ivr krishnarao
-
జీర్ణ దేవాలయాలను ఉద్ధరించిన జీవో
ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలంగా అర్చకులు కంటున్న కలలు నెరవేరేలా గత సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగ భద్రత, అర్హత కలిగిన వారసత్వ గుర్తింపు, చిన్న దేవాలయాలపై దేవాదాయ శాఖ పెత్తనాన్ని తొలగించే ఈ ఉత్తర్వుల కోసం అరకొర జీతాలతో, సదుపాయాలతో గ్రామాల్లో దేవాలయాల్ని అంటి పెట్టుకొని జీవిస్తూ ఉన్న అర్చకులు ఎదురుచూస్తూ ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా ఇది సాధించటం కోసం అర్చక సమాఖ్య ప్రతినిధులు తిరగని ఆఫీసు లేదు, కలవని అధికారులు, రాజకీయ నాయకులు లేరు. 1987లో మొదలైన ఈ కష్టాలకు 2007లో రాజశేఖర్ రెడ్డి చట్ట సవరణ ద్వారా వెసులుబాటు కల్పిస్తే ఒక దశాబ్దం తర్వాత దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణ రూపంలో తీసుకువచ్చారు. 2017 లో ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ముసాయిదా తయారై జీవో 76 రూపంలో విడుదలైనా, ఆనాటి ప్రభుత్వం వాటిని నిర్ధారించకుండానే వదిలేసింది. ఈరోజు శాశ్వత ప్రాతిపదికలో జీవో 439 ద్వారా ఆ అంశాలను నిర్ధారించారు. 1987వ సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని సమూలంగా చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సు మేరకు సవరించి నూతన చట్టాన్ని తీసుకువచ్చారు. అంతవరకు ఉన్న వ్యవస్థను నాశనం చేయడంలో ఈ చట్టం సఫలీకృతం అయింది. కానీ దానికి ప్రత్యా మ్నాయంగా మరొక విధానాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చట్టంలో ఎక్కడా కనిపించలేదు. సంస్కరణ ప్రధానంగా కాకుండా, ఎవరి మీదనో ద్వేషంతో, కోపంతో చట్టాలు తీసుకొని వస్తే దాని దుష్పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఈ చట్ట సవరణలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని మిరాసి హక్కులను తొలగించారు. ఈ మొత్తం చట్టంలో హర్షించదగిన సంస్కరణ ఇది ఒకటి. మరి ఇంక ఏ దేవాలయంలో లేని విధంగా తిరుమల దేవాలయంలో స్వామి వారికి సేవ చేసినందుకు ఆలయ ఆదాయంలో రకరకాల సేవలకు భాగం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి మిరాసీలు చాలా ఉన్నా ప్రధానమైనది అర్చక మిరాసి. ఆలయ ఆదాయం పెరగటంతో మిరాసీదారులకు కూడా ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. ఈ మిరాసి రద్దుతోపాటు వారసత్వ హక్కు, చిన్న గ్రామాలలో అర్చకులకు వచ్చే దక్షిణలు, దేవాలయాల్లో సేవ చేసినందుకు ఏర్పాటుచేసిన సర్వీస్ ఈనాములను రద్దు చేశారు. దేవాదాయ శాఖను విస్తృతపరచి ఆదాయం లేని చిన్న చిన్న దేవాలయాలను కూడా దేవాలయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న దేవాలయాలను వాటిని అంటిపెట్టుకుని అరకొర ఆదాయంతో పనిచేస్తున్న అర్చకులను ఈ సంస్కరణ బాగా దెబ్బ తీసింది. వారికున్న చిన్న ఆదాయపు వనరులను తీసివేశారు కానీ, ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఎటువంటి వనరులను ఏర్పాటు చేయలేకపోయింది. చిన్న ఆలయాల నిర్వహణకు ప్రభుత్వ ప్రతిపాదన ఏమిటి అని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేక పోయింది. ఈ అంశాన్ని పరిశీలించి సుప్రీంకోర్టు ఇచ్చిన భిన్న ఉత్తర్వులను అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజుల్లో తాత్సారం ప్రదర్శించింది. రాజకీయంగా పట్టించుకోని, స్పందిం చని నిరంకుశ ప్రభుత్వం, అవినీతిమయమైన, చలనం లేని దేవాదాయ, ధర్మాదాయ శాఖతో ఆ రోజుల్లో చిన్న దేవాలయాల్లోని పురోహితులు పడిన కష్టాలు వర్ణనాతీతం. చట్ట సవరణ వారికి వ్యతిరేకంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మొదలెట్టారు. అధికార యంత్రాంగం విస్తరించి చిన్న దేవాలయాలు కూడా వారి పరిధిలోకి రావటంతో ఆ వచ్చే అరకొర ఆదాయం ఈ అధికారుల జీతాలకే సరిపోయింది. ఈ సమస్య కేవలం అర్చకులకే కాదు. దేవాలయానికి ఇతరత్రా సేవలు చేస్తున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు మొదలైనవారు కూడా అనుభవించారు. ఈ చిన్న చిన్న కులాల వారి కుండే సర్వీస్ ఈనాములను కూడా తొలగించారు. గ్రామాలలోని చిన్న దేవాలయాల్లో చాలామంది బ్రాహ్మణ కులాలకు సంబంధించని లింగాయతులు, బోయలు, తంబళ్ల కులస్తులు, చాద్ధాట వైష్ణవులు అర్చకత్వం నిర్వహిస్తుంటారు. వీరందరు కూడా ఈ నూతన చట్టంతో తరతరాల వృత్తిని వదిలి పెట్టలేక, సరైన జీవనభృతి లేక కష్టాలు అనుభవించారు. ఈ సమయంలో చిన్న గ్రామాలలోని దేవాలయాల అర్చకుల తరఫున నాయకత్వం వహించి దేవాలయాల పరిరక్షణ ఉద్యమాన్ని నడిపిన ఘనత చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఎమ్వీ సౌందర్‌రాజన్‌కి దక్కు తుంది. సుప్రీంకోర్టు దాకా ఈ అంశంపై జరిగిన కేసులలో వీరు చాలా ప్రధాన పాత్ర పోషించారు. ప్రజాభిప్రాయాన్ని చిన్న దేవాలయాల అర్చకుల సమస్యలు అర్థం చేసుకునే విధంగా కూడగట్టడంలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. సుప్రీంకోర్టు తన తీర్పులో చిన్న దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక విధానాలు ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఆనాటి మంద తోలు మూర్ఖ ప్రభుత్వం ఈ సమస్యలపై కమిటీలు వేయడం వరకే పరిమితం అయింది కానీ సమస్య పరిష్కారానికి ఎటువంటి చొరవ చూపలేదు. ప్రభుత్వ అధినేతల నిర్లక్ష్య ధోరణితో ఏకపక్షంగా అధికారులు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న అర్చకులను ఎటువంటి పారితోషికం లేకుండా పదవీ విరమణ చేయించటం, వారి వారసులకు అర్చకత్వం బాధ్యతలు ఇవ్వకపోవటం సాధారణమైపోయింది. ఈ వేధింపులు తాళలేక మహబూబ్‌నగర్ జిల్లా అలంపురంలో భీష్మ సేనా చారి అనే పురోహితుడు గుడిగంటకు ఉరి వేసు కుని 2001లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. 2004లో ప్రభుత్వం మారటంతో ఈ సమస్యపై నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం దృష్టి సారించింది. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అఖిలపక్ష సిఫార్సు మేరకు చట్టాన్ని సవరించి వారసత్వ హక్కులను గుర్తించింది. ఆ చట్ట సవరణకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదించింది.. రాష్ట్రంలో ఆదాయం బాగా వచ్చేటటువంటి దేవాలయాలు చాలా కొద్ది మాత్రమే. ఆ ఆలయా లకు చిన్న గ్రామాలలో ఉండే ఆలయాలకు ఒకే విధమైన విధివిధానాలు ఉండాలి అనుకోవడం అవివేకం. గ్రామాలలోని చిన్న దేవాలయాలను ప్రత్యేకంగా పరిగణించి గ్రామ సమాజం యొక్క ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తితో అధికార యంత్రాంగం నియంత్రణ లేకుండా నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి ఈ విధి విధానాలు ఆ లక్ష్య సాధనకు తప్పకుండా ఉపయోగపడతాయి. అర్హతలేని వారసత్వానికి ఎక్కడా తావులేదు. ప్రభుత్వం కూడా సరైన విధానాలు ఏర్పాటు చేసి, సరైన ప్రావీణ్యం ఉన్నవారే ఎంపిక అయ్యేటట్లు చూడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా వారికి ఇచ్చే పారితోషికం తగిన స్థాయిలో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. పెద్ద దేవాలయాల ఆదాయాన్ని దీనికి కేటాయించడం ద్వారా కనీసం అర్చ కునికి 15 వేల రూపాయల నెలసరి పారితోషికం వచ్చేట్టుగా ఏర్పాట్లు చేయవచ్చు. అదేవిధంగా ధార్మిక ఉద్యోగులను దేవాదాయశాఖ పరిధి నుంచి తొలగించి ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేవలం హిందూ ధర్మంపై అవగాహన, విశ్వాసం ఉన్న వారితో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. దేవాలయాల ఆస్తులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. విద్యాసంస్థల పేరుతో, మరొక పేరుతో చాలామంది చౌకగా దేవాదాయ భూములు ఆక్రమించుకున్నారు. మరికొందరు చట్టవిరుద్ధంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు. వీరందరిని దేవాదాయ భూముల నుంచి తొలగించి భూములు ఆలయాలకు చెందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే సరైన ఆదాయవనరులు ఏర్పడి దేవాలయాలు సక్రమంగా నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది. అర్హత కలిగిన అర్చకులు, న్యాయబద్ధమైన పారితోషికం ఉన్ననాడు గ్రామాలలోని దేవాలయాలను హిందూధర్మ పరిరక్షణ ప్రచార కేంద్రాలుగా తీర్చిదిద్దవచ్చు. అర్చకులలో సామాజిక స్పృహ ఒక ప్రధాన బాధ్యతగా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు ప్రభుత్వం తీసుకున్న చర్య స్వాగతింపదగినది. భవిష్యత్తులో గ్రామాలలో దేవాదాయ వ్యవస్థను బలోపేతం చేయటానికి మరిన్ని చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
టుడే న్యూస్ రౌండప్
కేంద్ర ప్రభుత్వం రద్దైన పాతనోట్లను మార్చుకునే అవకాశాన్ని బ్యాంకులు, పోస్టాపీసులకు, జిల్లా సహకార బ్యాంకులకు కల్పించింది. మరోవైపు దాదాపు రెండేళ్ల విరామం తర్వాత విశ్వహిందూ పరిషత్ రామమందిర నిర్మాణం కోసం పనులు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు బుధవారం కూడా సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేశారు. కాగా ఐవైఆర్ ను ఉద్దేశపూర్వకంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి తొలగించారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప మహిళలపై రెచ్చిపోయారు. టీడీపీకి ఓటు వేయకపోతే పింఛన్లు పీకేస్తామని బెదిరించారు. ఇంకా ఈ రోజు టాప్ న్యూస్ మీకోసం ... 1.పాతనోట్ల మార్పిడికి వారికి గోల్డెన్ ఛాన్స్ బ్యాంకులు, పోస్టాఫీసులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ఇండియా, కేంద్ర ప్రభుత్వం మరోసారి బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2. ఐవైఆర్ పోస్టింగ్‌లు... షేరింగ్‌లు జగన్నాథ రథచక్రం పేరుతో మే 12న ఫేస్బుక్లో అకౌంట్ పబ్లిష్ అయిన దాన్ని ఐవైఆర్ కృష్ణారావు షేర్ చేశారు. 3. హవ్వా.. మత్తులో ఇలా కూడా చేస్తారా..? మద్యం, పొగ, మత్తుపదార్థాలు సేవించడం ఆరోగ్యానికి హానీకరం అంటారు. 4. మహిళలపై హోం మంత్రి రాజప్ప చిందులు వేషాలు వేస్తే మహిళలని చూడం. అవసరమైతే పింఛన్లు పీకేస్తామని సాక్షాత్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైనమిది. 5. ‘టీఎస్పీఎస్సీ’ మాకు క్లారిటీ ఇవ్వదా? టీఎస్పీఎస్సీ లాంగ్వేజ్ పరీక్షల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6. 'గౌతమిపుత్ర'పై ప్రశ్నించడమే ఐవైఆర్ తప్పా?' ఐవైఆర్ కృష్ణారావును ఉద్దేశపూర్వకంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి తొలగించారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. 7. ‘అఖిలేశ్’కు రామమందిర నిర్మాణం ఇష్టం లేదు’ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత విశ్వహిందూ పరిషత్ రామమందిర నిర్మాణం కోసం పనులు ప్రారంభించింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఆయా ప్రాంతాల నుంచి శిలలను సేకరిస్తోంది. 8. ‘స్టీల్ సిటీని స్టోలెన్ సిటీగా మార్చారు’ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కనుసన్నల్లోనే విశాఖలో భూ కుంభకోణం జరిగిందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఆరోపించారు. 9. సోనియాకు నితీష్ ఝలక్.. మోదీకే జై అనుకున్నదే అయింది. కేంద్రంలో విపక్షాలకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఝలక్ ఇచ్చారు. సినిమా- ఎంటర్టైన్మెంట్ 1. సూపర్ స్టార్‌తో అల్లరోడు..? ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత చేయబోయే సినిమాలను కూడా ఫైనల్ చేశాడు. 2. పవన్ లుక్కు సూపర్ రెస్పాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 3. ఆడియో వేడుకకే కళ్లు చెదిరే ఖర్చు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా 2.0. 4. బన్ని ఫ్యాన్స్‌కు నిరాశేనా..! అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథమ్. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బిజినెస్ 1. ఎయిరిండియాపై కన్నేసిన టాటా సింగపూర్ ఎయిర్ లైన్ భాగస్వామ్యంతో ఎయిరిండియాను కొనుగోలుచేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్టు ఓ ఇంగ్లీష్ ఛానల్ రిపోర్టు చేసింది. 2. ఇన్ఫోసిస్ నెత్తిన మరో పిడుగు జాతి వివక్ష, సీనియర్ అధికారుల వేధింపులు, మేనేజ్మెంట్ కక్షపూరిత వైఖరి తదితర ఆరోపణలు గుప్పిస్తూ అమెరికా ఇమ్మిగ్రేషన్ మాజీ హెడ్ ఎరిన్ గ్రీన్ ఇన్ఫోసిస్ కంపెనీపై దావా వేశారు. 3. పాతనోట్ల మార్పిడికి వారికి గోల్డెన్ ఛాన్స్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లేదా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు తమ దగ్గర ఉన్న పాతనోట్లను రిజర్వ్ బ్యాంక్ ఏ కార్యాలయంలో అయినా మార్పిడి చేసుకోవచ్చని కేంద్రప్రభుత్వం తెలిపింది. 4. హోండా 'క్లిక్' లాంచ్..సరసమైన ధరలో దేశీయ అతిపెద్ద స్కూటర్ తయారీదారు హోండా మరో గేర్ లెస్ స్కూటర్ 'క్లిక్' ను అతి తక్కువ ధరలో మార్కెట్లోకి విడుదల చేసింది. స్పోర్ట్స్.. 1. ఉతప్ప అనూహ్య నిర్ణయం సొంత టీమ్ తో 15 ఏళ్లు అనుబంధాన్ని క్రికెటర్ రాబిన్ ఉతప్ప తెంచుకోనున్నాడు. 2. కోహ్లి అహంభావమే కారణం..! ఏడాదిపాటు భారత క్రికెట్ జట్టుకు అద్భుతమైన సేవలు అందించినప్పటికీ అర్ధంతరంగా కోచ్ పదవి నుంచి క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే తప్పుకోవడం వెనుక.. 3. ఫైనల్ తర్వాత క్లాస్ పీకాడనే.. తీసేశారా? గత ఆదివారం జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో దాయాది పాకిస్థాన్ చేతిలో 180 పరుగుల తేడాతో టీమిండియా బిత్తరపోయేరీతిలో ఓటమి తర్వాత.. -
టుడే న్యూస్ రౌండప్
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలపాలా? లేక మరో అభ్యర్థిని పోటీకి నిలుపాలా? అన్నది ప్రతిపక్షాలు చర్చించుకుంటుండగా.. ప్రతిపక్షాలను విస్మయపరుస్తూ కోవింద్‌కు మద్దతిచ్చేదిశగా బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇక, బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తనను తొలగించడంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. తనపై పెద్ద అభాండం వేసి పదవి నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుకు సంబంధించి ఇప్పటివరకు టాప్ కథనాలు ఇవి.. 1.రాష్ట్రపతి అభ్యర్థిపై విపక్షాల సందిగ్ధం రాష్ట్రపతి అభ్యర్థిగా ఓ దళితుడిని ఖరారు చేయడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రతిపక్షాన్ని సందిగ్ధంలో పడేసింది. 2. ఐవైఆర్ కృష్ణారావుపై ఏపీ ప్రభుత్వం వేటు సోషల్ మీడియాలో ఐవైఆర్ కృష్ణారావు చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి చంద్రబాబు సర్కార్ తొలగించింది. 3. మీరు చస్తే.. పాక్‌లో సమాధి చేస్తారా? చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పరాజయంపై సంబరాలు చేసుకుంటున్నవారికి ప్రశ్న.. 4. విపక్షాలకు షాక్ ఇచ్చి.. కోవింద్‌కు జై! బీజేపీ ఊహించినట్టుగానే కొత్త రాష్ట్రపతి విషయంలో విపక్షాల్లో చీలిక.. 5.నా మీద పెద్ద అభాండం వేశారు: ఐవైఆర్ బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించడంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. 6. కొత్త ‘రాష్ట్రపతి’ గతంలో రెండుసార్లు ఓడారు ఎవ్వరూ ఊహించని విధంగా బిహార్ గవర్నర్, దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఎన్డీయే అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది 7. శివసేన ఏం చేయనుంది? మళ్లీ ఝలకా! తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ రామ్‌నాథ్ కోవింద్‌ను ఎన్డీయే ప్రకటించిన నేపథ్యంలో శివసేన పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 8. కాంగ్రెస్ కూడా ‘రాష్ట్రపతి’గా దళిత వ్యక్తినేనా? దళిత వర్గానికి చెందిన బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను బరిలోకి దింపుతున్నట్లు బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా దళిత వ్యక్తినే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 9. కార్యకర్తకు చెంపదెబ్బ! మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రైతు హత్యలపై నిరసన తెలిపే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సహనం కోల్పోయారు. 10. వేటుకు ఐవైఆర్ ఫేస్బుక్ పోస్టులే కారణమా? తాము చెప్పినట్లు నడుచుకోకపోతే ఎంత సీనియర్ ఐఏఎస్ అధికారులైనా వేటు తప్పదన్నట్లుగా తయారైంది ఏపీలో ప్రస్తుత పరిస్థితి. 11. ఆత్మాహుతి దాడికి సిద్ధం.. అంతలో పట్టేశారు లెబనాన్‌లో ఓ ఉగ్రవాది జాడలను అక్కడి భద్రతా బలగాలు ముందుగానే పసిగట్టాయి. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన అతడిని చాలా చక్యంగా బంధించాయి. 12. రూ.73 కోట్లు ‘చెత్త’లో.. మండూరు పాలికె చెత్త సేకరణ కేంద్రం నుంచి విద్యుత్, ఇంధన ఉత్పత్తి పథకంలో భారీఎత్తున అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఏ.బీ మాలకరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన శాసనసభ స్థాయీ సమితి స్పష్టం చేసింది. .............. క్రీడలు.... 1. మాకు దేశభక్తి ఏమిటి?: క్రికెటర్ క్రికెటర్లు నిజమైన స్టార్లు కాదంటున్నాడు బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మష్రాఫ్ మొర్తజా. డబ్బులు తీసుకుని క్రికెట్ ఆడే తమను నిజమైన స్టార్లుగా ఎలా గుర్తిస్తారంటూ ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టాడు. 2. 'బూమ్రాను చాలాకాలం బాధిస్తుంది' చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన తుది పోరులో భారత ఓటమికి పేసర్ జస్ఫిత్ బూమ్రా వేసిన నో బాల్ కూడా ఒక కారణం. 3. ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు! ప్రస్తుతం భారత అండర్ -19 , భారత్ -ఎ క్రికెట్ జట్లకు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది. ............... బిజినెస్... 1. జూన్ 30 అర్థరాత్రి జీఎస్టీ లాంచ్ ఒక దేశం ఒక పన్ను విధానంలో భాగంగా జూలై 1నుంచి జీఎస్టీ అమలుకు కేంద్రం కసరత్తును పూర్తి చేసింది. . 2. మోటో ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ మోటో ఫ్యాన్స్ కు కోసం ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను తీసుకొచ్చింది. 3. పసిడి ధరలు వెల వెల దేశీ మార్కెట్లో బంగారం ధర వెలవెలబోతోంది. వరుసగా సెషన్లుగా క్షీణిస్తున్న పుత్తడి ధరలు మంగళవారం మరింత దిగి వచ్చాయి. 4. ఆ విద్యార్థులకు సగటు వేతనం రూ.22లక్షలు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) హైదరాబాద్ తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ ఇన్ మేనేజ్ మెంట్ విద్యార్థుల ఫైనల్ ప్లేస్ మెంట్లను విజయవంతంగా పూర్తిచేసింది.. .................... ఎంటర్టైన్మెంట్.. 14. కట్టప్ప తరహాలో ప్రభాస్‌కు మరో వెన్నుపోటు! బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది చాలాకాలం వేధించిన ప్రశ్న. 15. నా కూతురు పెళ్లి చేసుకుంటేనే ఆనందం! అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖాయమైంది. -
ఏపీ సచివాలయంలో ఇద్దరు సీఎస్ల భేటీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్.కృష్ణారావు, రాజీవ్ శర్మ గురువారం సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కమలనాథన్ కమిటీ కూడా హాజరైంది. ఉద్యోగుల విభజనపై చర్చ జరుగుతోంది. కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం ఇంకా ఓ కొలిక్కి రాని విషయం తెలిసిందే. ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉన్నాయి. ఇదే విషయంపై రెండు రాష్ట్రాల సీఎస్‌లు మంగళవారం భేటీ కాగా, సమస్య మాత్రం షరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మరోసారి భేటీ అయ్యారు.