ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక (PC: Asian Cricket Council)
మహిళల ఆసియా కప్-2024 టోర్నీలో శ్రీలంక సత్తా చాటింది. రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టును ఢీకొట్టనుంది. డంబుల్లా వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక.. పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
నిదా రాణించినా
ఈ క్రమంలో ఓపెనర్లు గుల్ ఫెరోజా 25, మునీబా అలీ 37 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ అమీన్(10) పూర్తిగా నిరాశపరిచింది. కెప్టెన్ నిదా దర్ 17 బంతుల్లో 23 పరుగులతో రాణించగా.. అలియా రియాజ్(16), ఫాతిమా సనా(23) ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 140 పరుగులు చేసింది.
శ్రీలంక బౌలర్లలో ప్రభోదని, కవిషా దిల్హారీ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సైదా ఇక్బాల్ బౌలింగ్‌లో ఓపెనర్ విష్మీ గుణరత్నె డకౌట్‌గా వెనుదిరిగింది. వన్‌డౌన్ బ్యాటర్ హర్షిత విక్రమసింహ సైతం సైదా బౌలింగ్‌లో 12 పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ చమరి ఆటపట్టు మాత్రం హాఫ్ సెంచరీతో అదరగొట్టింది.
నలభై ఎనిమిది బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 63 పరుగులు చేసి.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించింది. మిగతావాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ అనుష్క సంజీవని 24 పరుగులతో రాణించింది. అయితే, ఆఖరి ఓవర్లో లంక విజయానికి 3 పరుగులు అవసరం కాగా.. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి.
తీవ్ర ఉత్కంఠ
ఈ క్రమంలో పాక్ కెప్టెన్ నిదా దర్ డాట్ బాల్‌తో ఆరంభించి.. రెండో బంతికే సుగందిక కుమారి(10)ని బౌల్డ్ చేసింది. మరుసటి బంతికి కూడా శ్రీలంక పరుగు రాబట్టలేకపోయింది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. నాలుగో బంతికి అచిని కులసూర్య సింగిల్ తీసింది. అనంతరం నిదా వైడ్ వేయగా.. ఇరు జట్ల స్కోరు సమమైంది. ఈ క్రమంలో ఐదో బంతికి సంజీవని సింగిల్ తీయడంతో పాక్ కథ సమాప్తమైంది.
ఫైనల్లో భారత్‌తో ఢీ
నిదా దర్ బృందంపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆతిథ్య శ్రీలంక ఆసియా టీ20 కప్-2024 ఫైనల్‌కు దూసుకువెళ్లింది. టైటిల్ కోసం ఆదివారం హర్మన్‌ప్రీత్ కౌర్ సేనతో ఆటపట్టు జట్టు తలపడనుంది. కాగా పాక్‌పై గెలుపు ఖరారు కాగానే లంక ఆటగాళ్ల సంబరం అంబరాన్నంటింది. మైదానంలోకి దూసుకువచ్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు. అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న చమరి ఆటపట్టు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది.
చదవండి: ఫైనల్లో టీమిండియా
𝗦𝗿𝗶 𝗟𝗮𝗻𝗸𝗮 𝗵𝗮𝘀 𝗱𝗼𝗻𝗲 𝗶𝘁 𝗮𝗴𝗮𝗶𝗻! 🇱🇰🔥#ChamariAthapaththu & co. have defeated Pakistan in consecutive #WomensAsiaCup semi-finals 💪
On to the finals, they go! 😍#SLvIND | SUN, JUL 28, 2:30 PM | #WomensAsiaCupOnStar (Only available in India) pic.twitter.com/epH8JJkQq2— Star Sports (@StarSportsIndia) July 26, 2024
Comments
Please login to add a commentAdd a comment