చెన్నై: గత ఏడేళ్లుగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు చేతిలో ఓటమి ఎరుగని భారత హాకీ జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం పాకిస్తాన్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది.
భారత్ తరఫున కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (15వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జుగ్‌రాజ్ (36వ ని.లో), ఆకాశ్‌దీప్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్‌లు రాగా ఇందులో మూడింటిని గోల్స్‌గా మలి చింది. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ 2–1తో చైనాపై, మలేసియా 1–0తో కొరియాపై నెగ్గాయి.
పాక్‌పై విజయంతో ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక భారత్ 13 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 12 పాయింట్లతో మలేసియా రెండో స్థానంలో, 5 పాయింట్లతో దక్షిణ కొరియా, జపాన్, పాకిస్తాన్ సంయుక్తంగా మూడో స్థానంలో, ఒక పాయింట్‌తో చైనా చివరి స్థానంలో నిలిచాయి.
కొరియా, జపాన్, పాక్ ఐదు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరంతో కొరియా, జపాన్ జట్లకు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. దాంతో మాజీ చాంపియన్ పాకిస్తాన్ సెమీఫైనల్ చేరలేకపోయింది. శుక్రవారం 5–6 స్థానాల కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో చైనాతో పాకిస్తాన్...సెమీఫైనల్స్ లో కొరియాతో మలేసియా; జపాన్‌తో భారత్ ఆడతాయి.
Comments
Please login to add a commentAdd a comment