కొరియాకు రెండో విజయం | Two Saudi female students flee to South Korea | Sakshi
Sakshi News home page

కొరియాకు రెండో విజయం

Published Mon, Oct 10 2016 2:03 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

Two Saudi female students flee to South Korea

 అహ్మదాబాద్: ప్రపంచకప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో దక్షిణ కొరియా జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ భారత్‌ను బోల్తా కొట్టించిన కొరియా... రెండో మ్యాచ్‌లో 68-42తో అర్జెంటీనాను ఓడించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కొరియా జట్టు విరామ సమయానికి 43-11తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది.
 
  కొరియా జట్టులో చెల్ గ్యు చిన్ అత్యధికంగా తొమ్మిది పాయింట్లు స్కోరు చేయగా... తే బోమ్ కిమ్ ఏడు, గ్యుంగ్ తే కిమ్, చాక్ సిక్ పార్క్ ఆరేసి పాయింట్లు సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో జపాన్ 45-19తో అమెరికాపై, ఇరాన్ 64-23తో థాయ్‌లాండ్‌పై నెగ్గాయి. సోమవారం ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌తో పోలాండ్ తలపడతాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement