టుడే న్యూస్‌ రౌండప్‌ | Today News Round up | Sakshi
Sakshi News home page

ఈ రోజు టాప్‌ న్యూస్‌ చదివారా?

Published Tue, Jun 20 2017 5:20 PM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

Today News Round up



రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు తెలపాలా? లేక మరో అభ్యర్థిని పోటీకి నిలుపాలా? అన్నది ప్రతిపక్షాలు చర్చించుకుంటుండగా.. ప్రతిపక్షాలను విస్మయపరుస్తూ కోవింద్‌కు మద్దతిచ్చేదిశగా బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ సాగుతున్నట్టు కనిపిస్తోంది.

ఇక, బ్రాహ్మణ కార్పొరేషన్‌ పదవి నుంచి తనను తొలగించడంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు స్పందించారు. తనపై పెద్ద అభాండం వేసి పదవి నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుకు సంబంధించి  ఇప్పటివరకు టాప్‌ కథనాలు ఇవి..

1.రాష్ట్రపతి అభ్యర్థిపై విపక్షాల సందిగ్ధం
రాష్ట్రపతి అభ్యర్థిగా ఓ దళితుడిని ఖరారు చేయడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రతిపక్షాన్ని సందిగ్ధంలో పడేసింది.

2. ఐవైఆర్ కృష్ణారావుపై ఏపీ ప్రభుత్వం వేటు
సోషల్ మీడియాలో ఐవైఆర్ కృష్ణారావు చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి చంద్రబాబు సర్కార్‌ తొలగించింది.

3. మీరు చస్తే.. పాక్‌లో సమాధి చేస్తారా?
చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ పరాజయంపై సంబరాలు చేసుకుంటున్నవారికి ప్రశ్న..

4. విపక్షాలకు షాక్‌ ఇచ్చి.. కోవింద్‌కు జై!
బీజేపీ ఊహించినట్టుగానే కొత్త రాష్ట్రపతి విషయంలో విపక్షాల్లో చీలిక..

5.నా మీద పెద్ద అభాండం వేశారు: ఐవైఆర్‌
బ్రాహ్మణ కార్పొరేషన్‌ పదవి నుంచి తొలగించడంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు స్పందించారు.

6. కొత్త ‘రాష్ట్రపతి’ గతంలో రెండుసార్లు ఓడారు
ఎవ్వరూ ఊహించని విధంగా బిహార్‌ గవర్నర్‌, దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఎన్డీయే అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది

7. శివసేన ఏం చేయనుంది? మళ్లీ ఝలకా!
తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎన్డీయే ప్రకటించిన నేపథ్యంలో శివసేన పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

8. కాంగ్రెస్‌ కూడా ‘రాష్ట్రపతి’గా దళిత వ్యక్తినేనా?
దళిత వర్గానికి చెందిన బిహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ను బరిలోకి దింపుతున్నట్లు బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా దళిత వ్యక్తినే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

9. కార్యకర్తకు చెంపదెబ్బ!
మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ నేత అజయ్‌ సింగ్‌ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రైతు హత్యలపై నిరసన తెలిపే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సహనం కోల్పోయారు.

10. వేటుకు ఐవైఆర్ ఫేస్‌బుక్ పోస్టులే కారణమా?
తాము చెప్పినట్లు నడుచుకోకపోతే ఎంత సీనియర్ ఐఏఎస్ అధికారులైనా వేటు తప్పదన్నట్లుగా తయారైంది ఏపీలో ప్రస్తుత పరిస్థితి.

11. ఆత్మాహుతి దాడికి సిద్ధం.. అంతలో పట్టేశారు
లెబనాన్‌లో ఓ ఉగ్రవాది జాడలను అక్కడి భద్రతా బలగాలు ముందుగానే పసిగట్టాయి. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)కు చెందిన అతడిని చాలా చక్యంగా బంధించాయి.

12. రూ.73 కోట్లు ‘చెత్త’లో..
మండూరు పాలికె చెత్త సేకరణ కేంద్రం నుంచి విద్యుత్, ఇంధన ఉత్పత్తి పథకంలో భారీఎత్తున అక్రమాలు జరిగాయని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే ఏ.బీ మాలకరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన శాసనసభ స్థాయీ సమితి స్పష్టం చేసింది.
..............

క్రీడలు....
1. మాకు దేశభక్తి ఏమిటి?: క్రికెటర్
క్రికెటర్లు నిజమైన స్టార్లు కాదంటున్నాడు బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మష్రాఫ్ మొర్తజా. డబ్బులు తీసుకుని క్రికెట్ ఆడే తమను నిజమైన స్టార్లుగా ఎలా గుర్తిస్తారంటూ ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టాడు.


2. 'బూమ్రాను చాలాకాలం బాధిస్తుంది'
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన తుది పోరులో భారత ఓటమికి పేసర్ జస్ఫిత్ బూమ్రా వేసిన నో బాల్ కూడా ఒక కారణం.


3. ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు!
ప్రస్తుతం భారత అండర్ -19 , భారత్ -ఎ క్రికెట్  జట్లకు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది.
...............

బిజినెస్‌...
1. జూన్‌ 30 అర్థరాత్రి జీఎస్‌టీ లాంచ్‌
ఒక దేశం ఒక పన్ను  విధానంలో  భాగంగా  జూలై 1నుంచి  జీఎస్‌టీ అమలుకు కేంద్రం కసరత్తును పూర్తి  చేసింది. .

2. మోటో ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్
మోటో ఫ్యాన్స్ కు కోసం ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను తీసుకొచ్చింది.

3. పసిడి ధరలు వెల వెల
దేశీ మార్కెట్లో బంగారం ధర వెలవెలబోతోంది. వరుసగా  సెషన్లుగా క్షీణిస్తున్న పుత్తడి ధరలు మంగళవారం మరింత దిగి వచ్చాయి.

4. ఆ విద్యార్థులకు సగటు వేతనం రూ.22లక్షలు
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) హైదరాబాద్ తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ ఇన్ మేనేజ్ మెంట్ విద్యార్థుల ఫైనల్ ప్లేస్ మెంట్లను విజయవంతంగా పూర్తిచేసింది..
....................

ఎంటర్‌టైన్‌మెంట్‌..

14. కట్టప్ప తరహాలో ప్రభాస్‌కు మరో వెన్నుపోటు!
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది చాలాకాలం వేధించిన ప్రశ్న.

15. నా కూతురు పెళ్లి చేసుకుంటేనే ఆనందం!
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ దాదాపు ఖాయమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement