పాకిస్తాన్‌పై భారత్ విజయం
మహిళల ఆసియా కప్ టి20
బ్యాంకాక్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భారత జట్టు జైత్రయాత్ర సాగుతోంది. మంగళవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (రెండు వికెట్లు.... 22 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు) ఆల్‌రౌండ్ షో... ఓపెనర్ మిథాలీ రాజ్ (57 బంతుల్లో 36; 3 ఫోర్లు) బాధ్యతాయుత బ్యాటింగ్‌తో అదరగొట్టడంతో భారత్ ఐదు వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌కిది వరుసగా మూడో విజయం. అరుుతే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలి వరకు ఈ మ్యాచ్ జరగడంపై సస్పెన్‌స నెలకొంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 97 పరుగులు చేసింది.
నైన్ అబిది (37), ఆయేషా (28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. నాలుగో ఓవర్ నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం నిలకడగా సాగింది. ఏక్తా బిస్త్‌కు మూడు, హర్మన్ ప్రీత్, అనూజలకు రెండేసి వికెట్లు దక్కారుు. అనంతరం స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ను పాక్ బౌలర్లు ఇబ్బంది పెట్టి మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లారు. అరుుతే మిడిలార్డర్ బ్యాట్స్‌వుమన్ హర్మన్‌ప్రీత్ తుదికంటా నిలిచి కీలక ఇన్నింగ్‌స ఆడటంతో 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 98 పరుగులు చేసి భారత్ గెలిచింది.