న్యూఢిల్లీ: ఎప్పుడూ ఏదొక కామెంట్‌తో వార్తల్లో ఉండే భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్..ఈసారి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను ప్రత్యేకంగా పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో స్టోక్స్ తరహా ఆల్‌రౌండర్ ఏ దేశంలో కూడా లేడని గంభీర్ కొనియాడాడు. ఒక ప్రత్యేక ఆట అనేది స్టోక్స్ సొంతమంటూ ప్రశంసించాడు. ‘ఇప్పటివరకూ స్టోక్స్ ఆటను చూశాం. టెస్టు క్రికెట్‌లో ఏం చేశాడో తెలుసు.. అలానే వన్డే, టీ20 క్రికెట్‌లో స్టోక్స్ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ జట్టుకు స్టోక్స్ కచ్చితంగా ప్రధాన ఆటగాడు. ప్రస్తుత సమకాలీన క్రికెట్‌లో స్టోక్స్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఆ తరహా ఆల్‌రౌండర్ భారత్‌లో కూడా లేడు. స్టోక్స్ లాంటి ఆటగాడు ప్రతీ జట్టుకు అవసరం. ప్రతీ కెప్టెన్‌కు స్టోక్స్ లాంటి క్రికెటర్ జట్టులో ఉండాలనేది డ్రీమ్‌గా ఉంటుంది. (గంగూలీ తగిన వ్యక్తి )
అంతటి విలువైన ఆటగాడు స్టోక్స్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏ విభాగంలోనైనా స్టోక్స్‌కు సాటిరారు. అతని కెప్టెన్సీ చేసేటప్పుడు స్టోక్స్ ఒక లీడర్‌లా ఉంటాడు. ఒకవేళ కెప్టెన్ అనేవాడు లీడర్‌లా లేకపోతే అతన్ని కెప్టెన్ అని పిలవాల్సిన అవసరం లేదు. స్టోక్స్ కచ్చితంగా ఒక లీడర్. నేను చూసినంత వరకూ అతని కెప్టెన్సీలో ఒక స్పెషల్ ఉంది. చాలా మంది క్రికెటర్లకు స్టోక్స్ మాదిరిగా ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ దురదృష్టం ఏమిటంటే ప్రస్తుత సమయంలో అతనికి చేరువగా ఎవరూ లేకపోవడం’ అని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించే క్రికెట్ కనెక్టడ్ షోలో గంభీర్ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో స్టోక్స్ అదరగొడుతున్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్‌లో 176 పరుగులతో ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్.. తొలి రెండు టెస్ట్‌ల్లో 313 పరుగులు చేయడంతోపాటు 9 వికెట్లు కూడా పడగొట్టాడు. దాంతో ఇంగ్లండ్ రెండో టెస్టును గెలవడంతో సిరీస్‌ను 1-1తో సమం చేసి ఆశలు సజీవంగా నిలుపుకుంది. ఇప్పుడు మూడో టెస్టులో గెలుపు దిశగా పయనిస్తున్న ఇంగ్లండ్ ఇక సిరీస్‌ను సాధించడం ఖాయంగా కనబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment