అహ్మదాబాద్: కబడ్డీ ప్రపంచకప్‌లో లీగ్ దశలో దక్షిణ కొరియా అజేయంగా నిలిచింది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో కొరియా 56-17తో గెలిచి వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. చియోల్ గ్యు షిన్ 11, డాంగ్ గ్యు కిమ్ 8, యంగ్ జు ఓక్ 6 పారుుంట్లు సాధించారు. ఇంగ్లండ్ జట్టు తరఫున తేజశ్ దిపలా (10) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్ 69-22తో అమెరికాపై గెలుపొందగా, కెన్యా 26-17తో జపాన్‌పై విజయం సాధించింది. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో పోలాండ్‌తో ఇరాన్; ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ ఆడతారుు.
కోల్‌కతాను నిలువరించిన గోవా
కోల్‌కతా: వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొన్న గోవా ఎఫ్‌సీ జట్టు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో పారుుంట్ల ఖాతా తెరిచింది. అట్లెటికో డి కోల్‌కతా జట్టుతో జరిగిన మ్యాచ్‌ను గోవా 1-1తో ‘డ్రా’గా ముగించింది. ఆరో నిమిషంలో డుటీ గోల్‌తో కోల్‌కతా ఖాతా తెరిచింది. 77వ నిమిషంలో గోవా తరఫున గొంజాలెజ్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు.