భువనేశ్వర్‌కు పిలుపు.. గంభీర్‌పై వేటు
ముంబై: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి మూడు మ్యాచ్‌లకు భారత జట్టును ప్రకటించారు. పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోగా, ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను తొలగించారు. ఈ మార్పు మినహా తొలి రెండు టెస్టుల్లో ఆడిన జట్టునే కొనసాగించారు. మంగళవారం భారత సెలక్షన్ కమిటీ సమావేశమై విరాట్ కోహ్లీ సారథ‍్యంలో 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో రాణించలేకపోయిన గంభీర్ స్థానంలో రెండో టెస్టుకు కేఎల్ రాహుల్ తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి మొహాలీలో మూడో టెస్టు జరగనుంది.
జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానె, కేఎల్ రాహుల్, మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, వృద్ధిమాన్ సాహా (కీపర్), అశ్విన్, జడేజా, జయంత్, అమిత్ మిశ్రా, మహ్మద్ షమీ, ఉమేష్, ఇషాంత్, భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా