జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి ట్వంటీ 20లో భారత ఆటగాడు జస్ప్రిత్ బూమ్రా బౌండరీ లైన్‌పై అద్భుతమైన ఫీల్డింగ్‌తో మైమరిపించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు భారత మహిళా క్రికెటర్ స్మృతీ మంధన కూడా బౌండరీ లైన్ వద్దే అబ్బురపరిచే ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన మూడో టీ 20లో భాగంగా దక్షిణాఫ్రికా మహిళల లక్ష్య ఛేదనకు దిగిన సందర్భంలో భారత బౌలర్ అనుజ పాటిల్ వేసిన ఎనిమిదో ఓవర్ నాల్గో బంతిని డు ప్రీజ్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టింది.
కాగా, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మంధన బంతిని బౌండరీ లైన్‌కు అంగుళం దూరంలో చాకచక్యంగా ఒడిసి పట్టుకుంది. బ్యాలెన్స్ తప్పి బౌండరీ లైన్ పై పడే సమయంలో బంతిని మైదానంలోకి విసిరేసింది. దాంతో ఆ బంతికి పరుగు మాత్రమే రావడంతో మంధన ఐదు పరుగుల్ని సేవ్ చేసినట్లయ్యింది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆటలో గెలుపు, ఓటములు సహజమే అయినప్పటికీ మంధన గాల్లోకి క్యాచ్ పట్టడం అభిమానుల్లో జోష్ తెచ్చింది.
ఆ తరువాత ఇదే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బూమ్రా కూడా ఇదే తరహాలో క్యాచ్ పట్టాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని బూమ్రా గాల్లోని అందుకున‍్నాడు. కాగా, బంతిని అందుకోవడానికి ముందు బూమ్రా బౌండరీ లైన్‌ను తాకడంతో అది సిక్సర్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment