కరాచీ: ఐసీసీ మహిళల చాంపియన్‌స లీగ్‌లో తమ జట్టుతో ఆడేందుకు నిరాకరించిన భారత జట్టుపై ఐసీసీ ఆరు పారుుంట్ల కోత విధించడం పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్టరుు్యంది. ఇప్పుడు ఇదే జోరులో బీసీసీఐపై న్యాయపోరుతో పాటు నష్టపరిహారాన్ని కోరేందుకు సిద్ధమవుతోంది.
‘2014లో ఇరు బోర్డుల మధ్య కుదిరిన ఎంవోయూ ప్రకారం 2015 నుంచి 2022 వరకు ఆరు సిరీస్‌లు జరగాలి. కానీ వారి ప్రభుత్వం అంగీకరించడం లేదని బీసీసీఐ ముందుకురావడం లేదు. అందుకే దీనికి సంబంధించిన సాక్ష్యాలను ఐసీసీ ముందుంచాలని కోరుతున్నాం. భారత్ మాతో ఆడకపోవడంతో పీసీబీ రెవిన్యూ దారుణంగా దెబ్బతింది. ఇందుకు నష్టపరిహారాన్ని కూడా కోరతాం’ పాక్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నారు.