భారత్ ప్రదర్శన అద్భుతం: దాల్మియా
న్యూఢిల్లీ: సెమీస్‌లో ఓటమిని పక్కనబెడితే... ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన అత్యద్భుతంగా ఉందని బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా ప్రశంసించారు. ఏడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో ఊహించని స్థాయిలో రాణించిందన్నారు. ‘వరల్డ్‌కప్‌లో మన జట్టు ప్రదర్శన చాలా బాగుంది. జట్టు మొత్తానికి నా అభినందనలు.
మ్యాచ్‌ల సందర్భంగా ఆటగాళ్లందరూ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు నిజమైన స్ఫూర్తితో ఆట ఆడారు. రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. భారత క్రికెట్‌ను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారు’ అని దాల్మియా పేర్కొన్నారు. మరోవైపు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశారు.