
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గజపతినగరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన రాజన్న తనయుడికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇక తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ బీజేపీలో చేరిపోయారు. అగ్రరాజ్యం అమెరికాలో అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న తెలుగువాళ్లు భాషాపరంగానూ ముందంజలో ఉన్నారని వెల్లడైంది. ఇక బాలీవుడ్‌లో తనుశ్రీ దత్తా ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆసియాకప్ ఫైనల్‌లో మూడో అంపైర్ నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు సోషల్ మిడియాలో కారాలు-మిరియాలు నూరుతున్నారు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
‘గజపతి’ నియోజకవర్గంలో ఘన స్వాగతం
అమెరికాలో అన్నింటా తెలుగువారే!
Comments
Please login to add a commentAdd a comment