కెప్టెన్‌గా మిథాలీ
మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీకి భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 14 మందితో కూడిన టీమిండియా జట్టుకు హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తుంది. ఫిబ్రవరి 7 నుంచి 21 వరకు కొలంబోలో ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఈ టోర్నీలో ఆడునున్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, థాయ్‌లాండ్... గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఇంగ్లండ్ వేదికగా ఈ ఏడాది జూన్ 26 నుంచి జులై 23 వరకు జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. 2014–2016 ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ సమయంలో తొలి నాలుగు ర్యాంక్‌ల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు ఇప్పటికే ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.
భారత మహిళల క్రికెట్ జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన, తిరుష్ కామిని, వేద కృష్ణమూర్తి, దేవిక, సుష్మా వర్మ (వికెట్ కీపర్), జులన్ గోస్వామి, శిఖా పాండే, సుకన్య, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాజేశ్వరి, దీప్తి శర్మ.