పాక్... మళ్లీ కాచుకో
ఆసియా చాంపియన్ ట్రోఫీ హాకీ ఫైనల్
భారత్ పాకిస్తాన్‌తో నేడు తుదిపోరు
క్వాంటన్ (మలేసియా): ఆసియా చాంపియన్‌స ట్రోఫీ హాకీ లీగ్ దశలో పాక్‌ను చిత్తు చేసిన భారత జట్టుకు దాయాదిని మరోసారి దుమ్ముదులిపే అవకాశం లభించింది. నేడు జరిగే ఫైనల్లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నారుు. శనివారం జరిగిన తొలి సెమీస్‌లో భారత్ షూటౌట్‌లో 5-4తో దక్షిణ కొరియాపై విజయం సాధించగా... రెండో సెమీస్‌లో పాకిస్తాన్ షూటౌట్‌లోనే మలేసియాను 3-2తో ఓడించింది.
కొరియా, భారత్‌ల సెమీస్ పోరులో నిర్ణీత సమయానికి ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచారుు. ఆట 15వ నిమిషంలో తల్విందర్ సింగ్ గోల్‌తో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే 21వ నిమిషంలో కొరియా ఆటగాడు సియో ఇన్ వూ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. 53వ నిమిషంలో జిహున్ యాంగ్ గోల్‌తో కొరియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే 55వ నిమిషంలో సర్దార్ సింగ్ అందించిన పాస్‌ను రమణ్‌దీప్ సింగ్ గోల్‌గా మలచడంతో భారత్ 2-2తో స్కోరును సమం చేసింది. దీంతో ఫలితం కోసం కోసం షూటౌట్‌ను ఆశ్రరుుంచారు. షూటౌట్‌లో కొరియా ప్లేయర్ లీ డా యోల్ ఐదో షాట్‌ను భారత కెప్టెన్, గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ అడ్డుకొని భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. షూటౌట్‌లో భారత్ తరఫున సర్దార్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, బిమల్ లాక్రా (రూపిందర్ పాల్ సింగ్) సఫలమయ్యారు. చివరిదైన ఐదో షాట్‌ను బిమల్ లాక్రా తీసుకోగా కొరియా గోల్‌కీపర్ ఫౌల్ చేయడంతో రిఫరీ భారత్‌కు పెనాల్టీ ో్టక్ ్రఇచ్చాడు. ో్టక్‌న్రు రూపిందర్ గోల్‌గా మలిచాడు. కొరియా తరఫున మన్‌జే జంగ్, కిమ్ హయోంగ్‌జిన్, లీ జుంగ్‌జిన్, బే జోంగ్‌సుక్ సఫలంకాగా... చివరిదైన ఐదో షాట్‌లో లీ డా యోల్ విఫలమయ్యాడు. ఈ టోర్నీ చరిత్రలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి.
ఫైనల్ సాయంత్రం గం. 6.00 నుంచి స్టార్ స్పోర్‌ట్స-4లో ప్రత్యక్ష ప్రసారం