
భారత్ ‘రికార్డు’ విజయం
సెమీఫైనల్లో కొరియా, ఇరాన్
ప్రపంచకప్ కబడ్డీ
అహ్మదాబాద్: ప్రపంచకప్ కబడ్డీ చరిత్రలో భారత్ భారీ ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 74-20 తేడాతో అర్జెంటీనాను చిత్తుచిత్తుగా ఓడించింది. 54 పారుుంట్ల తేడాతో ఓ జట్టు నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. అలాగే వరుసగా మూడో విజయాన్ని అందుకున్న భారత్ దాదాపుగా సెమీఫైనల్స్‌లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. అజయ్ ఠాకూర్, రాహుల్ చౌధరి అత్యధికంగా 11 రైడింగ్ పారుుంట్లు సాధించగా ప్రదీప్ నర్వాల్ 5 పారుుంట్లు చేశాడు. ఇక ఆట ఆరంభం నుంచే భారత్ దూకుడు ముందు అర్జెంటీనా ఏమాత్రం నిలవలేకపోరుుంది. తమ కెరీర్‌లో తొలిసారిగా ప్రపంచకప్ ఆడుతున్న అర్జెంటీనాను ప్రారంభ ఐదు నిమిషాల్లోనే భారత్ ఆలౌట్ చేసింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి మరో రెండుసార్లు ఆలౌట్ చేయడంతో పాటు 36-13తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత కూడా ప్రత్యర్థి నుంచి కనీస పోటీ కూడా ఎదురుకాకపోవడంతో భారత ఆటగాళ్లు వరుస పారుుంట్లతో బెంబేలెత్తించారు. చివరి నిమిషంలో అర్జెంటీనా 20వ పారుుంట్ సాధించగలిగింది. అరుుతే అప్పటికే ఆతిథ్య జట్టు అందనంత దూరంలో నిలిచి భారీ విజయాన్ని దక్కించుకుంది. 18న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.
సెమీస్‌లో కొరియా, ఇరాన్
పరాజయమన్నదే లేకుండా దూసుకెళుతున్న దక్షిణ కొరియా ప్రపంచకప్ కబడ్డీలో సెమీ ఫైనల్స్‌కు చేరింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 63-25 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. తమ స్టార్ ఆటగాడు జంగ్ కున్ లీ అందుబాటులో లేకపోరుునా కొరియా చెలరేగింది. ప్రస్తుతం నాలుగు విజయాలతో 20 పారుుంట్లు సాధించి గ్రూప్ ‘ఎ’లో టాప్‌లో కొనసాగుతోంది. మరో గ్రూప్ ‘బి’లో ఇరాన్ జట్టు కూడా వరుసగా నాలుగో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. జపాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 38-34 తేడాతో నెగ్గింది.