
భారత్-దక్షిణాఫ్రికా రెండో వన్డే(బీసీసీఐ ట్విటర్ ఫొటో)
కింబేర్లీ : వరుసగా రెండో వన్డే మ్యాచ్‌లోనూ భారత మహిళా క్రికెటర్లు సత్తా చాటారు. ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించారు. బుధవారం జరిగిన రెండో వన్డేలో 178 పరుగుల భారీ తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. 303 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా టీమ్ 30.5 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది.
దక్షిణాఫ్రికా క్రీడాకారిణుల్లో ఓపెనర్ లిజెలే లీ(73) మినహా ఎవరు రాణించకపోవడంతో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఏడుగురు సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటయ్యారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టింది. గైక్వాడ్, శర్మ రెండేసి వికెట్లు తీశారు. జులాన్ గోస్వామికి ఒక వికెట్ దక్కింది.
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 302 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన సెంచరీ(135) చేసింది. హర్మన్ ప్రీత్(55), వేదకృష్ణమూర్తి(51) అర్ధసెంచరీలతో రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment