ఈ ఫొటో చూసిన తర్వాతైనా కోతులు నివసించే క్షేత్రాల్లో జాగ్రత్తగా ఉంటారు కదా!
పుణ్యక్షేత్రం వీదుల్లో నడుస్తూ వెళుతున్నాడో భక్తుడు. రోడ్డు పక్కనే కూర్చున్న కోతి ఆర్తితో అతనివైపు చూసింది. 'పాపం.. ఆకలితో అలమటిస్తుందేమో' అనుకుని చేతిలో ఉన్న అరటి పండును కోతికి అందించాడు. అంతే.. ఒక్క గంతులో పదుల కోతులు అతణ్ని చుట్టుముట్టాయి. నాకంటే నాకంటూ పోటీపడి పైపైకి ఎక్కేశాయి.
ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి ఫొటో తీసి ప్రఖ్యాత న్యూస్ నెట్ వర్కింగ్ సైట్ రెడిట్ లో పోస్ట్ చేశాడు. సదరు సంఘటనను వేరొక అంశానికి ముడిపెడుతూ కొందరు నెటిజన్లు తమ ఫొటోషాప్ ప్రతిభ చూపారు. ఈ ఫొటో చూసిన తర్వాతైనా కోతులు నివసించే క్షేత్రాల్లో జాగ్రత్తగా ఉంటారు కదా! (చదవండి: పాప భయంపై ఫొటోషాప్ పోట్లాట)