Raj mithali
-
ఎదురులేని భారత్
కొలంబో: ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జింబాబ్వేతో సోమవారం జరిగిన చివరిదైన నాలుగో మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బృందం తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ (5/19) ధాటికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 28.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత జట్టు 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 61 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. వేద కృష్ణమూర్తి (16 బంతుల్లో 29; 6 ఫోర్లు) అవుటవ్వగా... మోనా (21 నాటౌట్; 4 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (11 నాటౌట్) అజేయంగా నిలిచారు. ‘సూపర్ సిక్స్’ దశ మ్యాచ్‌ల్లో భారత జట్టు ఈనెల 15న దక్షిణాఫ్రికాతో; 17న బంగ్లాదేశ్‌తో; 19న పాకిస్తాన్‌తో తలపడుతుంది. -
కెప్టెన్‌గా మిథాలీ
మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీకి భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 14 మందితో కూడిన టీమిండియా జట్టుకు హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తుంది. ఫిబ్రవరి 7 నుంచి 21 వరకు కొలంబోలో ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఈ టోర్నీలో ఆడునున్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, థాయ్‌లాండ్... గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఇంగ్లండ్ వేదికగా ఈ ఏడాది జూన్ 26 నుంచి జులై 23 వరకు జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. 2014–2016 ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ సమయంలో తొలి నాలుగు ర్యాంక్‌ల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు ఇప్పటికే ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. భారత మహిళల క్రికెట్ జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన, తిరుష్ కామిని, వేద కృష్ణమూర్తి, దేవిక, సుష్మా వర్మ (వికెట్ కీపర్), జులన్ గోస్వామి, శిఖా పాండే, సుకన్య, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాజేశ్వరి, దీప్తి శర్మ. -
ఫైనల్లో భారత్
శ్రీలంకపై విజయం ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ బ్యాంకాక్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో వరుస విజయాలతో అదరగొడుతున్న భారత జట్టు ఫైనల్‌కు చేరింది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌వుమన్ మిథాలీ రాజ్ (59 బంతుల్లో 62; 6 ఫోర్లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడు బౌలర్లు ఏక్తా బిస్త్ (3/8),ప్రీతి బోస్ (3/14) చెలరేగడంతో భారత్ 52 పరుగుల తేడాతో గెలిచింది. నేడు (శుక్రవారం) జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు నేపాల్‌తో తలపడుతుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 121 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు వేద కృష్ణమూర్తి (23 బంతుల్లో 21; 3 సిక్స్)తో కలిసి మిథాలీ 50 పరుగులు జోడించింది. మరో ఓపెనర్ స్మృతి మందన (28 బంతుల్లో 21; 1 ఫోర్) ఆకట్టుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 69 పరుగులు మాత్రమే చేయగలిగింది. సురంగిక (32 బంతుల్లో 20), వీరక్కోడి (14 బంతుల్లో 14; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. భారత బౌలర్ల ధాటికి నాలుగు పరుగుల వ్యవధిలో లంక తమ చివరి నాలుగు వికెట్లను కోల్పోరుుంది. -
పాకిస్తాన్‌పై భారత్ విజయం
మహిళల ఆసియా కప్ టి20 బ్యాంకాక్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత జట్టు జైత్రయాత్ర సాగుతోంది. మంగళవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (రెండు వికెట్లు.... 22 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు) ఆల్‌రౌండ్ షో... ఓపెనర్ మిథాలీ రాజ్ (57 బంతుల్లో 36; 3 ఫోర్లు) బాధ్యతాయుత బ్యాటింగ్‌తో అదరగొట్టడంతో భారత్ ఐదు వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌కిది వరుసగా మూడో విజయం. అరుుతే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలి వరకు ఈ మ్యాచ్ జరగడంపై సస్పెన్స నెలకొంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 97 పరుగులు చేసింది. నైన్ అబిది (37), ఆయేషా (28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. నాలుగో ఓవర్ నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం నిలకడగా సాగింది. ఏక్తా బిస్త్‌కు మూడు, హర్మన్ ప్రీత్, అనూజలకు రెండేసి వికెట్లు దక్కారుు. అనంతరం స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ను పాక్ బౌలర్లు ఇబ్బంది పెట్టి మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లారు. అరుుతే మిడిలార్డర్ బ్యాట్స్‌వుమన్ హర్మన్‌ప్రీత్ తుదికంటా నిలిచి కీలక ఇన్నింగ్స ఆడటంతో 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 98 పరుగులు చేసి భారత్ గెలిచింది.