భువనేశ్వర్‌కు పిలుపు గంభీర్‌పై వేటు | Gambhir, suspended on the call to Bhubaneshwar | Sakshi
Sakshi News home page

భువనేశ్వర్‌కు పిలుపు గంభీర్‌పై వేటు

Published Tue, Nov 22 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

భువనేశ్వర్‌కు పిలుపు గంభీర్‌పై వేటు

భువనేశ్వర్‌కు పిలుపు గంభీర్‌పై వేటు

ఇంగ్లండ్‌తో జరిగే తర్వాతి మూడు టెస్టుల కోసం భారత జట్టును ప్రకటించారు. గాయంనుంచి పూర్తిగా కోలుకున్న పేసర్ భువనేశ్వర్ కుమార్ జట్టులోకి తిరిగి వచ్చాడు. కివీస్‌తో జరిగిన రెండో టెస్టు తర్వాత అతను జట్టుకు దూరమయ్యాడు. వైజాగ్ టెస్టు తుది జట్టులో స్థానం లభించని సీనియర్ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను సెలక్టర్లు పూర్తిగా తప్పించారు.

16 మంది సభ్యుల జట్టులో అతనికి స్థానం లభించలేదు. ఈ మార్పులు మినహా ఇతర ఆటగాళ్లంతా సిరీస్ కోసం కొనసాగనున్నారు. తాజా పరిణామంతో గంభీర్ కెరీర్ ముగిసినట్లుగా భావిస్తున్నారు. భారత్ తరఫున గంభీర్ 58 టెస్టుల్లో 4154 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement