వన్డే ప్రపంచకప్‌కు మరో 100 రోజుల సమయం ఉంది. భారత్‌లో జరిగే ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బీసీసీఐ సంయుక్తంగా కొత్త తరహాలో ప్రచారాన్ని మొదలు పెట్టాయి. వరల్డ్ కప్ ట్రోఫీని ఏకంగా అంతరిక్షంలోకి పంపించి టోరీ్నపై ఆసక్తిని మరింతగా పెంచే ప్రయత్నం చేశాయి. బిస్పోక్ బెలూన్‌తో జత చేసిన ట్రోఫీ భూమి నుంచి 1 లక్షా 20 వేల అడుగుల ఎత్తులో ఉన్న ‘స్ట్రాటోస్ఫియర్’ను చేరింది.
అక్కడ ఉన్న ట్రోఫీని 4కె కెమెరాతో కొన్ని షాట్స్ తీశారు. అనంతరం ట్రోఫీ నేలకు దిగి నేరుగా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి చేరింది. నేటినుంచి జరిగే వరల్డ్ టూర్‌లో భాగంగా ట్రోఫీ 18 దేశాలకు ప్రయాణిస్తుంది. ఇందులో ప్రపంచ కప్‌లో భాగం కాని కువైట్, బహ్రెయిన్, మలేసియా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలు కూడా ఉన్నాయి. నేడు ముంబైలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment