టర్లు నిర్ధారించడంతో మార్పు అనివార్యమైంది. గోస్వామి స్థానం లో సోని యాదవ్, పరీదా స్థానంలో మాన్సి జోషిలను జట్టులోకి తీసుకున్నారు. -
భారత టి20 అంధుల జట్టులో మనోళ్లు ముగ్గురు
కెప్టెన్‌గా అజయ్‌కుమార్ రెడ్డి జనవరి 28 నుంచి ప్రపంచకప్ ముంబై: స్వదేశంలో జరిగే ప్రపంచకప్ టి20 అంధుల క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు క్రికెటర్లకు స్థానం లభించింది. గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ కుమార్ రెడ్డి జట్టుకు నాయకత్వం వహించనుండగా... టి. దుర్గా రావు (నల్లగొండ), డి. వెంకటేశ్వర రావు (విశాఖపట్నం) ఇతర సభ్యులుగా ఉన్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరిగే ఈ టోర్నమెంట్ ఫైనల్‌కు బెంగళూరు వేదికగా నిలుస్తుంది. జనవరి 5 నుంచి ఇండోర్‌లో జట్టుకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. విజేత జట్టుకు రూ. 20 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ. 15 లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. భారత్‌తోపాటు ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, నేపాల్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు పాల్గొంటున్నాయి. 2012లో పాకిస్తాన్లో జరిగిన తొలి టి20 అంధుల ప్రపంచకప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. భారత టి20 అంధుల జట్టు: అజయ్ కుమార్ రెడ్డి (కెప్టెన్), ప్రకాశ జయరామయ్య (వైస్ కెప్టెన్), దీపక్ మలిక్, రాంబీర్ సింగ్, సుఖ్రామ్ మాఝీ, టి.దుర్గా రావు, ఆర్.సునీల్, డి.వెంకటేశ్వర రావు, గణేశ్భాయ్ ముహుంద్కర్, ఫైజల్, ఫర్హాన్, కేతన్భాయ్ పటేల్, జఫర్ ఇక్బాల్, సోనూ గోల్కర్, అనీష్ బేగ్, ప్రేమ్‌కుమార్. -
ఫైనల్లో భారత్
శ్రీలంకపై విజయం ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ బ్యాంకాక్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో వరుస విజయాలతో అదరగొడుతున్న భారత జట్టు ఫైనల్‌కు చేరింది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌వుమన్ మిథాలీ రాజ్ (59 బంతుల్లో 62; 6 ఫోర్లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడు బౌలర్లు ఏక్తా బిస్త్ (3/8),ప్రీతి బోస్ (3/14) చెలరేగడంతో భారత్ 52 పరుగుల తేడాతో గెలిచింది. నేడు (శుక్రవారం) జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు నేపాల్‌తో తలపడుతుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 121 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు వేద కృష్ణమూర్తి (23 బంతుల్లో 21; 3 సిక్స్)తో కలిసి మిథాలీ 50 పరుగులు జోడించింది. మరో ఓపెనర్ స్మృతి మందన (28 బంతుల్లో 21; 1 ఫోర్) ఆకట్టుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 69 పరుగులు మాత్రమే చేయగలిగింది. సురంగిక (32 బంతుల్లో 20), వీరక్కోడి (14 బంతుల్లో 14; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. భారత బౌలర్ల ధాటికి నాలుగు పరుగుల వ్యవధిలో లంక తమ చివరి నాలుగు వికెట్లను కోల్పోరుుంది. -
పోరాడి ఓడిన భారత్
నాలుగు దేశాల హాకీ టోర్నీ మెల్బోర్న్: న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్లో టైటిల్ రేసు నుంచి వైదొలిగింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 2-3 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. ఈ పరాజయంతో భారత్ ఆదివారం మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో మలేసియాతో ఆడుతుంది. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (18వ, 57వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... న్యూజిలాండ్ జట్టుకు నిక్ రాస్ (47వ ని.లో), జాకబ్ స్మిత్ (48వ ని.లో), ఇంగ్లిస్ హుగో (57వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా తలపడుతుంది. -
బీసీసీఐపై న్యాయపోరు: పీసీబీ
కరాచీ: ఐసీసీ మహిళల చాంపియన్స లీగ్‌లో తమ జట్టుతో ఆడేందుకు నిరాకరించిన భారత జట్టుపై ఐసీసీ ఆరు పారుుంట్ల కోత విధించడం పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్టరుు్యంది. ఇప్పుడు ఇదే జోరులో బీసీసీఐపై న్యాయపోరుతో పాటు నష్టపరిహారాన్ని కోరేందుకు సిద్ధమవుతోంది. ‘2014లో ఇరు బోర్డుల మధ్య కుదిరిన ఎంవోయూ ప్రకారం 2015 నుంచి 2022 వరకు ఆరు సిరీస్‌లు జరగాలి. కానీ వారి ప్రభుత్వం అంగీకరించడం లేదని బీసీసీఐ ముందుకురావడం లేదు. అందుకే దీనికి సంబంధించిన సాక్ష్యాలను ఐసీసీ ముందుంచాలని కోరుతున్నాం. భారత్ మాతో ఆడకపోవడంతో పీసీబీ రెవిన్యూ దారుణంగా దెబ్బతింది. ఇందుకు నష్టపరిహారాన్ని కూడా కోరతాం’ పాక్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నారు. -
భువనేశ్వర్‌కు పిలుపు గంభీర్‌పై వేటు
ఇంగ్లండ్‌తో జరిగే తర్వాతి మూడు టెస్టుల కోసం భారత జట్టును ప్రకటించారు. గాయంనుంచి పూర్తిగా కోలుకున్న పేసర్ భువనేశ్వర్ కుమార్ జట్టులోకి తిరిగి వచ్చాడు. కివీస్‌తో జరిగిన రెండో టెస్టు తర్వాత అతను జట్టుకు దూరమయ్యాడు. వైజాగ్ టెస్టు తుది జట్టులో స్థానం లభించని సీనియర్ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను సెలక్టర్లు పూర్తిగా తప్పించారు. 16 మంది సభ్యుల జట్టులో అతనికి స్థానం లభించలేదు. ఈ మార్పులు మినహా ఇతర ఆటగాళ్లంతా సిరీస్ కోసం కొనసాగనున్నారు. తాజా పరిణామంతో గంభీర్ కెరీర్ ముగిసినట్లుగా భావిస్తున్నారు. భారత్ తరఫున గంభీర్ 58 టెస్టుల్లో 4154 పరుగులు చేశాడు. -
విండీస్‌ను గెలిపించిన స్టెఫానీ
తొలి టి20లో భారత్ ఓటమి విజయవాడ స్పోర్ట్స: మహిళల టి20 ఫార్మాట్లో వరల్డ్ చాంపియన్ వెస్టిండీస్ జట్టు సత్తా చాటింది. వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోరుునప్పటికీ... టి20 ఫార్మాట్లో మాత్రం వెస్టిండీస్ దుమ్మురేపింది. భారత జట్టుతో శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 151 పరుగుల విజయలక్ష్యాన్ని వెస్టిండీస్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోరుు అధిగమించింది. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (51 బంతుల్లో 90, 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరవిహారం చేసి విండీస్ విజయంలో కీలకపాత్ర పోషించింది. హెలీ మాథ్యూస్ (18), బ్రిట్నీ కూపర్ (16), మెరిస్సా (15) స్టెఫానీకి సహకరించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. వేద కృష్ణమూర్తి (46 బంతుల్లో 50; 6 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (50 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. -
కబడ్డీ ఆటగాళ్లకు నజరానా
న్యూఢిల్లీ: ప్రపంచకప్ కబడ్డీ టైటిల్‌ను నెగ్గిన భారత జట్టుకు కేంద్రం నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్టు క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. గురువారం ఆయన నివాసంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ‘ఆటగాళ్లతో పాటు కోచ్‌కు కూడా రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నాం. ఈ గేమ్ ఒలింపిక్స్‌లో కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే క్రికెట్ మాత్రమే కాకుండా దేశంలో ఫుట్‌బాల్, హాకీ, ఇతర ఆటలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’ అని గోయల్ అన్నారు. -
పాక్... మళ్లీ కాచుకో
ఆసియా చాంపియన్ ట్రోఫీ హాకీ ఫైనల్ భారత్ పాకిస్తాన్‌తో నేడు తుదిపోరు క్వాంటన్ (మలేసియా): ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీ లీగ్ దశలో పాక్‌ను చిత్తు చేసిన భారత జట్టుకు దాయాదిని మరోసారి దుమ్ముదులిపే అవకాశం లభించింది. నేడు జరిగే ఫైనల్లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నారుు. శనివారం జరిగిన తొలి సెమీస్‌లో భారత్ షూటౌట్లో 5-4తో దక్షిణ కొరియాపై విజయం సాధించగా... రెండో సెమీస్‌లో పాకిస్తాన్ షూటౌట్లోనే మలేసియాను 3-2తో ఓడించింది. కొరియా, భారత్‌ల సెమీస్ పోరులో నిర్ణీత సమయానికి ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచారుు. ఆట 15వ నిమిషంలో తల్విందర్ సింగ్ గోల్‌తో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే 21వ నిమిషంలో కొరియా ఆటగాడు సియో ఇన్ వూ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. 53వ నిమిషంలో జిహున్ యాంగ్ గోల్‌తో కొరియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే 55వ నిమిషంలో సర్దార్ సింగ్ అందించిన పాస్‌ను రమణ్‌దీప్ సింగ్ గోల్‌గా మలచడంతో భారత్ 2-2తో స్కోరును సమం చేసింది. దీంతో ఫలితం కోసం కోసం షూటౌట్‌ను ఆశ్రరుుంచారు. షూటౌట్లో కొరియా ప్లేయర్ లీ డా యోల్ ఐదో షాట్‌ను భారత కెప్టెన్, గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ అడ్డుకొని భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. షూటౌట్లో భారత్ తరఫున సర్దార్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, బిమల్ లాక్రా (రూపిందర్ పాల్ సింగ్) సఫలమయ్యారు. చివరిదైన ఐదో షాట్‌ను బిమల్ లాక్రా తీసుకోగా కొరియా గోల్‌కీపర్ ఫౌల్ చేయడంతో రిఫరీ భారత్‌కు పెనాల్టీ ో్టక్ ్రఇచ్చాడు. ో్టక్న్రు రూపిందర్ గోల్‌గా మలిచాడు. కొరియా తరఫున మన్జే జంగ్, కిమ్ హయోంగ్జిన్, లీ జుంగ్జిన్, బే జోంగ్సుక్ సఫలంకాగా... చివరిదైన ఐదో షాట్లో లీ డా యోల్ విఫలమయ్యాడు. ఈ టోర్నీ చరిత్రలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. ఫైనల్ సాయంత్రం గం. 6.00 నుంచి స్టార్ స్పోర్ట్స-4లో ప్రత్యక్ష ప్రసారం -
నాకౌట్ ‘కూత’
కబడ్డీ ప్రపంచకప్ సెమీస్ నేడు కొరియా(vs)ఇరాన్ రాత్రి 8 గంటల నుంచి భారత్(vs) థాయ్‌లాండ్ రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం అహ్మదాబాద్: కబడ్డీ ప్రపంచకప్ సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు థాయ్‌లాండ్‌తో, ఇరాన్ జట్టు కొరియాతో తలపడనున్నారుు. ప్రపంచకప్ ఎక్కడ, ఎప్పుడు జరిగినా విజేతగా నిలిచే భారత్‌కు ఈసారి తొలి లీగ్ మ్యాచ్‌లోనే కొరియా రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అరుుతే ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి భారత్ సత్తా చాటింది. మంచి అనుభవం కలిగిన రైడ్ విభాగంతో పాటు పటిష్ట డిఫెన్‌సతో నేటి సెమీస్‌లో థాయ్‌లాండ్‌ను చిత్తు చేయాలని భావిస్తోంది. పూర్తిగా స్టార్ ఆటగాళ్లతో నిండిన భారత్‌కు అనూప్ కుమార్, రాహుల్ చౌదరి, పర్దీప్ నర్వాల్, మంజీత్ ఛిల్లర్, దీపక్ హూడా కీలకం కానున్నారు. ఇక తన ప్రత్యర్థి థాయ్‌లాండ్ ఈసారి టోర్నీకి పూర్తిగా యువ ఆటగాళ్లను బరిలోకి దించింది. ఈ జట్టు కూడా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో గ్రూప్ బి టాపర్‌గా నిలిచింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌పై చివర్లో 8 పారుుంట్లు సాధించి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. అందుకే ఎలాంటి నిర్లక్ష్యానికి తావీయకుండా భారత్ ఆడాల్సి ఉంది. ఇక లీగ్‌ల్లో ఓటమనేదే లేకుండా దూసుకెళ్లిన కొరియా జట్టు... ఎక్కువగా తమ స్టార్ రైడర్ జన్ కున్ లీపై ఆధారపడింది. భారత్, బంగ్లాదేశ్‌లతో జరిగిన కీలక మ్యాచ్‌ల్లోనూ తనే చివర్లో చెలరేగి జట్టును గట్టెక్కించాడు. అరుుతే పటిష్ట డిఫెన్స ఉన్న ఇరాన్‌ను ఓడించాలంటే శక్తికి మించి ఆడాల్సిందే.. -
భారత్ 10 జపాన్ 2
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ రూపిందర్ ఆరు గోల్స్ క్వాంటన్ (మలేసియా): ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీ టోర్నీని భారత జట్టు ఘన విజయంతో ప్రారంభించింది. గత రన్నరప్ జపాన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10-2తో తేడాతో గెలిచింది. తాత్కాలిక కెప్టెన్ రూపిందర్ పాల్ సింగ్ ఒక్కడే ఇందులో ఆరు గోల్స్ చేయడం విశేషం. 22న తమ తదుపరి మ్యాచ్‌లో భారత్, దక్షిణ కొరియాతో ఆడుతుంది. అద్భుత డ్రాగ్ ఫ్లిక్స్‌తో మైదానంలో పాదరసంలా కదిలిన రూపిందర్‌ను జపాన్ డిఫెండర్లు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. జట్టుకు లభించిన పది పెనాల్టీ కార్నర్స్‌లో ఆరింటిని రూపిందరే సాధించడం విశేషం. రమణ్‌దీప్ సింగ్ రెండు గోల్స్, తల్వీందర్ సింగ్, యూసుఫ్ అఫ్ఫాన్ చెరో గోల్ చేశారు. జపాన్ తరఫున కెంటా టనకా, హిరోమాస ఒచాయ్ గోల్స్ కొట్టారు. పలువురు సీనియర్లు గాయాలతో జట్టుకు దూరమైనా ఆటతీరులో ఏమాత్రం మార్పు కనిపించని భారత్ ప్రత్యర్థిని చావుదెబ్బ తీసింది. రెండో నిమిషంలోనే రమణ్ దీప్ సింగ్ గోల్ అందించాడు. ఏడో నిమిషంలో జట్టుకు పెనాల్టీ కార్నర్ అవకాశం చిక్కింది. దీన్ని రూపిందర్ డెరైక్ట్ ఫ్లిక్ షాట్‌తో గోల్‌గా మలిచాడు. 10వ నిమిషంలోనే జట్టుకు లభించిన మరో పీసీని కూడా రూపిందర్ గోల్‌గా మలిచాడు. 15వ నిమిషంలో రమణ్‌దీప్ రివర్స్ డ్రైవ్ గోల్‌తో భారత్‌కు తొలి క్వార్టర్లో 4-0 ఆధిక్యం లభించింది. ఆ తర్వాత కూడా రూపిందర్ 17, 19, 22 నిమిషాల్లో వెంటవెంటనే గోల్స్ చేయడంతో జట్టు ఆధిక్యం 7-0కి వెళ్లింది. 23వ నిమిషంలో ఎట్టకేలకు జపాన్ ఖాతా తెరిచింది. 38వ నిమిషంలో తన రెండో గోల్ సాధించింది. అరుుతే 46వ నిమిషంలో రూపిందర్ మరోసారి విరుచుకుపడి తన ఆరో గోల్ చేశాడు. ఇక 50వ నిమిషంలో యూసుఫ్ గోల్‌తో భారత్ విజయం పరిపూర్ణమైంది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో మలేసియా 4-2తో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్‌ను ఓడించింది. -
హిట్ హిట్ హుర్రే
సన్ డే....‘ఫన్’డేగా మారింది. ట్వంటీ ట్వంటీ క్రికెట్ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. చెక్కిలిపై మువ్వన్నెల సింగారంతో, చేతిలో త్రివర్ణ పతకాల రెపరెపలతో యువత క్రికెట్ సంబరానికి వన్నె తెచ్చారు. అచ్చొచ్చిన స్టేడియంలో అభిమానుల కేరింతల నడుమ భారత జట్టు లంకపై అలవోకగా నెగ్గింది...మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఫలితం ఏమిటో తేలిపోయింది...ఏకపక్షంగా సాగిన మ్యాచ్ ఫటాఫట్‌గా ముగిసిపోవడంతో అభిమానులు కాస్త నిరాశపడినా భారత జట్టు గెలుపుతో క్రికెట్ ‘ఫన్’డుగను ఎంతో ఆస్వాదించారు. -
బాబోయ్... ఫుట్‌బాల్ వద్దు
నెహ్రాకు గాయాల భయం న్యూఢిల్లీ: భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లో చాలా కాలంగా ఫుట్‌బాల్ అంతర్భాగంగా మారిపోయింది. మన ఆటగాళ్లు నెట్స్‌లోకి వెళ్లే ముందు వార్మప్ కోసం రెండు జట్లుగా విడిపోయి ఫుట్‌బాల్ ఆడటం రొటీన్. అయితే పేసర్ నెహ్రా మాత్రం ఇప్పుడు ఫుట్‌బాల్ పేరెత్తితేనే బెంబేలెత్తిపోతున్నాడు. ‘ఒకప్పుడు నేనూ ఫుట్‌బాల్ ఆడేవాడిని. కానీ ప్రస్తుత స్థితిలో ఎలాంటి సాహసాలు చేయదల్చుకోలేదు. నా కెరీర్లో చాలా సార్లు గాయాల పాలయ్యాను. కాబట్టి ఇక ముందు మరింత జాగ్రత్తగా ఉండదల్చుకున్నాను. అందుకే జట్టు ఫుట్‌బాల్ ఆడినా నేను ఆ వైపు వెళ్లదల్చుకోలేదు’ అని నెహ్రా చెప్పుకొచ్చాడు. గతంలో భారత జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లు కూడా మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ గాయపడి జట్టుకు దూరమైన సందర్భాలున్నాయి. -
అనుష్కతో కలిసి విరాట్...
ముంబైలో దిగిన కోహ్లి స్వదేశానికి భారత క్రికెటర్లు ముంబై: ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించిన భారత జట్టు శనివారం స్వదేశంలో అడుగుపెట్టింది. విరాట్ కోహ్లి తన స్వస్థలం ఢిల్లీ వెళ్లకుండా... అనుష్క శర్మతో కలిసి ముంబైలో అడుగుపెట్టాడు. చేతిలో చేయి వేసుకుని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. రోహిత్, రహానే, జడేజా, అక్షర్ పటేల్, టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి కూడా ముంబైలోనే దిగారు. ఇక కెప్టెన్ ధోని ఢిల్లీలో అడుగుపెట్టగా... మిగిలిన ఆటగాళ్లు కూడా రాత్రే భారత్‌కు చేరుకున్నారు. -
భారత్ ప్రదర్శన అద్భుతం: దాల్మియా
న్యూఢిల్లీ: సెమీస్‌లో ఓటమిని పక్కనబెడితే... ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన అత్యద్భుతంగా ఉందని బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ప్రశంసించారు. ఏడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో ఊహించని స్థాయిలో రాణించిందన్నారు. ‘వరల్డ్‌కప్‌లో మన జట్టు ప్రదర్శన చాలా బాగుంది. జట్టు మొత్తానికి నా అభినందనలు. మ్యాచ్‌ల సందర్భంగా ఆటగాళ్లందరూ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు నిజమైన స్ఫూర్తితో ఆట ఆడారు. రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. భారత క్రికెట్‌ను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారు’ అని దాల్మియా పేర్కొన్నారు. మరోవైపు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశారు. -
నిలవాలంటే గెలవాలి !
భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటి వరకు నాలుగు టెస్టులు, రెండు వన్డే మ్యాచ్‌లు ఆడింది. కానీ ఒక్క విజయం కూడా రుచి చూడ లేదు. ముందున్నది ప్రపంచకప్ కాలం. అందుకు సన్నాహకంగా సాగుతున్న టోర్నీలో కొత్త లోపాలు బయట పడ్డాయి. ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లే. కాంబి నేషన్లు, బ్యాటింగ్ ఆర్డర్లు అన్నీ ఇక్కడే తేలిపోవాలి. వాటితో పాటు ముక్కోణపు టోర్నీలో ఇప్పుడు జట్టుకు ఒక్క విజయం కూడా కావాలి. సిడ్నీ: భారత రిపబ్లిక్ డే, ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం రోజున ఇరు జట్లు క్రికెట్ మైదానంలో బరిలోకి దిగుతున్నాయి. ముక్కోణపు వన్డే టోర్నీలో భాగంగా సోమవారం జరిగే ఐదో లీగ్ మ్యాచ్‌లో భారత్, ఆసీస్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్ చేరుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఆసీస్‌తో గెలిస్తే ఇంగ్లండ్‌పై సాధారణ విజయం చాలు. ఇక్కడ ఓడినా స్వల్ప అవకాశాలు ఉంటాయి. అయితే చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారీ తేడాతో ఓడించడం, రన్‌రేట్ కాపాడుకోవడంవంటి చాలా అంశాలు ముడిపడి ఉం టాయి. కాబట్టి నేటి మ్యాచ్‌లో విజయం కోసం ధోని సేన సర్వ శక్తులు ఒడ్డాల్సి ఉంది. బరిలోకి ఇషాంత్ ఆసీస్‌పై తొలి మ్యాచ్‌లో పోరాట పటిమ కనబర్చిన భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో మాత్రం ఘోరంగా ఓటమిపాలైంది. అప్పటి వరకు బౌలింగే సమస్య అనుకుంటే, గత మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ మరీ బలహీనంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాలి. రోహిత్ శర్మ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో వరుసగా విఫలమవుతున్నా... ధావన్‌కు తుది జట్టులో చోటు ఖాయం. భారత బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కోహ్లి ఏ స్థానంలో ఆడతాడనేది మాత్రం ఆసక్తికరం. రవీంద్ర జడేజా కొంత వరకు కోలుకున్నా, అతని మ్యాచ్ ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నాయి. కాబట్టి వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయినా అక్షర్ పటేల్‌కు మరో అవకాశం దక్కవచ్చు. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన ఇషాంత్ శర్మ ఈ మ్యాచ్ బరిలోకి దిగడం ఖాయమైంది. పేసర్లు ఉమేశ్, షమీలలో ఒకరిని తప్పించి అతనికి అవకాశం కల్పిస్తారు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో రెండో స్పిన్నర్‌గా అశ్విన్‌ను ఎంపిక చేసి... గత మ్యాచ్‌లో జట్టులో మెరుగైన ప్రదర్శన కనబర్చిన స్టువర్ట్ బిన్నీని పక్కన పెడతారా చూడాలి. కెప్టెన్‌గా బెయిలీ మరోవైపు ఇప్పటికే ఫైనల్ చేరిన ఆస్ట్రేలియాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. అయినా సరే ఈ మ్యాచ్‌లో ఉదాసీనత ప్రదర్శించవద్దని జట్టు భావిస్తోంది. ఆ జట్టు కూడా ప్రపంచ కప్‌కు ముందు వేర్వేరు కాంబినేషన్లను ప్రయత్నిస్తోంది. జార్జ్ బెయిలీ మరోసారి కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. అయితే సుదీర్ఘ కాలంగా బ్యాటింగ్‌లో విఫలమవుతున్న అతను ఈ మ్యాచ్‌లోనైనా రాణించాల్సి ఉంది. వైట్ స్థానంలో అతను జట్టులోకి వస్తుండగా, షాన్ మార్ష్ స్థానంలో డేవిడ్ వార్నర్ బరిలోకి దిగుతున్నాడు. వైట్, మార్ష్ ప్రపంచ కప్ జట్టులో లేరు. బౌలింగ్ విభాగంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ డోహర్తి రావడం ఖాయమైంది. అదే విధంగా రొటేషన్ పాలసీ ప్రకారం హాజల్‌వుడ్, మిషెల్ మార్ష్‌లకు కూడా అవకాశం దక్కవచ్చు. స్టీవెన్ స్మిత్ అద్భుత ఫామ్‌లో ఉండటంతో పాటు వార్నర్, ఫించ్ కూడా రాణిస్తుండటం ఆసీస్ బలంగా చెప్పవచ్చు. మ్యాక్స్‌వెల్ కూడా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడితే ఆసీస్‌కు తిరుగుండదు. ఆ జట్టు రెండో స్పిన్నర్ కోటాను అతను పూర్తి చేయగలడు. జట్ల వివరాలు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రహానే, రాయుడు, కోహ్లి, రైనా, అక్షర్, భువనేశ్వర్, ఇషాంత్ శర్మ, బిన్నీ/అశ్విన్, ఉమేశ్/షమీ. ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), ఫించ్, వార్నర్, స్మిత్, మ్యాక్స్‌వెల్, హాడిన్, ఫాల్క్‌నర్, స్టార్క్, హాజల్‌వుడ్, డోహర్తి, మిషెల్ మార్ష్/సంధు. ఉ. గం.8.50 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం పరిస్థితులకు తగిన విధంగా ఉపయోగించుకోగల ఆట గాళ్లు జట్టులో ఉండటమే మాకు పెద్ద బలం. అది గతంలోనూ చూశాము. ఇకపై కూడా అలా చేయగలం. అవసరమున్న సమయంలో డోహర్తిని ఆడించగలగడం, పేస్ బౌలర్లను ఉపయోగిం చుకోగలగడం కూడా ఇందులో భాగమే. కాబట్టి 15 మంది సభ్యులకూ తగిన పాత్ర ఉంటుంది. -బెయిలీ, ఆసీస్ కెప్టెన్ ప్రయోగం అనే పదాన్ని మేం నిషేధించాం. మేం అలాంటివి ఏమీ చేయడం లేదు. మా అత్యుత్తమ 11 మంది ఆటగాళ్లనే బరిలోకి దించుతున్నాం. దీనికి ఎవరు ఎలాంటి పేరు పెట్టుకున్నా అభ్యంతరం లేదు. గాయాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే. ప్రపంచ కప్‌లో రోహిత్ ఫిట్‌నెస్‌పై గురించి అప్పుడే ఆందోళన అనవసరం. -ధోని, భారత కెప్టెన్ పిచ్, వాతావరణం వికెట్ పొడిగా ఉంది. స్పిన్‌కు అనుకూలం. రెండో ఇన్నింగ్స్‌లో ఇది మరింత సహకరించే అవకాశం ఉంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య 13 మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 12 మ్యాచ్‌ల్లో నెగ్గగా... భారత్ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. -
కల ఫలించింది
ప్రపంచకప్‌కు అంబటి రాయుడు ఎంపిక 15 మంది సభ్యులతో భారత జట్టు ప్రకటన దశాబ్దన్నర తర్వాత తెలుగు రాష్ట్రాల క్రికెటర్ ప్రపంచకప్ కోసం భారత జట్టులోకి ఎంపికయ్యాడు. 1999 ప్రపంచకప్‌లో అజహర్ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు హైదరాబాదీ అంబటి తిరుపతి రాయుడు ప్రపంచకప్ ఆడబోతున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఫిబ్రవరి 14 నుంచి జరిగే ఈ మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన భారత జట్టును మంగళవారం ప్రకటించారు. ఇటీవల నిలకడగా ఆడుతున్న యువ క్రికెటర్లకే పెద్ద పీట వేసిన సెలక్టర్లు... యువరాజ్ సహా సీనియర్లందరినీ విస్మరించారు. స్టువర్ట్ బిన్నీ మినహా దాదాపుగా ఊహించినట్లుగానే జట్టు ఉంది. మూడు ప్రపంచకప్‌ల తర్వాత ఈసారి ప్రపంచకప్ జట్టులో తెలుగు తేజం 29 ఏళ్ల అంబటి తిరుపతి రాయుడు చోటు దక్కించుకున్నాడు. గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి సయ్యద్ ఆబిద్ అలీ (1975లో) అజహరుద్దీన్ (1987, 1992, 1996, 1999లో), వెంకటపతిరాజు (1992, 1996లో) ప్రపంచకప్‌లు ఆడారు. 1999 ఇంగ్లండ్ ప్రపంచకప్‌లో అజహరుద్దీన్ ఆడిన తర్వాత... మూడు ప్రపంచకప్‌లలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరూ జట్టులో స్థానం దక్కించుకోలేదు. ఎట్టకేలకు రాయుడు ఈ కొరత తీర్చాడు. 2004లో అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు సారథిగా వ్యవహరించిన రాయుడుకు... ఇన్నేళ్ల తర్వాత సీనియర్ ప్రపంచకప్ ఆడే అవకాశం లభించింది. ‘మా అబ్బాయి ప్రపంచకప్‌కు ఎంపిక కావడం నిజంగా మాకు పండగ రోజు. తల్లిదండ్రులుగా మాకు ఇంతకంటే ఆనందకరమైన క్షణం మరొకటి లేదు. ఆటగాడిగా రాయుడు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఇన్నేళ్ల మా కష్టానికి కూడా ప్రతిఫలం దక్కిందనే తృప్తి ఇప్పుడు లభించింది. రాయుడు బాగా ఆడితే, మన జట్టు గెలిస్తే అదంతా బోనస్ లాంటిదే. కానీ ఇది మాత్రం మా జీవితంలో అత్యంత మధుర క్షణం’ - ‘సాక్షి’తో రాయుడు తల్లిదండ్రులు సాంబశివరావు, విజయలక్ష్మి -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
నెదర్లాండ్స్‌పై భారత్ సంచలన విజయం 18 ఏళ్ల తర్వాత తొలి గెలుపు రేపు క్వార్టర్స్‌లో బెల్జియంతో ‘ఢీ’ చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ భువనేశ్వర్: తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన కసినంతా నెదర్లాండ్స్‌పై తీర్చుకున్న భారత జట్టు సంచలనం సృష్టించింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రపంచ రెండో ర్యాంకర్ నెదర్లాండ్స్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3-2 గోల్స్ తేడాతో అద్వితీయ విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై 18 ఏళ్ల తర్వాత టీమిండియా తొలిసారి నెగ్గింది. భారత్ తరఫున సునీల్ (33వ నిమిషంలో), మన్‌ప్రీత్ సింగ్ (47వ నిమిషంలో), రూపిందర్ సింగ్ (49వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్ జట్టుకు వాన్ డెర్ వీర్డెన్ మింక్ (36వ, 58వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు.మన్‌ప్రీత్ సింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. చివరిసారి 1996లో ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్‌ను ఓడించిన భారత్... చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఆ జట్టుపై 1986 తర్వాత తొలిసారి గెలిచింది. నెదర్లాండ్స్‌పై విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో మూడు పాయింట్లతో జర్మనీతో సమఉజ్జీగా నిలిచింది. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఈ గ్రూప్‌లో భారత్‌కు మూడో స్థానం (-2 గోల్స్) దక్కగా... జర్మనీ (-5 గోల్స్) నాలుగో స్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా 3-0తో జర్మనీపై; ఆస్ట్రేలియా 3-0తో పాకిస్తాన్‌పై గెలుపొందగా... ఇంగ్లండ్, బెల్జియం జట్ల మధ్య మ్యాచ్ 1-1 వద్ద ‘డ్రా’గా ముగిసింది. -
బ్యాట్స్‌మెన్ అదుర్స్
అడిలైడ్: టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ షోను ప్రదర్శించింది. మొదటి రోజు బౌలర్లు సత్తా చాటితే... రెండో రోజు ఐదుగురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలతో చెలరేగారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. గ్లిడెరల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... రెండో రోజు మంగళవారం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లలో 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (114 బంతుల్లో 60; 7 ఫోర్లు) టాప్ స్కోరర్. విజయ్ (82 బంతుల్లో 51 రిటైర్డ్ అవుట్; 8 ఫోర్లు), పుజారా (80 బంతుల్లో 55 రిటైర్డ్ అవుట్; 11 ఫోర్లు), సాహా (75 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ శర్మ (54 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రైనా (49 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఓవర్‌నైట్ స్కోరు 55/1తో ఆట కొనసాగించిన భారత్ ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. విజయ్, పుజారా రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అర్ధసెంచరీలు పూర్తయిన తర్వాత ఇద్దరు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు. తర్వాత కోహ్లి ఆకట్టుకున్నా... రహానే (1), రోహిత్ (23) విఫలమయ్యారు. లంచ్ తర్వాత కెప్టెన్‌తో జత కలిసిన రైనా వేగంగా ఆడాడు. స్లో బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆరో వికెట్‌కు 55 పరుగులు జోడించాక రైనా అవుటయ్యాడు. తర్వాత స్వల్ప వ్యవధిలో కోహ్లి, అశ్విన్ (6) అవుటైనా.. చివర్లో సాహా, కరణ్‌లు వీరవిహారం చేశారు. సీఏ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 78 పరుగులు జోడించారు. లాలర్, షార్ట్ చెరో రెండు వికెట్లు తీశారు. శుక్రవారం నుంచి జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్... సీఏ ఇన్విటేషన్ ఎలెవన్ జట్టుతో తలపడుతుంది. స్కోరు వివరాలు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 219 భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ రిటైర్డ్ అవుట్ 51; ధావన్ (సి) టర్నర్ (బి) లాలర్ 10; పుజారా రిటైర్డ్ అవుట్ 55; కోహ్లి (సి) గ్రిమ్‌వేడ్ (బి) షార్ట్ 60; రహానే (సి) కార్టర్స్ (బి) గ్రిమ్‌వేడ్ 1; రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) లాలర్ 23; రైనా (సి) కార్టర్స్ (బి) ప్యాటిసన్ 44; సాహా నాటౌట్ 56; అశ్విన్ (సి) అండ్ (బి) షార్ట్ 6; కరణ్ నాటౌట్ 52; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (91 ఓవర్లలో 8 వికెట్లకు) 363. వికెట్ల పతనం: 1-21; 2-106; 3-120; 4-131; 5-178; 6-233; 7-267; 8-285 బౌలింగ్: లాలర్ 20-2-55-2; మూడీ 17-2-74-0; గ్రెగరీ 6-1-26-0; కాన్వే 10-1-37-0; గ్రిమ్‌వేడ్ 17-3-61-1; ప్యాటిసన్ 7-0-24-1; షార్ట్ 10-1-60-2; టర్నర్ 4-1-24-0. -
‘సెలక్షన్' గందరగోళం
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు ఎంపిక వాయిదా ముంబై: ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడే భారత జట్టు ఎంపిక వాయిదా పడింది. జట్టు ఎంపిక కోసం సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం మధ్యాహ్నం సమావేశమైంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ... పాటిల్ సమావేశం ముగియకుండానే అరగంట ముందే బయటకు వచ్చేశారు. అలాగే ఈ సమావేశంలో చర్చించే ఎజెండా గురించి ఇద్దరు సెలక్టర్లు భిన్నంగా చెప్పారు. లంకతో చివరి రెండు వన్డేలకు జట్టు ఎంపిక కోసం సమావేశమవుతున్నామని ఒక సెలక్టర్ చెబితే... ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపిక కోసమని మరో సెలక్టర్ చెప్పారు. జట్టు ఎంపిక వాయిదా పడిందని తెలుపుతూ... నిర్దిష్ట కారణం చెప్పకుండా బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరిగి సెలక్టర్లు ఎప్పుడు సమావేశమయ్యేదీ చెప్పలేదు. దీంతో ఈ వ్యవహారం గందరగోళంగా మారింది. జట్టు ఎంపికకు తొందర లేదు: సంజయ్ పటేల్ శ్రీలంకతో జరిగే మూడు వన్డేల అనంతరమే చివరి రెండు వన్డేలకు జట్టును ఎంపిక చేస్తామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వివరణ ఇచ్చారు. కారణాలు ఏమిటి? బోర్డు నుంచి నిర్ధిష్టంగా కారణాలు బయటకు రాకపోయినా... మీడియాలో మాత్రం రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా రెండు వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనకు మూడో ఓపెనర్‌గా కర్ణాటక యువ ఆటగాడు లోకేశ్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలని కొందరు సెలక్టర్లు భావిస్తే... మరికొందరు మాత్రం సెహ్వాగ్‌ను తీసుకుందామని ప్రతిపాదించారు. దీంతో వాడివేడిగా చర్చ సాగి సమావేశం వాయిదా పడినట్లు వినిపిస్తోంది. మరోవైపు సుప్రీం కోర్టులో ఈ నెల 10న స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణ ఉన్నందున... అది పూర్తయ్యేవరకూ ఆగటం మేలని సెలక్టర్లు భావించినట్లూ కథనాలు వస్తున్నాయి. ముద్గల్ కమిటీ నివేదికలో ఎవరైనా ఆటగాళ్ల పేర్లుంటాయనే భయం కూడా సెలక్టర్లలో ఉన్నట్లు వినిపిస్తోంది. -
ఇదైనా జరుగుతుందా?
క్రికెట్ జరిగితే సహజంగానే వివాదాలు వెనక్కుపోతాయి. ఆట లేకపోతే ఏదో ఒక అంశం గురించి చర్చ సాగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భారత జట్టు తక్షణమే ఓ మ్యాచ్ ఆడాలి. లేదంటే ధోని వ్యాఖ్యల వివాదంపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. తొలి వన్డేకి అడ్డుపడ్డ వరుణుడు... రెండో వన్డేలోనూ ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మ్యాచ్ పూర్తిగా జరగకపోవచ్చు. కార్డిఫ్‌లోనూ వాన గండం గెలుపు కోసం భారత్ ఎదురుచూపు నేడు ఇంగ్లండ్‌తో రెండో వన్డే కార్డిఫ్: ఇంగ్లండ్‌తో రెండో వన్డేకు ముందు మంగళ వారం భారత జట్టు మొత్తం తీవ్రంగా సాధన చేసింది. రవిశాస్త్రి, ఫ్లెచర్ సంయుక్త పర్యవేక్షణలో ఆటగాళ్లంతా చురుగ్గా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. టెస్టులను మరచి ఎలాగైనా వన్డే సిరీస్ దక్కించుకోవాలనే పట్టుదల వారిలో కనిపించింది. తొలి వన్డేలో వరుణుడి కారణంగా ఎవరి సత్తా ఏమిటో బయటపడలేదు. దాంతో ఇప్పుడు మరో పోరాటం కోసం ఆటగాళ్లు సన్నద్ధమయ్యారు. నేడు (బుధవారం) ఇక్కడి సోఫియా గార్డెన్స్‌లో జరిగే రెండో వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ప్రయోగాలు ఉండకపోవచ్చు రాబోయే ప్రపంచ కప్‌కు ముందు కొన్ని మ్యాచ్‌లు గెలిస్తే జట్టు కూర్పుపై స్పష్టత వస్తుందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సూచించారు. అయితే కనీసం ఇంగ్లండ్‌తో బుధవారం మ్యాచ్‌లో మాత్రం ఇప్పటికే స్థిరంగా ఉన్న లైనప్‌నే కొనసాగించవచ్చు. ఓపెనర్లుగా రోహిత్, ధావన్‌లు ఆ తర్వాత కోహ్లి, రహానే, రైనాలు టాప్-5లో ఆడతారు. ధోని ఆరో స్థానంలో, ఆ తర్వాత ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు పేసర్లతోనే జట్టు ఉంటుంది. ప్రాక్టీస్ సెషన్లో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్, బౌలింగ్ చేసి కరణ్ శర్మ ఆకట్టుకున్నా... ఇప్పటికిప్పుడు అతనికి మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవచ్చు. రాయుడుకి కూడా అవకాశం రావడం కష్టమే. అదే విధంగా ధోని అనూహ్య రీతిలో తప్పుకుంటే తప్ప సంజు శామ్సన్ కూడా ఇంగ్లండ్ టూర్‌కు పర్యాటకుడిగానే మిగిలిపోతాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు విఫలమైతే సిరీస్ తదుపరి దశలో కొత్త ఆటగాళ్లకు చోటు ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇంగ్లండ్ ఏం చేయనుంది? ‘కుక్, బెల్, బ్యాలెన్స్లాంటి ఆటగాళ్లు వన్డేలకు పనికి రారు. వీరితో మా జట్టు ప్రపంచ కప్ గెలవలేదు. కుక్ అయితే వన్డే కెప్టెన్ కూడా కాదు’... భారత్‌తో కీలకమైన వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు వాన్, స్వాన్ ఇలా తమ సొంత జట్టును విమర్శించడం ఒక్కసారిగా ఆ జట్టును ఇబ్బందుల్లో పడేసింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం టీమ్‌లో ఉన్నారు. అయితే లార్డ్స్ పరాజయం తర్వాత ఇలా విమర్శించిన అందరికీ సమాధానం చెప్పిన తరహాలోనే వన్డేల్లోనూ నెగ్గి చూపించాలని కుక్ పట్టుదలగా ఉన్నాడు. అందు కోసం అతను తన జట్టులోని వన్డే స్పెషలిస్ట్లపై ఆధార పడ్డాడు. హేల్స్, మోర్గాన్, బట్లర్, గర్నీలాంటి ఆటగాళ్లకు ఇంగ్లండ్‌ను గెలిపించగల సామర్థ్యం ఉంది. జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రహానే, రైనా, జడేజా/బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఉమేశ్. ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), హేల్స్, బెల్, మోర్గాన్, రూట్, బట్లర్, స్టోక్స్, అండర్సన్, జోర్డాన్, గర్నీ, ట్రెడ్‌వెల్. పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ వికెట్. గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఈ మైదానంలో ఆడిన రెండు వన్డేల్లోనూ భారత్ విజయం సాధించింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం బుధవారం కార్డిఫ్‌లో ఉదయం, మధ్యాహ్నం తర్వాత వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా కాకపోయినా, మ్యాచ్‌కు ఏదో ఒక దశలో అంతరాయం కలగవచ్చు. -
గౌరవంగా తప్పుకోండి
ధోని, ఫ్లెచర్ లపై మాజీల ధ్వజం ముంబై: ఇంగ్లండ్‌లో భారత జట్టు చెత్త ప్రదర్శనను సగటు అభిమానితో పాటు మాజీ క్రికెటర్లు, సారథులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్ ధోని చెత్త సారథ్యం, కోచ్ ఫ్లెచర్ చేతకానితనంతో పాటు జట్టు సహాయక సిబ్బంది పూర్తిగా నామమాత్రంగా మారారనే విమర్శలు వచ్చాయి. బోర్డు చొరవ తీసుకుని వీళ్లందరినీ తప్పించేకంటే ముందే... వీళ్లే గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని పలువురు వెలిబుచ్చారు. ‘తుది జట్టు ఎంపిక, మైదానంలో వ్యూహాలు, ఫీల్డర్ల మోహరింపు... ఇలా ధోని అన్ని చోట్లా తప్పులు చేశాడు. ఇక ఫ్లెచర్ గురించి మాట్లాడకపోవడమే ఉత్తమం. కోచ్‌తో పాటు సహాయక సిబ్బంది కూడా వెంటనే తప్పుకుంటే గౌరవంగా ఉంటుంది’ -వెంగ్‌సర్కార్. ‘భారత ఆటగాళ్లలో కొందరికి ఏమాత్రం కష్టపడే తత్వం లేదు. అసలు తమ లోపాలను సరిదిద్దుకునేందుకు నెట్స్‌లో కాస్త ఎక్కువ సమయం గడపాలనే ఆలోచన కూడా వారికి ఉండదు. ప్రత్యర్థి జట్టు పట్టిష్టమైన దైనా మన ఆటగాళ్లు కనీసం పోరాడాలి కదా. టెస్టుఆడే దమ్ములేని వారు తప్పుకోవడమే ఉత్తమం’ - సునీల్ గవాస్కర్ ‘లార్డ్స్‌లో విజయం తర్వాత ఫ్లెచర్ చేసిందేమిటి. ఆధిక్యం కొనసాగించాలంటే ఏం చేయాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు. కచ్చితంగా ఫ్లెచర్‌ను తప్పించాల్సిందే. ఇక ధోని బ్యాట్స్‌మన్‌గా ఫర్వాలేదనిపించినా... కెప్టెన్‌గా ఘోరంగా విఫలమయ్యాడు’ - అజిత్ వాడేకర్ ‘ధోని తన ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఏదో అద్భుతం జరుగుతుందని వేచి చూశాడు. కానీ మైదానంలో ప్రతిసారీ అద్భుతాలు జరగవని తెలుసుకోవాలి. టెస్టు కెప్టెన్‌గా ధోని సమయం ముగిసిందనే అనుకుంటున్నాను’ - గుండప్ప విశ్వనాథ్ ‘ఇప్పటివరకూ ఫ్లెచర్ భారత జట్టుకు చేసిన మేలు ఏమీ లేదు. ఇంకా తనని కొనసాగించడం వల్ల సమయం వృథానే. బోర్డు తప్పిస్తుందో... లేక అతనే గౌరవంగా రాజీనామా చేస్తారో చూడాలి’ - శ్రీకాంత్ ‘బీసీసీఐ అధికారిగానే కాకుండా లక్షలాది అభిమానుల్లో ఒకడిగా ఇంగ్లండ్ పర్యటనలో భారత ఆటతీరుకు బాధపడుతున్నాను. విజయాల దారి పట్టేందుకు కొంత ఆత్మపరిశీలన అవసరమని నా అభిప్రాయం. విదేశాల్లో బాగా రాణించిన మాజీ ఆటగాళ్లున్నారు. వారిలో ఒకరు కోచ్‌తో కలిసి పనిచేస్తే ఫలితం ఉండొచ్చు. తను కోచ్‌కు ఆటగాళ్లకు మధ్య వారధిలా పనిచేయగలడు’ - అనురాగ్ ఠాకూర్ (బీసీసీఐ సంయుక్త కార్యదర్శి) ...కారణాలు అనేకం ఇంగ్లండ్‌లో భారత్ ఓటమిని విశ్లేషించడం అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరడంలాంటిదే! ఒకటా... రెండా... ఓటమికి కారణాలు చెప్పడం అంతులేని కథ! మూడేళ్ల క్రితం 0-4తో ఓడినప్పుడు కూడా ఇంత ఘోరంగా ఆడలేదు. నాడు ఒక్కసారి మాత్రమే జట్టు 200 లోపు పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో ఆ చెడ్డ ఘనత ఐదు సార్లు సాధించింది. ఈ సారి మన యువ తరంగాల నుంచి అద్భుతాలు ఆశించకపోయినా...పోరాటతత్వం ప్రదర్శిస్తారని, భారత టెస్టు భవిష్యత్తుకు దిక్సూచీ అవుతారని అనుకున్నాం. మరో వైపు ఇంగ్లండ్ బలహీనంగా కనిపించింది. కానీ భారత ఆటగాళ్లంతా సమష్టి వైఫల్యంతో అభిమానుల ఆశను వమ్ము చేశారు. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు...ఈ ఘోర వైఫల్యానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మచ్చుకు తొమ్మిది కారణాలను పరిశీలిస్తే... - సాక్షి క్రీడావిభాగం 1 కుక్ క్యాచ్ వదిలేసిన జడేజా: సరిగ్గా చెప్పాలంటే సిరీస్‌కు ఇదే టర్నింగ్ పాయింట్‌గా చెప్పవచ్చు. చాలా కాలంగా ఫామ్‌లో లేకుండా ఇబ్బంది పడుతూ, తప్పుకోవాలంటూ విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ కెప్టెన్ కుక్కు మూడో టెస్టులో 15 పరుగుల వద్ద స్లిప్స్‌లో జడేజా ప్రాణదానం చేశాడు. ఫలితంగా ఈ ఇన్నింగ్స్‌లో చేసిన 95 పరుగులతో ఆత్మవిశ్వాసం పెరిగిన కుక్, సిరీస్ ఆసాంతం దానిని కొనసాగించాడు. 2 జడేజా-అండర్సన్ గొడవ: తిట్టాడా...తోసేశాడా తర్వాతి సంగతి! అండర్సన్‌దే తప్పు అని కచ్చితంగా నిర్ధారించుకున్న ధోని సేన జడేజాకు మద్దతు పలికే క్రమంలో ఈ ఘటనపై తీవ్రంగా దృష్టి పెట్టింది. ఆటను వదిలి అనవసరపు అంశంపై ఎక్కువగా రాద్ధాంతం చేసింది. ఫలితంగా జట్టుపై దీని ప్రభావం కనిపించగా, చివరకు తీర్పు కూడా వ్యతిరేకంగా వచ్చింది. ధోని ఏం మాట్లాడినా అందులో 75 శాతం ఈ వివాదం గురించే చెప్పాడు. ఈ కేసుపై పెట్టిన శ్రద్ధ క్రికెట్‌పై పెడితే మూడో టెస్టు ఓడకపోయేవారని విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చింది. 3 రెండో ఓపెనర్: ఆరంభం సరిగ్గా లేకుండా టెస్టుల్లో ఏ జట్టూ మ్యాచ్ గెలవటం అంత సులువు కాదు. అయితే భారత్‌కు ఓపెనింగ్ భాగస్వామ్యం పెద్ద సమస్యగా మారింది. విజయ్ ఫర్వాలేదనిపించినా...ధావన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత గంభీర్‌కు రెండు మ్యాచుల్లో అవకాశాలు ఇచ్చినా ఉపయోగపడింది లేదు. 4 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఎక్కడ?: టెస్టుకు ముందు వార్మప్ గేమ్‌లు ఆడినంత మాత్రాన టెస్టులకు ఆ ప్రాక్టీస్ సరిపోదు. ఐదు రోజుల మ్యాచ్ ఆడాలంటే శారీరకంగా, మానసికంగా కూడా ఆటగాళ్లకు సన్నద్ధత అవసరం. మన ఆటగాళ్లు దేశవాళీలోనూ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడేది చాలా తక్కువ. నిర్ణీత సమయపు బ్యాటింగ్ లేదా బౌలింగ్‌కే పరిమితమయ్యే అలవాటు ఎప్పటినుంచో ఉంది. అందుకే విజయ్, భువనేశ్వర్, రహానే లాంటి ఆటగాళ్లకు ఐదు టెస్టులు భారంగా అనిపించాయి. ఆరంభంలో జోష్‌లో కనిపించిన వీరు ఆ తర్వాత సత్తువ కోల్పోయారు. 5 మిడిలార్డర్ మిథ్య: అసలు భారత టెస్టు జట్టుకు మిడిలార్డర్ ఉందా అనిపించే విధంగా మన ప్రదర్శన సాగింది. సుదీర్ఘ ఫార్మాట్లో సూపర్ అనుకున్న పుజారా, ఇక మరో సచిన్‌గా భావించిన కోహ్లిల ఘోర వైఫల్యంతో జట్టు ఇన్నింగ్స్‌కు వెన్నెముక లేకుండా పోయింది. లార్డ్స్ టెస్టు మినహా రహానే కనీసం పోరాటం కూడా చేయలేకపోయాడు. 6 స్లిప్ ఫీల్డింగ్: భారత వైఫల్యంలో స్లిప్ ఫీల్డర్లు కూడా పెద్ద పాత్రే పోషించారు! పట్టిన క్యాచ్లకంటే వదిలి పెట్టినవే ఎక్కువగా ఉన్నాయి. వారు వీరనే తేడా లేకుండా అంతా అక్కడ విఫలమయ్యారు. విజయ్, రహానే, కోహ్లి, ధావన్, అశ్విన్, జడేజా...ఎవరిని నిలబెట్టినా అంతా క్యాచ్‌లు వదిలారు. 7 స్పష్టత లేని బాధ్యత: ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లా...ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లా...ఇద్దరు స్పిన్నర్లా...ఇలాంటి సంశయం జట్టు మేనేజ్మెంట్లో సిరీస్ మొత్తం కొనసాగింది. ముఖ్యంగా జడేజా, అశ్విన్‌లను సమర్థంగా ఉపయోగించుకోవడంలో అంతా గందరగోళంగా కనిపించింది. అన్నింటికి మించి జట్టులో స్టువర్ట్ బిన్నీ ఎందుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. 8 క్రమశిక్షణ లేని బౌలింగ్: సిరీస్‌లో చివరి మూడు టెస్టుల్లో భారత్‌కు పట్టు దొరికే అవకాశం లభించినా మన బౌలర్లు కనీస స్థాయిలో కూడా రాణించలేకపోయారు. ఫలితంగా ఇంగ్లండ్‌ను రూట్లాంటి ఆటగాళ్లు పట్టుదలతో ఆడి గట్టెక్కించారు. భువనేశ్వర్ ఆరంభంలో చూపిన జోరు ఆ తర్వాత తగ్గింది. పంకజ్ సింగ్, షమీ, జడేజా విఫలం కాగా... ఇషాంత్ ప్రభావం చూపలేకపోయాడు. 9 ధోని తలపై బరువు: సమకాలీన క్రికెట్లో కెప్టెన్‌గా, వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ బ్యాటింగ్‌లో రాణించిన ఆటగాళ్లు చాలా తక్కువ మంది. కానీ ధోని చాలా వరకు తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. టెస్టు క్రికెట్‌కు కావాల్సిన టెక్నిక్ లేదనే విమర్శ ఉన్నా ఈ సిరీస్‌లో నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. అయితే అతనిపై భారం ఎక్కువైనట్లు కనిపించింది. ఎందుకంటే సాంప్రదాయ వ్యూహాలతో పాటు కొత్తగా, భిన్నంగా ప్రయత్నిస్తూ విజయవంతం అయిన ధోనికి ఏదీ కలిసి రాలేదు. దేవుళ్లూ రక్షించలేదు మనం కాస్త ప్రయత్నం చేస్తే భగవంతుడు కొంత అనుగ్రహం ప్రసాదిస్తాడేమో. కానీ భారత క్రికెట్ జట్టు ఆటను చూశాక దేవుడు కూడా సాయం చేయడు. ఓవల్ టెస్టుకు ముందు భారత జట్టు మసాజర్ రమేశ్ మానే... డ్రెస్సింగ్ రూమ్‌లో దేవుళ్ల ఫొటోలు పెట్టాడు. అలాగే గోడకు హనుమాన్ చాలీసాతో పాటు... భగవంతుడి గురించి మాటలు ఉన్న బోర్డులు తగిలించాడు. భారత క్రికెట్లో ఇలాంటి ప్రయత్నం గతంలో ఎప్పుడూ జరగలేదు. కానీ ఏం చేస్తాం..? ఇలాంటి ఆట ఆడితే భగవంతుడు మాత్రం ఎలా కరుణిస్తాడు..? భారత జట్టుకు జరిమానా అసలే ఘోర ఓటమితో తీవ్ర అవమానభారంతో ఉన్న భారత క్రికెట్ జట్టుకు ఆర్థికంగా కూడా దెబ్బతగిలింది. ఓవల్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ధోని మ్యాచ్ ఫీజులో 60 శాతం, మిగిలిన భారత క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 30 శాతం ఐసీసీ జరిమానా విధించింది. మరోసారి ధోని గనక రానున్న ఏడాది కాలంలో టెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే... అతడిపై ఒక మ్యాచ్ నిషేధం పడే ప్రమాదం కూడా ఉంది. ఐదో ర్యాంక్‌కు... దుబాయ్: ఓవల్ టెస్టులో ఘోర పరాజయంతో భారత్ ఐసీసీ ర్యాంకుల్లో నాలుగు నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లండ్ ఈ జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది. పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన శ్రీలంక 4వ స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా టాప్ ర్యాంక్‌లో ఉంది. వాన్ ఓవర్ యాక్షన్! లండన్: భారత జట్టు ఘోర పరాజయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఓవర్ యాక్షన్ చేశాడు. భారత్ కొత్త జెండా అంటూ ‘తెల్లజెండా’ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా భారత అభిమానులనూ రెచ్చగొట్టాడు. ‘మీ జట్టు బాగా ఆడలేదు. వాళ్లకు ఇంగ్లండ్‌లో గెలిచే సీన్ లేదని అంగీకరించండి’ అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. అయితే తన విమర్శలు ఎలా ఉన్నా... సిరీస్ ఆరంభానికి ముందే ఇంగ్లండ్ 3-1తో గెలుస్తుందని వాన్ జోస్యం చెప్పాడు. అటు ఇంగ్లండ్ మీడియా కూడా ధోనిసేన ఆటతీరుపై దుమ్మెత్తిపోసింది.