
ఇంగ్లండ్ ఘనవిజయం
అహ్మదాబాద్: ప్రపంచకప్ కబడ్డీలో ఇంగ్లండ్ రెండో విజయం సాధించింది. శుక్రవారం గ్రూప్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు ఆస్ట్రేలియాను 68-28 తేడాతో చిత్తుగా ఓడించింది. టోప్ అడెవాలూర్ అత్యధికంగా 19 రైడింగ్ పారుుంట్లు సాధించగా కేశవ్ గుప్తా 10 పారుుంట్లు చేశాడు.
గ్రూప్ ‘బి’లో జరిగిన మరో మ్యాచ్‌లో పోలండ్ 75-29 తేడాతో అమెరికాను ఓడించింది. నేడు (శనివారం) డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు అర్జెంటీనాతో తలపడనుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌లాడిన భారత్ పారుుంట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.