Offering
-
బాలరామునికి బంగారు, వెండి కానుకల వెల్లువ
అయోధ్యలో కొలువైన బాలరాముని దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారికి అత్యంత విలువైన కానుకలు సమర్పిస్తున్నారు. బాలరాముడు ప్రతిరోజూ భక్తుల నుంచి కానుకలతోపాటు భారీ మొత్తంలో విరాళాలను కూడా అందుకుంటున్నాడు.బాలరామునికి భక్తుల నుంచి పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు కానుకలుగా అందుతున్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ట్రస్ట్ ద్వారా ఇద్దరు సంఘ్ కార్యకర్తలు నియమితులయ్యారు. వీరు ఆభరణాలను విరాళంగా ఇచ్చే భక్తుల పేర్లు, చిరునామా, మొబైల్ నంబర్‌ను నమోదు చేస్తుంటారు. వీరు షిఫ్టుల వారీగా పనిచేస్తుంటారు. భక్తుల నుంచి అందిన ఆభరణాలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్లో జమచేస్తారు.భక్తులు విరాళాల కౌంటర్ వద్ద సమర్పించే నగదును కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. రామ్ లల్లా ఆభరణాలకు రక్షణ అందించేందుకు రిటైర్డ్ ఆర్మీ జవానును నియమించారు. ఆయన ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో రామ్ లల్లాను అలంకరించినప్పుడు లాకర్ నుండి నగలను తీసి, సంబంధిత పూజారులకు అందిస్తారు. తిరిగి రాత్రిపూట వాటిని భద్రపరుస్తారు. ఆభరణాలకు రక్షణగా ఇద్దరు గన్నర్లు రోజుకు మూడు షిఫ్టుల్లో కాపలాగా ఉంటారు. ఆలయంలో భద్రత కల్పించేందుకు 20 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించారు. -
మహానేత వైఎస్సార్ వర్ధంతి.. ఐదు వేల మందికి అన్నదానం..
విజయవాడ: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దివంగత నేతను స్మరించుకుంటూ.. పలు కార్యక్రమాలను నిర్వహించారు. విజయవాడలోని గొల్లపూడిలో వైఎస్సార్సీపీ నేతలు పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత, సురేష్, ధూళిపాళ్ల శ్రీనాథ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పేదల గుండె చప్పుడు మహానేత వైఎస్సార్ -
పదిలో 10 సాధిస్తే 25 వేలు
సిద్దిపేట జోన్: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో పదో తరగతి వార్షిక పరీక్షకు హాజరయ్యే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షల్లో 10/10 మార్కులు సాధించే విద్యార్థులకు ఆయన రూ.25 వేల నజరానా ఇవ్వనున్నట్లు తెలిపారు. మంగళవారం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ. 10 లక్షలతో వంటగది నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడారు. గతేడాది పదో తరగతిలో 92 శాతం ఫలితాలతో జిల్లా మూడో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించి మొదటి స్థానంలో నిలవాలని టీచర్లకు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో, అభివృద్ధిలో చివరికి ఎన్నికల ఫలితాల్లో సిద్దిపేట అగ్రగామిగా ఉందని.. అదే స్ఫూర్తితో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని టీచర్లకు సూచించారు. నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులు ఎంత మంది 10/10 ఫలితాలు తెచ్చుకుంటే అందరికీ రూ.25 వేల నజరానా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థుల వద్దకు వెళ్లి టెన్త్ ఫలితాల్లో 10/10 సాధిస్తే రూ.25 వేలు బహుమానంగా ఇవ్వనున్నట్లు హరీశ్ తెలిపారు. తన ఛాలెం జ్ను స్వీకరించి 10/10 సాధించి నజరానా పొందాలని సవాల్ విసిరారు. దీనికి విద్యార్థులు సవాల్‌ను స్వీకరిస్తున్నామని విక్టరీ సంకేతంతో బదులిచ్చారు. -
అవునా?
♦ అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది. ♦ చిన్న అరటి (యాలక్కి అరటి) నైవేద్యంగా ఉంచితే ఆగిపోయిన పనులు ముందుకు సాగడమేగాక త్వరగా పూర్తవుతాయి. ♦ అరటి పండు గుజ్జు నైవేద్యంగా పెట్టడం ద్వారా – అప్పుల బాధ తొలగిపోతుంది. రావలసిన డబ్బు తిరిగి వస్తుంది. నష్టపోయిన నగదును పొందే అవకాశం, రాదనుకున్న నగదు తిరిగి రావటం, ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎక్కువ కట్టినా తిరిగి వస్తుంది. శుభకార్యాలకు కావలసిన నగదు సకాలంలో చేతికి అందుతుంది. ♦ పూర్ణఫలం లేక కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే – పనులు త్వరగా, సులభంగా పూర్తవుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. ♦ సపోటా పండును నైవేద్యంగా పెడితే,అమ్మాయిని చూసి వెళ్లినవారు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తున్నా లేదా సంబంధం చేసుకునేందుకు నిరాకరించినా, ఇతరుల మధ్యవర్తిత్వం ద్వారా ప్రయత్నించినా అబ్బాయి తరపు వారు నిరాకరిస్తే, సపోటాపండును దేవునికి నైవేద్యంగా పెడితే ఎటువంటి అవాంతరాలైనా తొలగిపోతాయి. ♦ కమలాపండును నైవేద్యంగా పెడితే – పనులు చేసి పెడతామని మాట ఇచ్చిన తరువాత వేర్వేరు కారణాలతో పనులను ఆపేస్తే, కమలాపండును దేవునికి నైవేద్యంగా ఉంచితే నమ్మకమైన వ్యక్తుల ద్వారా అయ్యే పనులు పూర్తవుతాయి. -
షాకింగ్; దేవత కోసం కళ్లు పీకేసుకున్న బాలిక
పట్నా: దుర్గామాత భక్తురాలైన ఓ బాలిక తన రెండు కళ్లను పెకిలిచి దేవతకు అర్పించింది. అందరినీ షాక్‌కు గురిచేసిన ఈ ఘటన బిహార్‌లోని దర్భాంగ జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. దర్భాంగ జిల్లా బహేరీ బ్లాక్ సిరువా గ్రామంలోని దుర్గామాత ఆలయంలో చైత్ర నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కోమల్ కుమారి అనే బాలిక ప్రతిరోజూ గుడికి వచ్చి పూజలు చేసేది. ఏడోరోజైన ఆదివారం అమ్మవారికి పూజలు జరుగున్న సమయంలో.. కుమారి తన రెండు కళ్లను బలవంతంగా పెకిలించుకుని దేవతకు అర్పించేయత్నం చేసింది. కళ్లవెంట ధారలా కారుతోన్న నెత్తురు చూసి అర్చకుడు సహా అందరూ స్థాణువైపోయారు. వెంటనే తేరుకుని సమీపంలోని ఆస్పత్రికి ఆమెను తరలించారు. అత్యవసర చికిత్స నిమిత్తం అక్కడి నుంచి దర్భాంగ జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. దుర్గామాత చెప్పిందనే..: పదో తరగతి పరీక్షల్లో ఫెయిలై, ఇంటివద్దే ఉంటోన్న కోమల్ కుమారి.. గత కొద్ది రోజులుగా విచిత్రంగా మాట్లాడినట్లు తెలిసింది. దుర్గామాత కలలోకి వచ్చేదని, ఏదో ఒక అవయవాన్ని అర్పించమనేదని కుమారి తన స్నేహితురాళ్లతో చెప్పుకునేది. ‘‘ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స అందిస్తున్నాం. బాలిక ఆరోగ్యంపై ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేం’’అని దర్భాంగ జిల్లా వైద్యాధికారి సంతోశ మిశ్రా అన్నారు. ఇది మూర్ఖత్వం.. మానసిక రుగ్మత: తాను పనిచేసే ఆలయంలో ఊహించని సంఘటనపై అర్చకుడు భవ్‌నాథ్ ఝా స్పందించారు. ‘నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఇవాళ కంటి ఆకారంలో ఉండే బెల్ పండ్ల గింజలను సమర్పిస్తాం. కానీ ఈ అమ్మాయి(కోమల్) నిజం కళ్లనే పెకిలించుకోవడం ముమ్మాటికీ మూర్ఖత్వమే. ఏ దేవతా భక్తులను కళ్లు, ఇతర అవయవాలు ఇవ్వమని కోరదు’ అని ఝా అన్నారు. ‘‘బాలిక తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతోంది. మూఢనమ్మకాలకు సంబంధించి ఇది తీవ్రమైన కేసు’’ అని పట్నాకు చెందిన మానసిక వైద్యుడొకరు తెలిపారు. -
ఒక్క పతకం మార్చేసింది!
సాక్షి, హైదరాబాద్: ‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది’ ఇది బాగా పాపులర్ అయిన టెలికామ్ యాడ్. ఇప్పుడు ఈ యాడ్‌కు సరిగ్గా సరిపోయేలా... ఒక్క పతకం ఓ జిమ్నాస్ట్‌ను ఆకాశానికి ఎత్తేసింది. కోటీశ్వరురాలిని చేసేసింది. ఆ జిమ్నాస్ట్ బుద్దా అరుణ రెడ్డి కాగా... ఆ పతకం మెల్బోర్న్లో నెగ్గిన కాంస్యం. ఆమె సాధించిన కాంస్యంతో కాసులు... రాశులు కురుస్తున్నాయి. 14 ఏళ్లుగా ఆమె పడుతున్న కష్టాలకు తగిన ప్రతిఫలాలు లభిస్తున్నాయి. తెలంగాణకు చెందిన యువ జిమ్నాస్ట్ అరుణ రెడ్డి ఇటీవలే ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో కాంస్య పతకం గెలిచింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఆమె గుర్తింపు పొందింది. కాంస్యంతో కొత్త చరిత్ర సృష్టించిన ఆమెను శనివారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) లాల్‌బహదూర్ స్టేడియంలో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ‘శాట్స్’ తరఫున ప్రోత్సాహకంగా అరుణకు రూ. 20 లక్షల చెక్‌ను తెలంగాణ క్రీడాశాఖ మంత్రి పద్మారావు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హైదరాబాద్ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు, సువర్ణ అవనిస్ కంపెనీ యజమాని సురేందర్ ఆమెకు రూ. 50 లక్షల విలువైన విలాసవంతమైన విల్లాను బహుమతిగా ఇచ్చారు. తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. శనివారం జరిగిన మరో కార్యక్రమంలో కొన్నాళ్లుగా అరుణకు చేయూతనిస్తోన్న ఎథిక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ తమ వంతుగా రూ. 2 లక్షలు నగదు పురస్కారాన్ని అందజేసింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఊహించనిరీతిలో ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఆదివారం ఆమె తన తల్లి సుభద్ర, సోదరి పావని రెడ్డిలతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా అరుణ ఘనతను కొనియాడిన ఆయన రూ. 2 కోట్ల నజరానా ప్రకటించారు. ఆమె కోచ్ బ్రిజ్ కిశోర్‌కు కూడా ఆర్థిక సాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి పద్మారావు, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంధ క్రికెటర్లకు రూ. 5 లక్షల నజరానా
న్యూఢిల్లీ: అంధుల ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యులకు కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ నజరానా ప్రకటించారు. ఒక్కో ఆటగాడికి రూ. 5 లక్షల చొప్పున అందజేస్తామని గోయెల్ ప్రకటించారు. బుధవారం ఇక్కడ జరిగిన గ్రామీణ్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రపంచకప్ సాధించిపెట్టిన ఆటగాళ్లందరికి రూ. 5 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ అందజేస్తాం’ అని అన్నారు. గ్రామీణ్ ఖేల్ మహోత్సవ్‌లాంటి ఈవెంట్ల వల్ల మారుమూల పల్లెల్లోని ప్రతిభావంతులకు మేలు జరుగుతుంది’ అని అన్నారు. -
కబడ్డీ ఆటగాళ్లకు నజరానా
న్యూఢిల్లీ: ప్రపంచకప్ కబడ్డీ టైటిల్‌ను నెగ్గిన భారత జట్టుకు కేంద్రం నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్టు క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. గురువారం ఆయన నివాసంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ‘ఆటగాళ్లతో పాటు కోచ్‌కు కూడా రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నాం. ఈ గేమ్ ఒలింపిక్స్‌లో కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే క్రికెట్ మాత్రమే కాకుండా దేశంలో ఫుట్‌బాల్, హాకీ, ఇతర ఆటలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’ అని గోయల్ అన్నారు. -
దానం చెయ్యబోతే.. దాడి జరిగింది!
పుణ్యక్షేత్రం వీదుల్లో నడుస్తూ వెళుతున్నాడో భక్తుడు. రోడ్డు పక్కనే కూర్చున్న కోతి ఆర్తితో అతనివైపు చూసింది. 'పాపం.. ఆకలితో అలమటిస్తుందేమో' అనుకుని చేతిలో ఉన్న అరటి పండును కోతికి అందించాడు. అంతే.. ఒక్క గంతులో పదుల కోతులు అతణ్ని చుట్టుముట్టాయి. నాకంటే నాకంటూ పోటీపడి పైపైకి ఎక్కేశాయి. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి ఫొటో తీసి ప్రఖ్యాత న్యూస్ నెట్ వర్కింగ్ సైట్ రెడిట్ లో పోస్ట్ చేశాడు. సదరు సంఘటనను వేరొక అంశానికి ముడిపెడుతూ కొందరు నెటిజన్లు తమ ఫొటోషాప్ ప్రతిభ చూపారు. ఈ ఫొటో చూసిన తర్వాతైనా కోతులు నివసించే క్షేత్రాల్లో జాగ్రత్తగా ఉంటారు కదా! (చదవండి: పాప భయంపై ఫొటోషాప్ పోట్లాట) కోతుల దాడిని ఆక్స్ ప్రకటనతో పోల్చుతూ.. డోనాల్డ్ ట్రంప్ అభిమానులను కోతులతో పోల్చుతూ.. -
నేడు మహాగణపతి ప్రసాదం పంపిణీ
ఖైరతాబాద్: శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతి చేతిలో 11 రోజుల పాటు నిత్యపూజలందుకున్న 5 టన్నుల మహాప్రసాదం (లడ్డు) గురువారం పంపిణీ చేయనున్నారు.లడ్దూ దాత మల్లిబాబుకు రెండు టన్నుల ప్రసాదాన్ని ఇవ్వగా, మిగిలిన ప్రసాదాన్ని గురువారం ఉదయం 11.45 గంటల నుంచి భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఉత్సవ కమిటీసభ్యులు తెలిపారు. ఈ ప్రసాద పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూడు ప్లటూన్ల పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పి.అశోక్ తెలిపారు. ప్రతి ఒక్కరూ వరుసలో వచ్చి ప్రసాదం తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.