ఫైనల్లో భారత్
శ్రీలంకపై విజయం ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ
బ్యాంకాక్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో వరుస విజయాలతో అదరగొడుతున్న భారత జట్టు ఫైనల్‌కు చేరింది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌వుమన్ మిథాలీ రాజ్ (59 బంతుల్లో 62; 6 ఫోర్లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడు బౌలర్లు ఏక్తా బిస్త్ (3/8),ప్రీతి బోస్ (3/14) చెలరేగడంతో భారత్ 52 పరుగుల తేడాతో గెలిచింది. నేడు (శుక్రవారం) జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు నేపాల్‌తో తలపడుతుంది.
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 121 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు వేద కృష్ణమూర్తి (23 బంతుల్లో 21; 3 సిక్స్)తో కలిసి మిథాలీ 50 పరుగులు జోడించింది. మరో ఓపెనర్ స్మృతి మందన (28 బంతుల్లో 21; 1 ఫోర్) ఆకట్టుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 69 పరుగులు మాత్రమే చేయగలిగింది. సురంగిక (32 బంతుల్లో 20), వీరక్కోడి (14 బంతుల్లో 14; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. భారత బౌలర్ల ధాటికి నాలుగు పరుగుల వ్యవధిలో లంక తమ చివరి నాలుగు వికెట్లను కోల్పోరుుంది.