విండీస్‌ను గెలిపించిన స్టెఫానీ | Stephanie West indies win | Sakshi
Sakshi News home page

విండీస్‌ను గెలిపించిన స్టెఫానీ

Published Fri, Nov 18 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

విండీస్‌ను గెలిపించిన స్టెఫానీ

విండీస్‌ను గెలిపించిన స్టెఫానీ

తొలి టి20లో భారత్ ఓటమి

విజయవాడ స్పోర్‌‌ట్స: మహిళల టి20 ఫార్మాట్‌లో వరల్డ్ చాంపియన్ వెస్టిండీస్ జట్టు సత్తా చాటింది. వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోరుునప్పటికీ... టి20 ఫార్మాట్‌లో మాత్రం వెస్టిండీస్ దుమ్మురేపింది. భారత జట్టుతో శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 151 పరుగుల విజయలక్ష్యాన్ని వెస్టిండీస్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోరుు అధిగమించింది.

కెప్టెన్ స్టెఫానీ టేలర్ (51 బంతుల్లో 90, 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరవిహారం చేసి విండీస్ విజయంలో కీలకపాత్ర పోషించింది. హెలీ మాథ్యూస్ (18), బ్రిట్నీ కూపర్ (16), మెరిస్సా (15) స్టెఫానీకి సహకరించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. వేద కృష్ణమూర్తి (46 బంతుల్లో 50; 6 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (50 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement