ICC Womens Champion
-
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు
కింబేర్లీ : వరుసగా రెండో వన్డే మ్యాచ్‌లోనూ భారత మహిళా క్రికెటర్లు సత్తా చాటారు. ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించారు. బుధవారం జరిగిన రెండో వన్డేలో 178 పరుగుల భారీ తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. 303 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా టీమ్ 30.5 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా క్రీడాకారిణుల్లో ఓపెనర్ లిజెలే లీ(73) మినహా ఎవరు రాణించకపోవడంతో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఏడుగురు సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటయ్యారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టింది. గైక్వాడ్, శర్మ రెండేసి వికెట్లు తీశారు. జులాన్ గోస్వామికి ఒక వికెట్ దక్కింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 302 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన సెంచరీ(135) చేసింది. హర్మన్ ప్రీత్(55), వేదకృష్ణమూర్తి(51) అర్ధసెంచరీలతో రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. -
మంధన సెంచరీ.. దక్షిణాఫ్రికాకు భారీలక్ష్యం
కింబేర్లీ : ఐసీసీ మహిళల చాంఫియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధన సెంచరీతో కదం తొక్కారు. తొలి వన్డేలో 88 పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ లేడీ సూపర్ స్టార్ తాజా మ్యాచ్‌లో సైతం చెలరేగారు. మంధన135(129 బంతులు, 14ఫోర్లు, 1సిక్సు)కు తోడు వైస్‌కెప్టెన్ హర్మన్ ప్రీత్(55), వేదకృష్ణమూర్తి(51) మెరుపులు మెరిపించడంతో మిథాలీసేన ఆతిథ్య జట్టుకు 303 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచిన ప్రొటీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ సేనకు ఓపెనర్లు మంచి శుభారంభాన్నే అందించారు. 56 పరుగుల వద్ద భారత్ పూనమ్ రౌత్(20) క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగారు.మరి కొద్దిసేపటికి మిథాలీ (20) రిటర్న్ క్యాచ్‌గా అవుటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్, మంధనలు ఆచితూచి ఆడుతూ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఈ తరుణంలో 116 బంతులు ఎదుర్కొన్న మంధన 9 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ వేగాన్ని పెంచిన ఈ లేడీ డాషింగ్ ఓపెనర్ జట్టుస్కోరు 241 పరుగుల వద్ద క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగారు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 134 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివర్లో హర్మన్ 55(69 బంతులు, 2ఫోర్లు,1 సిక్సు), వేదకృష్ణమూర్తి 51(33 బంతులు, 6 ఫోర్లు, 1 సిక్సు)లు మెరుపులు మెరిపించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లకు భారత మహిళలు మూడు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేశారు. ప్రొటీస్ మహిళా బౌలర్లలో కలాస్, లూస్, రైసిబ్లకు తలా ఓవికెట్ దక్కింది. -
బీసీసీఐపై న్యాయపోరు: పీసీబీ
కరాచీ: ఐసీసీ మహిళల చాంపియన్స లీగ్‌లో తమ జట్టుతో ఆడేందుకు నిరాకరించిన భారత జట్టుపై ఐసీసీ ఆరు పారుుంట్ల కోత విధించడం పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్టరుు్యంది. ఇప్పుడు ఇదే జోరులో బీసీసీఐపై న్యాయపోరుతో పాటు నష్టపరిహారాన్ని కోరేందుకు సిద్ధమవుతోంది. ‘2014లో ఇరు బోర్డుల మధ్య కుదిరిన ఎంవోయూ ప్రకారం 2015 నుంచి 2022 వరకు ఆరు సిరీస్‌లు జరగాలి. కానీ వారి ప్రభుత్వం అంగీకరించడం లేదని బీసీసీఐ ముందుకురావడం లేదు. అందుకే దీనికి సంబంధించిన సాక్ష్యాలను ఐసీసీ ముందుంచాలని కోరుతున్నాం. భారత్ మాతో ఆడకపోవడంతో పీసీబీ రెవిన్యూ దారుణంగా దెబ్బతింది. ఇందుకు నష్టపరిహారాన్ని కూడా కోరతాం’ పాక్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నారు.