హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్.కృష్ణారావు, రాజీవ్ శర్మ గురువారం సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కమలనాథన్ కమిటీ కూడా హాజరైంది. ఉద్యోగుల విభజనపై చర్చ జరుగుతోంది. కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం ఇంకా ఓ కొలిక్కి రాని విషయం తెలిసిందే.
ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉన్నాయి. ఇదే విషయంపై రెండు రాష్ట్రాల సీఎస్లు మంగళవారం భేటీ కాగా, సమస్య మాత్రం షరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మరోసారి భేటీ అయ్యారు.